ఎన్నికలు జరుగుతోంది తెలంగాణలో. అది కూడా జీహెచ్ఎంసీ పీఠం కోసం. అందుకోసం టీఆర్ఎస్, బీజేపీ హోరాహోరీగా తలపడుతున్నాయి. మాటల యుద్ధాలు సాగిస్తున్నాయి. కానీ ఈ ఎన్నికలతో సంబంధం లేని ఇద్దరు వ్యక్తుల మధ్య రచ్చ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్‌కు.. మెగా బ్రదర్ నాగబాబుకు అనుకోని వివాదం తలెత్తి సోషల్ మీడియాలో దాని గురించి పెద్ద చర్చ నడుస్తోంది. ఒక ఇంటర్వ్యూలో భాగంగా అనుకోకుండా పవన్ కళ్యాణ్ ప్రస్తావన వస్తే.. ఆయన ఎప్పటికప్పుడు రాజకీయ విధానాలు మార్చుకోవడం, భారతీయ జనతా పార్టీలో చేరి తన విలువ తగ్గంచుకోవడం గురించి ప్రకాష్ రాజ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పనిలో పనిగా పవన్ ఊసరవెల్లి రాజకీయాలు చేస్తున్నాడని కామెంట్ చేశాడు.
ఈ వ్యాఖ్యలు పవన్ సోదరుడు నాగబాబుకు బాగా కోపం తెప్పించాయి. ప్రకాష్ రాజ్‌ను తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ ఆయన ఒక పోస్టు పెట్టారు. అందులో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు అందరికీ అభ్యంతరకరంగానే అనిపించాయి. ప్రకాష్ రాజ్ నిర్మాతల్ని కాల్చుకు తిన్నాడని, సుబ్రహ్మణ్యస్వామి ప్రకాష్ రాజ్‌ను తొక్కి పెట్టి నారతీశారని నాగబాబు వ్యాఖ్యానించారు. ఐతే ఈ స్పందనపై ఇప్పుడు ప్రకాష్ రాజ్ సైతం స్పందించాడు. ఆయన హుందాగానే నాగబాబుకు బదులిచ్చే ప్రయత్నం చేశారు. ‘‘గౌరవనీయులైన నాగబాబుగారికి.. మీ తమ్ముడు మీద ఉన్న ప్రేమ నాకు అర్థం అయ్యింది. నాకు దేశం మీద ఉన్న ప్రేమని మీరు అర్థం చేసుకోండి. నాకు తెలుగు భాష వచ్చు కానీ మీ భాష రాదు’’ అంటూ దండాలు పెడుతున్న సింబల్స్ పెట్టి ముగించేశారు ప్రకాష్ రాజ్. హుందాతనంతో కూడిన ఈ స్పందనతో ప్రకాష్ రాజ్.. నాగబాబును ఆత్మరక్షణలోకి నెట్టాడనడంలో సందేహం లేదు.
This post was last modified on November 28, 2020 10:34 pm
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…
గత ప్రభుత్వంలో కాకినాడ సీ పోర్టు.. సెజ్ చేతులు మారిన సంగతి తెలిసిందే. అయితే.. తన నుంచి బలవంతంగా పోర్టును…
ఈ మధ్య మన తెలుగు సినిమాలు జపాన్, చైనా లాంటి దేశాల్లో బాగా ఆడుతున్నాయి. ఆర్ఆర్ఆర్ కు దక్కిన ఆదరణ…
మానవాళి చరిత్రలో అనూహ్య ఘటన ఒకటి చోటు చేసుకోనుంది. మారథాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఐదు…
నారా లోకేశ్… ఇప్పటిదాకా మనకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఏపీ కేబినెట్ లో కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రిగా……
అగ్ర రాజ్యం అమెరికాకు 47వ అధ్యక్షుడిగా ఆ దేశ ప్రముఖ వ్యాపారవేత్త డొనాల్డ్ జే ట్రంప్ రెండు రోజుల క్రితం…