Political News

బీఆర్ఎస్ నోట ఓట్ చోరీ మాట‌: హైకోర్టుకు నేత‌లు!

చిత్రంగా ఉన్నా.. ఇది వాస్త‌వం. ఇప్ప‌టి వ‌ర‌కు బీహార్‌లో మాత్ర‌మే వినిపించిన ఓట్ చోరీ మాట‌.. ఇప్పుడు తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ నోట కూడా వినిపించింది. అనూహ్యంగా ఆ పార్టీ ఈ వ్య‌వ‌హారంపై హైకోర్టును ఆశ్ర‌యించింది. ఈ విష‌యంపై విచార‌ణను చేప‌ట్టాల‌ని.. త‌క్ష‌ణ‌మే విచారించాల‌ని కోరుతూ.. గురువారం లంచ్ మోష‌న్ పిటిష‌న్ దాఖ‌లు చేసింది. దీనిలో ప‌లు విష‌యాల‌ను పేర్కొంది.

ప్ర‌స్తుతం రాష్ట్రంలో చ‌ర్చ‌నీయాంశంగా మారిన‌.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌.. అటు అధికార కాంగ్రెస్ పార్టీకి, ఇటు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్‌కు కూడా కీల‌కంగా మారిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే అభ్య‌ర్థిని కూడా ఖ‌రారు చేసిన బీఆర్ఎస్.. మాగంటి సునీత‌తో నామినేష‌న్ కూడా వేయించింది. ఇక‌, మ‌రోవైపు.. ఎన్నిక‌ల సంఘం ఇప్ప‌టికే జాబితాల‌ను కూడా రిలీజ్ చేసింది. ఇంత జ‌రిగిన త‌ర్వాత‌.. అనూహ్యంగా జూబ్లీహిల్స్ లో ఓట్ చోరీ జ‌రిగింద‌ని ఆరోపిస్తూ.. బీఆర్ఎస్ కోర్టుకు వెళ్ల‌డం ఆశ్చ‌ర్యంగా ఉంది.

జూబ్లీహిల్స్‌లో సుమారు 30 వేల ఓట్లను తొల‌గించార‌ని పేర్కొన్న బీఆర్ఎస్‌.. భారీ ఎత్తున న‌కిలీ ఓట‌ర్ల‌ను.. చేర్చార‌ని ఆరోపించింది. కాంగ్రెస్‌, బీజేపీల‌కు అనుకూలంగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల‌కు చెందిన ఓట‌ర్ల‌ను తీసుకు వ‌చ్చి .. ఇక్క‌డ ఓటు హ‌క్కు క‌ల్పించార‌ని పేర్కొన‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు.. త‌ద్వారా ఏక‌ప‌క్షంగా గెలిచేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని పేర్కొంది. దీనిపై త‌క్ష‌ణం విచార‌ణ జ‌రపాల‌ని కోరింది. అయితే.. వాస్త‌వానికి ఎన్నిక‌ల సంఘం జాబితాల‌ను కూడా రెడీ చేసి విడుద‌ల చేసిన త‌ర్వాత‌.. బీఆర్ఎస్ ఎత్తి చూపిన ఈ వాద‌న ఏమేర‌కు నిల‌బ‌డుతుందో చూడాలి.

This post was last modified on October 16, 2025 3:46 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఆగకుండా ఆగమాగం చేస్తున్న దురంధర్

దురంధర్ ఎక్కడ ఆగుతుందో అర్థం కాక బాలీవుడ్ ట్రేడ్ పండితులు తలలు పట్టుకుంటున్నారు. మాములుగా మంగళవారం లాంటి వీక్ డేస్…

2 hours ago

సహానా సహానా… అంచనాలు అందుకున్నానా

రాజా సాబ్ నుంచి రెండో ఆడియో సింగల్ వచ్చేసింది. దర్శకుడు మారుతీ లిరికల్స్ కు పరిమితం కాకుండా ఏకంగా వీడియో…

3 hours ago

షర్మిలకు బాబు, పవన్, లోకేష్ విషెస్… మరి జగన్?

చెల్లెలికి బర్త్‌డే విషెస్ చెప్పని అన్న… వినడానికి ఇంట్రెస్టింగ్‌గా ఉంది కదా! పాలిటిక్స్‌లో అది ఎవరై ఉంటారు? అని ఎవరైనా…

5 hours ago

‘సింపతీ కార్డ్’పై నాగవంశీ కౌంటర్

సినిమాల్లో కంటెంట్ ఎలా ఉందన్న దాని కంటే.. ఆ సినిమా టీంలో ముఖ్యమైన వ్యక్తుల మాటతీరును, నడవడికను బట్టి కూడా సినిమాకు ఓపెనింగ్స్…

7 hours ago

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హతపై సంచలన నిర్ణయం

తెలంగాణలో బీఆర్ఎస్ కు చెందిన 10 మంది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు వ్యవహారం రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే.…

8 hours ago

కొత్త రిలీజుల తాకిడి… అవతారే పైచేయి

అఖండ 2 తాండవంతో గత వారం గడిచిపోయాక ఇప్పుడు మూవ్ లవర్స్ చూపు కొత్త ఫ్రైడే మీదకు వెళ్తోంది. బాలయ్య…

8 hours ago