Political News

డిబేట్‌:  మోడీని ఎవ‌రు మెప్పించారు.. జ‌గ‌నా.. బాబా ..!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీకి జాతీయ రాజ‌కీయాల్లో తిరుగులేదు. గ‌త మూడు సార్లుగా ఆయ‌న విజ‌యం ద‌క్కించుకుంటున్నారు. దీంతో ప‌లు రాష్ట్రాల్లో ముఖ్య‌మంత్రులు ఆయ‌న‌ను మ‌చ్చిక చేసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. త‌ట‌స్థంగా ఉండే రాజ‌కీయ పార్టీల నేత‌లు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న రాష్ట్రాల్లోనూ మోడీని మెప్పించే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. ముఖ్యంగా ఏపీలో ఎలానూ ఎన్డీయే స‌ర్కారే ఉంది. సో.. ఇక్క‌డ ఎలాంటి ఇబ్బంది లేదు.

అయితే.. గ‌తంలో 2014-19 మ‌ధ్య కంటే ఇప్పుడు ఎక్కువ‌గా సీఎం చంద్ర‌బాబు.. ప్ర‌ధాని మోడీ విష‌యంలో అనుస‌రిస్తున్న తీరు.. ఆయ‌న‌ను ఆహ్వానిస్తూ.. కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్న తీరు.. మోడీని ఒకింత ఆక‌ట్టు కుంటోద‌న్న వాద‌న వినిపిస్తోంది. గ‌తంలో ఐదేళ్ల పాలన‌లో కేవ‌లం ఒక‌టి రెండు సార్లు మాత్ర‌మే మోడీని రాష్ట్రానికి ఆహ్వానించారు. కానీ, ఈ ద‌ఫా తొలి 16 మాసాల్లోనే ఐదు సార్లు మోడీని ఏపీకి ఆహ్వానించడం ద్వారా.. ఆయ‌న‌ను ప‌లు మార్లు ప్ర‌శంసించ‌డం ద్వారా మోడీని అమితంగా ఆక‌ట్టుకున్నార‌ని.. విశ్లేష‌కులు చెబుతున్నారు.

ఈ త‌ర‌హా ప‌రిస్థితి జ‌గ‌న్ విష‌యంలో క‌నిపించ‌లేదు. జ‌గ‌న్ హ‌యాంలోనూ మోడీ రెండు సార్లు ఏపీకి వ‌చ్చారు. అల్లూరి సీతారామ‌రాజు విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించేందుకు ఒక‌సారి.. క‌ర్నూలుకు మ‌రోసారి వ‌చ్చారు. అయితే.. అప్ప‌ట్లో మోడీని ప్ర‌శంసించ‌కుండా కేవ‌లం స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావించారు. ఇది రాష్ట్రానికి పెద్ద‌గా మేలు చేయ‌క‌పోయినా.. జ‌గ‌న్‌కు అస‌లు ఏమాత్రం క‌లిసి రాలేద‌ని అంటారు. ఈ ప‌రిణామంతో మోడీ ద‌గ్గర జ‌గ‌న్ మార్కులు వేయించుకోలేక పోయారు. వాస్త‌వానికి.. మోడీతీసుకున్న అనేక నిర్ణ‌యాల‌కు జ‌గ‌న్ స‌పోర్టు చేశారు.

కానీ, ఆయ‌న ద‌గ్గ‌ర చంద్ర‌బాబు ద‌క్కించుకున్న మార్కుల్లో స‌గం కూడా జ‌గ‌న్ తెచ్చుకోలేక‌పోయారు. తాజాగా జ‌రిగిన క‌ర్నూలు స‌భ‌లో మోడీ ప‌దే ప‌దే చంద్ర‌బాబును ప్ర‌శంసించారు. విజ‌న్ ఉన్న నాయ‌కుడు అంటూ.. 4 సార్లు చెప్పారు. మంచి నాయ‌క‌త్వం అంటూ.. 8 సార్లు చెప్పుకొచ్చారు. జ‌గ‌న్ హ‌యాంలో ఇలా ఒక్క‌సారి కూడా ఎక్క‌డా చెప్ప‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. అయితే.. ప్ర‌స్తుతం కేంద్రంలో త‌న ప్ర‌భుత్వం నిల‌బ‌డ‌డం వెనుక చంద్ర‌బాబు ఉన్న కార‌ణం కూడా దీనికి దోహ‌ద‌ప‌డింద‌న్న వాద‌నున్నా.. మోడీ మ‌న‌సును మాత్రం చంద్ర‌బాబు గెలుచుకున్నార‌న్న వాద‌నే బ‌లంగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on October 18, 2025 12:44 pm

Share

Recent Posts

ఈ అరాచకమేంటి గిల్ బాబు

వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…

24 minutes ago

జ‌గ‌న్‌కు షాక్ ఇవ్వాలని ఫిక్స్ అయిన సాయిరెడ్డి

వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా పార్టీ పెట్ట‌నున్న‌ట్టు రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖ‌ప‌ట్నంలో మాట్లాడిన ఆయ‌న‌..…

32 minutes ago

తండ్రిపై ప్రేమ‌.. శ‌వాన్ని నాలుగేళ్లుగా.. !

తల్లిదండ్రుల‌పై ప్రేమ ఉండాల్సిందే. కానీ, అది వారు జీవించినంత వ‌ర‌కు ఉండాల్సిందే. కానీ, జ్యాత‌స్య‌హి ధ్రువో మృత్యు.. అన్న‌ట్టుగా కాలం…

36 minutes ago

దుబాయ్ విమానంలో ఫైటింగ్… 180 మందిని కాపాడిన ఇండియన్ కెప్టెన్

భూమికి 33 వేల అడుగుల ఎత్తులో... ఆకాశంలో యుద్ధం జరిగింది. సినిమాను తలపించిన ఈ యుద్ధంలో హీరో ఇండియన్ కెప్టెన్…

57 minutes ago

405 అయినా సరే… తగ్గేదే లే!!

వన్డేల్లో 405 పరుగులు చేసిన తర్వాత కూడా ఓడిపోతామని వెస్టిండీస్ ఊహించి ఉండదు. గువాహటిలో ఆ జట్టు బ్యాటర్లు చెలరేగిపోయారు.…

1 hour ago

సిరిసిల్ల కాదు.. ఉరిసిల్ల‌.. రెచ్చిపోయిన రేవంత్‌రెడ్డి

టార్గెట్ కేటీఆర్.. ల‌క్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. బీఆర్ఎస్ నాయ‌కుడు, మాజీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న…

2 hours ago