Political News

బాబా మ‌జాకా: సంక్షేమానికి పోలిక పెట్టి.. వైసీపీని ఏకేశారుగా!

సీఎం చంద్ర‌బాబు అంటేనే మాట‌ల మాంత్రికుడుగా పేరు తెచ్చుకున్నారు. ఏ విష‌యాన్న‌యినా అల‌వోక‌గా స్పృశించే సీఎం చంద్ర‌బాబు.. తాజాగా విజ‌య‌న‌గ‌రం జిల్లాలో ప‌ర్య‌టించి.. గ‌త 15 మాసాలుగా ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ కార్య‌క్రమాల‌ను గుక్క తిప్పుకోకుండా వివ‌రించారు. అంతేకాదు.. ఇదేస‌మ‌యంలో ఆయ‌న వైసీపీ హ‌యాంలో జ‌రిగిన సంక్షేమ కార్యక్ర‌మాల‌కు, ప్ర‌స్తుతం అమ‌లు చేస్తున్న సంక్షేమానికి పోలిక పెడుతూ.. ఏకేశారు. ఈ క్ర‌మంలో ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో అమ‌లవుతున్న ప‌థ‌కాల‌ను కూడా ఆయ‌న ప్ర‌స్తావించారు. మాన‌వ‌త్వంతో సామాజిక భ‌ద్ర‌తా పింఛ‌న్ల‌ను పంపిణీ చేస్తున్నామ‌న్నారు.

వివ‌క్ష‌లేని విధంగా రాష్ట్రంలో ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తున్నామ‌ని చెప్పిన సీఎం చంద్ర‌బాబు యూపీలో ఇప్ప‌టికీ సామాజిక భ‌ద్ర‌తా పింఛ‌ను రూ.500 మాత్ర‌మే ఉంద‌న్నారు. కానీ, ఏపీలో మాత్రం రూ.4000 నుంచి రూ.6000 వ‌ర‌కు అందిస్తున్నామ‌ని తెలిపారు. మ‌హిళ‌ల‌కు.. ఉచిత బ‌స్సు విష‌యంలో ఇత‌ర రాష్ట్రాల్లో ఆంక్ష‌లు ఉన్నాయ‌ని కానీ.. ఏపీలో మాత్రం అన్ని ర‌కాల బ‌స్సుల్లో దాదాపు ఉచిత ప్ర‌యాణానికి అవ‌కాశం క‌ల్పిస్తున్న‌ట్టు చెప్పారు. అందుకే.. ఇత‌ర రాష్ట్రాల్లో రోజుకో వివాదం వెలుగు చూస్తోద‌ని.. కానీ, ఏపీలో మాత్రం ఎక్క‌డా వివాదాలు లేకుండా ఈ ప‌థ‌కం అమ‌లు జ‌రుగుతోంద‌ని చెప్పారు.

ఇక‌, కీల‌క‌మైన ఉద్యోగాల విష‌యంలో కేవ‌లం 15 మాసాల్లోనే 4.7 ల‌క్ష‌ల మందికిఉద్యోగాలు ఇచ్చామ‌ని సీఎం చంద్ర‌బాబు వివరించారు. ఇలా చేయ‌డం రాష్ట్రంలోనేకాదు.. దేశంలోనే రికార్డుగా చెప్పుకొచ్చారు. “కొన్ని ప్ర‌భుత్వాలు.. అవి ప‌నిచేయవు. ఇంత చేసి.. అంత అని చెప్పుకొంటాయి. మేం అధికారంలోకి రాగానే 4.7 ల‌క్ష‌ల ఉద్యోగాలు ఇచ్చాం. 10 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల మేర‌కు పెట్టుబ‌డులు తెచ్చాం. మ‌రో 9 ల‌క్ష‌ల కోట్ల పెట్టుబ‌డులు త్వ‌ర‌లోనే రానున్నాయి. దీనివ‌ల్ల మ‌రో 9 ల‌క్ష‌ల ఉద్యోగాలు వ‌స్తున్నాయి. కానీ,గ‌త ప్ర‌భుత్వం ఏదో ఇచ్చామ‌ని చెబుతూ.. అన్నీ నాశ‌నం చేసింది. ఇచ్చింది ఏమీ లేదు. మీ నుంచి తీసుకున్న‌దే ఎక్కువ‌“ అని వైసీపీ పాల‌న‌పై చంద్ర‌బాబు నిప్పులు చెరిగారు.

ఇక‌, విద్యుత్ చార్జీల విష‌యాన్ని కూడా ప్ర‌స్తావించిన సీఎం.. గ‌త ప్ర‌భుత్వంలో బాదుడే బాదుడు బాదార‌ని.. దీంతో అనేక మంది ప‌నులు కోల్పోయి.. ఉపాధి పోయి.. ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్నార‌ని తెలిపారు. ముఖ్యంగా విద్యుత్ చార్జీల‌ను పెంచ‌డంతో చిన్న‌,స‌న్న‌కారు ప‌రిశ్ర‌మ‌లు మూత‌బ‌డ్డాయ‌న్నారు. ఇప్పుడు విద్యుత్ చార్జీల‌ను పెంచ‌డం కాదు.. త‌గ్గించే స్థాయికి వ‌చ్చామ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. ఈ విష‌యాన్ని కూడా జీర్ణించుకోలేక పోతున్న వైసీపీ నాయ‌కులు.. ప్ర‌జ‌ల‌కు లేనిపోని విషాన్ని నూరి పోస్తున్నార‌ని విమ‌ర్శించారు. న‌వంబ‌రు నుంచి యూనిట్‌కు 13 పైస‌లు చొప్పున ధ‌ర‌లు దిగివ‌స్తాయ‌ని తెలిపారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ కూట‌మిదే విజ‌య‌మ‌ని మ‌రోసారి చంద్ర‌బాబుతెలిపారు.

This post was last modified on October 4, 2025 8:28 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Chandrababu

Recent Posts

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

1 hour ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

2 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

2 hours ago

కాసేపు క్లాస్ రూములో విద్యార్థులుగా మారిన చంద్రబాబు, లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…

2 hours ago

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

3 hours ago

రష్యా vs ఉక్రెయిన్ – ఇండియా ఎవరివైపో చెప్పిన మోడీ

ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…

4 hours ago