జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల వేడి రాజుకుంటోంది. తాజాగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు.. రహ్మత్‌నగర్‌లో నిర్వహించిన కార్యక్రమం… వాడి వేడిగా సాగింది. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి, బీఆర్ఎస్ అభ్యర్థి.. మాగంటి సునీత కన్నీరు పెట్టుకున్నారు. తన భర్త ఈ నియోజకవర్గం ప్రజలను కడుపులో పెట్టుకుని చూసుకున్నారని తెలిపారు. ఏ సమస్య వచ్చినా వారికి వెన్నంటి ఉన్నారని గుర్తు చేసుకుంటూ.. కన్నీటి పర్యంతమయ్యారు.
ఇక, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. కీలక వ్యాఖ్యలతో విమర్శల జోరు పెంచారు. జూబ్లీహిల్స్ ఓటర్లు.. కారు కావాలో.. బుల్డోజర్ కావాలో తేల్చుకోవాలని ఆయన సూచించారు. కారు గెలిస్తే.. నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతుందన్నారు. అదే కాంగ్రెస్‌కు ఓటేస్తే.. చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలపై ముఖ్యం గా పేదల ఇళ్లపైకి బుల్డోజర్ వస్తుందని.. పలు ఉదాహరణలుచెప్పుకొచ్చారు. బస్తీలకు రక్షణ కావాలంటే కారు గుర్తుకు ఓటయాలని పిలుపునిచ్చారు.
గత ఎన్నికల్లో ఆరు గ్యారెంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఏ ఒక్కటీ అమలు చేయలేద ని విమర్శించారు. ఈ నేపథ్యంలో ఇంటింటికీ తిరిగి ఆ గ్యారెంటీ మోసాలను ప్రచారం చేస్తామని తెలిపా రు. ఇక, బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ను చిత్తు చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. అప్పుడే.. ఆరు గ్యారెంటీలు అమలవుతాయని చెప్పారు. రాష్ట్రంలో ఏపనికావాల న్నా లంచాలు ఇవ్వక తప్పడం లేదన్నారు. ఇవన్నీ పోవాలంటే.. మాగంటి సునీతను గెలిపించాలని కోరారు.
నోటిఫికేషన్ జారీ..
మరోవైపు.. కేంద్ర ఎన్నికల సంఘం జూబ్లీహిల్స్ ఉప పోరుకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది. కొన్ని రోజుల కిందట షెడ్యూల్ ఇచ్చిన ఈసీ.. ఇప్పుడు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 13 నుంచి నామినేషన్లు సమర్పించ వచ్చు. 21వ తేదీ వరకు గడువు ఉంది. 22న పరిశీలన ఉంటుంది. 24వ తేదీ వరకు ఉపసంహరించుకోవచ్చు. నవంబరు 11న పోలింగ్, 14న ఫలితం ప్రకటిస్తారు.
This post was last modified on October 14, 2025 9:41 am
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…