బెజవాడ టీడీపీ నేతల మధ్య ఓ ఆసక్తికర విషయం హల్‌చల్ చేస్తోంది. స్థానిక ఎన్నికలకు ముహూర్తం ఫిక్సయితే.. ఆ జాబితాలో విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కూడా ఉంటాయి. ఈ క్రమంలో మేయర్ పీఠం ఎవరికి? అనే ప్రశ్న.. మరోసారి తెరమీదికి వచ్చింది. వాస్తవానికి ఇప్పటికే కేశినేని నాని కుమార్తె కేశినేని శ్వేతకు కేటాయించారు. దీంతో ఇప్పటికే కేశినేని కుటుంబం మేయర్ అభ్యర్థిగా శ్వేత కూడా ప్రచారానికి దిగారు. అయితే..అనూహ్యంగా ఎన్నికలు వాయిదా పడిన విషయం తెలిసిందే.
అయితే.. ఇటీవల కాలంలో పార్టీకి కేశినేని నాని దూరంగా ఉంటున్నారు. విజయవాడ ఎంపీగా తనకు పార్టీలో ప్రాధాన్యం దక్కడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ విషయాన్ని నేరుగా చెప్పకుండా ఆయన స్వపక్షంలోనే విపక్షంగా మారి విమర్శలకు దిగారు. పైగా.. కమ్మ సామాజిక వర్గంపైనే ఆయన విమర్శలు ఎక్కు పెట్టారు. ఈ పరిణామంతో విజయవాడ నగరంలోని కమ్మ వర్గం సహా.. విజయవాడ నగర పార్టీ కూడా నాయకులు కూడా కేశినేనికి దూరంగా ఉంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా.. మేయర్ అభ్యర్థిని మార్చాలనే డిమాండ్ తెరమీదకి వచ్చింది.
ఇటీవల నలుగురు కమ్మ సామాజిక వర్గానికి చెందిన విజయవాడ నాయకులు.. భేటీ అయి.. మేయర్ అభ్యర్థి విషయంలో చంద్రబాబు పునరాలోచించాలని.. అందరినీ కలుపుకొని పోయే నాయకురాలికి కేటాయించాలని కొత్త డిమాండ్‌ను తెరమీదికి తెచ్చారు. మేయర్ అభ్యర్థిగా మాజీ జెడ్పీ చైర్ పర్సన్.. గద్దె అనురాధ వైపు వీరు మొగ్గుతున్నారు. తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సతీమణి.. అనురాధ.. అయితే.. బాగుంటుందనేది వీరి అంతర్గత సంభాషణల్లో వచ్చిన సూచన. అయితే.. నేరగా ఈ విషయాన్ని చెప్పకుండా.. అభ్యర్థిని మార్చాలంటూ.. చంద్రబాబు లేఖ రాసినట్టు తెలిసింది. ప్రస్తుతం ఈ విషయం విజయవాడ రాజకీయాల్లో చర్చగా మారింది. మరి బాబు ఏం చేస్తారు? ఇప్పటికే ప్రకటించిన శ్వేత అభ్యర్థిత్వాన్ని వెనక్కి తీసుకుంటారా? లేక ఆమెనే కొనసాగిస్తారా? అనేది చూడాలి.
This post was last modified on November 29, 2020 12:57 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…