ఎన్నికలు వస్తున్నాయంటే చాటు.. బీజేపీ వ్యూహాలు మారుతాయి. గెలుపే ధ్యేయంగా ఎలాంటి వ్యూహాలనైనా కమల నాథులు అమలు చేస్తున్నారు. దీనిలో భాగంగానే గతంలో వైరం ఉన్న టీడీపీతో చేతులు కలిపి గత ఏడాది జరిగిన ఏపీ ఎన్నికలలో విజయం దక్కించుకున్నారు. అదేవిధంగా ఇప్పుడు తమిళనాడుపైనా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. తమిళనాడులో వచ్చే ఫిబ్రవరి – మార్చి మధ్య సార్వత్రిక ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. ఈ క్రమంలో నిన్న మొన్నటి వరకు తమను తిట్టిపోసిన ఇళయ దళపతి, టీవీకే అధినేత విజయ్‌ను మచ్చిక చేసుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
వాస్తవానికి బీజేపీ.. తమిళనాడు విషయంలో వేయని పాచిక లేదు. అనుసరించని వ్యూహం లేదు. గతంలో తమిళ సూపర్ స్టార్ రజనీని ముందు పెట్టి రాజకీయాలు చేశారు. ఆయన సొంతగా పార్టీ పెట్టుకున్నప్పుడు.. బీజేపీ ఎంట్రీ ఇచ్చింది. ముందు నువ్వు.. తర్వాత నేను.. అనే వ్యూహానికి తెరదీసింది. వాస్తవానికి తమిళ ప్రజలు బీజేపీ విషయంలో జాగరూకతతోనే ఉన్నారు. అందుకే మూడు దశాబ్దాల్లో ఎన్నడూ ఇక్కడ బీజేపీ ఆశించిన మేరకు ఫలితాన్ని రాబట్టుకోలేక పోయింది. అయినా.. ప్రయత్నాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి.
జయలలిత పార్టీ అన్నాడీఎంకేలో చీలికలు తీసుకువచ్చి తాను లబ్ధి పొందే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో జయ నెచ్చెలిని జైలుకు పంపారు. ఇప్పుడు కూడా ఆమె ఆస్తులపై దాడులు చేయించారు. కరోనా సమయంలో ఆస్తులు పెరిగాయన్న కారణంగా ఇటీవల సీబీఐ దాడులు చేసింది. దీంతో జయ నెచ్చెలిగా పేరొందిన శశికళ ఇప్పుడు సైలెంట్ అయ్యారు. ఇక, రజనీ గతంలోనే బీజేపీ వ్యూహాన్ని పసిగట్టి.. దూరం జరిగారు. అసలు రాజకీయాలే వద్దన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా బీజేపీ కన్ను విజయ్‌పై పడింది.
టీవీకే పార్టీ ద్వారా తమిళనాడులో ప్రభంజనం సృష్టించాలని నిర్ణయించుకున్న విజయ్.. గత ఏడాది నుంచి యాక్టివ్ పాలిటిక్స్‌లోకి వచ్చారు. ఆయన పెడుతున్న సభలకు భారీ స్పందన కూడా వస్తోంది. ఈ క్రమంలో ఆయన తాను ఎవరికీ తోక కాదని.. ఎవరికీ మద్దతు ఇవ్వనని చెబుతున్నారు. అయితే.. తాజాగాకరూర్‌లో చోటు చేసుకున్న తొక్కిసలాట.. 41 మంది మృతి అనంతరం.. అనూహ్యంగా బీజేపీ ఆయనకు మద్దతు పలికింది. ఈ విషయంలో విజయ్ తప్పులేదని బహిరంగ ప్రకటనలు చేశారు.
తద్వారా ఆయనను చేరువ చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో విజయ్ తనను తాను కాపాడుకుని.. పార్టీని పైకి తెచ్చేందుకు ఎవరో ఒకరి మద్దతు అవసరం అనే స్థాయిలో ఉన్నారు. దీనిని బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. మరి ఈ ప్రయత్నాలు ఫలిస్తాయా? లేదా? అనేది పక్కన పెడితే.. బీజేపీ కుటిల రాజకీయాలపై తమిళులు నిప్పులు చెరుగుతున్నారన్నది వాస్తవం.
This post was last modified on October 4, 2025 8:31 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…