దేశంలోనే గ్రాండ్ ఓల్డ్ పార్టీగా ముద్ర పడిన కాంగ్రెస్ పార్టీ అంటేనే… అదోక అగూర గంప. వయసు ఉఢిగిన సీనియర్లతో పాటుగా అప్పుడప్పుడే రాజకీయాల్లోకి వచ్చిన కుర్ర నేతల సమాహారం కాంగ్రెస్. అలాంటి పార్టీలో నిత్యం వివాదాలు రేగుతూ ఉంటాయి. వాటికవే సమసిపోతూ ఉంటాయి. ఎవరైనా కీలక నేత తన సహచర నేతను అదాటుగా ఓ బూతు అన్నాడుకో అదో పెద్ద రచ్చ. అయితే అలాంటి రచ్చలు కూడా కాంగ్రెస్ లో ఇట్టే సమసిపోతాయి. తాను తిట్టిన నేతకు సారీ చెప్పే నేత ఆ తర్వాత బాధితుడితో పాటు మిగిలిన నేతలతో కలిసి బంతి భోజనంలో కూర్చుని అరమరికలు లేకుండా మాట్లాడుకుంటారు. అదే కాంగ్రెస్ బలం అని చెప్పక తప్పదు.
ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో అలాంటి ఘటనే జరిగింది. బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్…తన సహచర మంత్రి, కొత్త మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పై దున్నపోతు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారం చిలికిచిలికి గాలివానలా మారింది. అడ్లూరి కూడా పొన్నంపై ఎాదురు దాడికి సిద్ధమైపోయారు. ఇలాంటి తరుణంలో సీఎం రేవంత్ రెడ్డినో, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆదేశాలతోనే పొన్నం తన తప్పును తెలుసుకున్నారు. అడ్లూరికి బేషరతుగా క్షమాపణలు చెప్పేందుకు సిద్ధమయ్యారు. అంతే ముందూ వెనుకా చూడకుండా అడ్లూరి వద్దకు వెళ్లి ఆయన సారీ చెప్పేశారు. అడ్లూరి కూడా శాంతించారు.
అంతే అంత పెద్ద వివాదం ఒకే ఒక్క సారీతో పరిష్కారం అయిపోయింది. అప్పటికే అక్కడికి చేరుకున్న మహేశ్ గౌడ్, ఒకరిద్దరు మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు… ఇక సమస్య పరిష్కారం అయ్యింది కదా… మరి ఆకలి దంచేస్తోంది అంటూ సాగదీశారు. దీంతో అక్కడికక్కడే నిమిషాల్లో అల్పాహారం రెడీ కాగా… వారంతా కలిసి నవ్వుతూ తుళ్లుతూ అల్పాహారాన్ని ఆరగించారు. ఈ దృశ్యాలను చూసినవారంతా ఎంత కీచులాడుకున్నా కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య అవగాహన మంచిగా ఉంటుందని, అదే ఆ పార్టీకి బలమని వ్యాఖ్యలు చేస్తున్నారు.
This post was last modified on October 8, 2025 10:04 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…