Political News

దేశంలోనే ఫ‌స్ట్ టైమ్‌: చంద్ర‌బాబు భారీ అగ్రిమెంట్‌!

ఏపీ సీఎం చంద్ర‌బాబు ఇప్ప‌టి వ‌ర‌కు అనేక పెట్టుబ‌డులు తెచ్చారు. కానీ, మంగ‌ళ‌వారం ఆయ‌న ఢిల్లీలో చేసుకునే ఓ కీల‌క ఒప్పందం మాత్రం ఆయ‌న రాజ‌కీయ జీవితంలోనే అతి పెద్ద ఒప్పందంగా మార‌నుంది. ఈ విష‌యాన్ని ఆయ‌న మ‌రోసారి గుర్తు చేశారు. తాజాగా అమ‌రావ‌తిలో ప‌ర్య‌టించిన ఆయ‌న‌.. మునిసిప‌ల్ శాఖ‌కు చెందిన హెచ్ వోడీని ప్రారంభించారు. అనంత‌రం.. మీడియాతో మాట్లాడుతూ.. తాను ఢిల్లీకి వెళ్తున్నాన‌ని.. భారీ అగ్రిమెంట్ చేసుకుంటున్నాన‌ని చెప్పారు. ఇది ఏపీకి గేమ్ చేంజ‌ర్‌గా మారుతుంద‌ని చెప్పారు. ఈ ఒప్పందంతో ఏపీ భ‌విత కూడా మారుతుంద‌న్నారు.

ఏంటీఒప్పందం..

గూగుల్ స‌హ సంస్థ రైడైన్‌తో ఏపీ ప్ర‌భుత్వం ఒప్పందం చేసుకుంటోంది. దీని విలువ ఏకంగా 90 వేల కోట్ల రూపాయ‌లు. ఇదే ఇప్ప‌టి వ‌ర‌కు ఏపీకి వ‌చ్చిన అతి పెద్ద పెట్టుబ‌డి. ఈ సంస్థ విశాఖ‌లో అతి పెద్ద డేటా కేంద్రాన్నిఏర్పాటు చేయ‌నుంది. 2029 నాటికి డేటాసెంటర్‌ను సంస్థ పూర్తి చేస్తుంది. అయితే.. దేశంలోనే అతిపెద్ద డేటా కేంద్రం ఇదే కావ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. నిజానికి అటు గూగుల్ సంస్థ హిస్ట‌రీలో కూడా భార‌త్‌లో ఇంత పెద్ద పెట్టుబ‌డి పెట్ట‌డం ఇదే తొలిసారి అని తెలుస్తోంది. అది కూడా ఏపీలో పెట్ట‌డం గ‌మ‌నార్హం.

దీనివెనుక‌.. మైక్రోసాఫ్ట్ స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు బిల్ గేట్స్ ఉన్నార‌న్న ప్ర‌చారం ఉంది. ఇక‌, ఈ డేటా కేంద్రం ఏర్పాటుతో విశాఖ‌ప‌ట్నం `డేటాసెంటర్‌ హబ్‌`గా మారుతుంది. ఏఐ, హైఎండ్‌ ఉద్యోగాలు వ‌స్తాయి. డేటా సెంటర్‌కు సింగపూర్‌ నుంచి సబ్‌మెరైన్‌ కేబుల్‌ను సముద్రమార్గంలో సంస్థ ఏర్పాటు చేస్తుంది. దీనికి కూడా రాష్ట్ర ప్ర‌భుత్వం స‌హ‌కారం అందించ‌నుంది. ఈ ప్రాజెక్టు రాష్ట్రానికి వచ్చేందుకు ప్రధాని మోడీ, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్  కూడా స‌హ‌క‌రించార‌ని సీఎం చంద్ర‌బాబు తాజాగా వెల్ల‌డించారు.

This post was last modified on October 13, 2025 6:49 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

టీ-బీజేపీ… మోడీ చెప్పాక కూడా మార్పు రాలేదా?

తెలంగాణ బిజెపిని దారిలో పెట్టాలని, నాయకుల మధ్య ఐక్యత ఉండాలని, రాజకీయంగా దూకుడు పెంచాలని కచ్చితంగా నాలుగు రోజుల కిందట…

32 minutes ago

క్రింజ్ కామెంట్ల‌పై రావిపూడి ఏమ‌న్నాడంటే?

అనిల్ రావిపూడిని టాలీవుడ్లో అంద‌రూ హిట్ మెషీన్ అంటారు. ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి త‌ర్వాత అప‌జ‌యం లేకుండా కెరీర్‌ను సాగిస్తున్న…

35 minutes ago

100 కోట్లు ఉన్నా ప్రశాంతత లేదా? ఎన్నారై స్టోరీ వైరల్!

అమెరికా వెళ్లాలి, బాగా సంపాదించి ఇండియా వచ్చి సెటిల్ అవ్వాలి అనేది చాలామంది మిడిల్ క్లాస్ కుర్రాళ్ళ కల. కానీ…

57 minutes ago

ట్రెండుకు భిన్నంగా వెళితే ఎలా జగన్?

బ‌లంగా మాట్లాడాలి. మాట‌కు మాట కౌంట‌ర్ ఇవ్వాలి. అది వింటే ప్ర‌త్య‌ర్థులు నోరు అప్ప‌గించాలి!. రాజకీయాల్లో ఇప్పుడు ఇదే ట్రెండ్…

4 hours ago

మహిళా డాక్టర్ హిజాబ్ ను తొలగించిన సీఎం

బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. సోమవారం పట్నాలోని ముఖ్యమంత్రి నివాసంలో నిర్వహించిన ప్రభుత్వ కార్యక్రమంలో, నియామక…

5 hours ago