క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూస్తుంటే అలాగే ఉంది. మామూలుగా అసెంబ్లీ సమావేశాలంటే ప్రతిపక్షాలు చాలా ఉత్సాహంగా ఉంటాయి. ఎందుకంటే అనేక సమస్యలపై అదికారపక్షాన్ని ఉతికి ఆరేసేందుకు. కానీ రాష్ట్రంలో మాత్రం రాజకీయం రివర్సు గేరులో నడుస్తోంది. ఎందుకంటే అసెంబ్లీలో ప్రస్తావించేందుకు సమస్యలంటు పెద్దగా లేవనే చెప్పాలి. ఎందుకంటే కరోనా వైరస్ కారణంగా మిగిలిన అంశాలన్నీ వెనకబడిపోయాయి.
నవంబర్ 30 తేదీ నుండి డిసెంబర్ 4వ తేదీ వరకు శీతాకాల సమావేశాలు జరపాలని స్ధూలంగా ప్రభుత్వం నిర్ణయించింది. ఏదో సమావేశాలను నిర్వహించాలి కాబట్టి మొక్కుబడిగా నిర్వహించటమంతే. అసెంబ్లీలో ప్రతిపక్ష టీడీపీ ప్రస్తావించటానికి పెద్దగా అంశాలు కూడా ఏమీ లేవనే చెప్పాలి. కాకపోతే ప్రభుత్వం మీద ఆరోపణలు చేయాలి కాబట్టి కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో ఫెయిల్ అయ్యిందని, ఎస్సీ, ముస్లింలపై దాడులు జరుగుతున్నాయని, టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారంటూ గోల చేయటానికి అసెంబ్లీ పనికొస్తుందంతే.
అయితే వీటన్నింటికన్నా అసెంబ్లీ సమావేశాలంటే తెలుగుదేశంపార్టీని టెన్షన్ పెట్టేస్తున్న అంశం మరొకటుంది. అదేమిటంటే ఈసారి ఏ ఎంఎల్ఏ పార్టీకి దూరమైపోతారు ? అని. ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలు పెట్టినపుడే గన్నవరం ఎంఎల్ఏ వల్లభనేని వంశీ టీడీపీకి దూరమయ్యారు. ఆ తర్వాత మద్దాలి గిరి కూడా ఇలాగే వెళ్ళిపోయారు. ఆమధ్య కరణం బలరామ్ కూడా పార్టీకి అసెంబ్లీ సమావేశాల సమయంలోనే దూరం అయ్యారు.
మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లోనే ఇద్దరు ఎంఎల్సీలు పోతుల సునీత, శివనాధరెడ్డి దూరం అయ్యారు. ఈ మధ్య వైజాగ్ ఎంఎల్ఏ వాసుపల్లి గణేష్ కూడా ఇలాగే పార్టీలో నుండి వెళ్ళిపోయారు. ఇక రేపటి అసెంబ్లీ సమావేశాలంటే ఇంకెవరు పార్టీకి దూరం అవుతారో అనే చర్చ పార్టీలో మొదలైపోయింది. విచిత్రమేమిటంటే టీడీపీకి దూరమైన ఎంఎల్ఏల్లో ఎవరు కూడా వైసీపీలో చేరలేదు. టీడీపీకి దూరమైపోయి అసెంబ్లీలో విడిగా కూర్చుంటున్నారంతే.
This post was last modified on November 28, 2020 2:24 pm
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…