Political News

చంద్రబాబుకే మేధావి వర్గం మద్దతు.. కారణం ఏమిటి?

రాష్ట్రంలోని మేధావి వర్గం అంతా కూడా సీఎం చంద్రబాబు వైపు నిలబడిన విషయం తెలిసిందే. గత ఎన్నికల సమయంలో పార్టీలకు అతీతంగా అనేకమంది మేధావులు సోషల్ మీడియా ద్వారా, అదేవిధంగా ఆన్లైన్ ఛానెల్లు, యూట్యూబ్ ద్వారా కూడా జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలమైన వాయిస్ వినిపించారు. అదేవిధంగా కూటమి నేతలకు అనుకూలంగా కామెంట్లు చేశారు. ప్రజలను ఒకరకంగా మొబిలైజ్ చేయడంలో మేధావి వర్గం పాత్ర కూడా ఉందని అంటారు.

గత ఎన్నికల సమయంలో మేధావులుగా ఉన్న మాజీ ఐఏఎస్‌లు, మాజీ ఐపీఎస్‌లు, అదేవిధంగా ఉన్నతస్థాయిలో రిటైర్ అయిన అధికారులు కూడా జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. జగన్ ప్రభుత్వం రైతుల నుంచి భూములు లాక్కుంటోందని, ప్రజలపై హింసాత్మకంగా వ్యవహరిస్తోందని, హైకోర్టు తిట్టిపోసిందని వంటి అనేక విషయాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ విధంగా సోషల్ మీడియా ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చారు. కనీసం 15 నుంచి 20 శాతం ఓటు బ్యాంకును వారు కూటమి వైపు మళ్లించారన్న వాదన కూడా ఉంది.

ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చేసింది. అయితే అదే సమస్యలు ఇప్పుడు కూడా కొనసాగుతున్నాయని పరిశీలకులు అంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పెట్టుబడుల కోసం కావచ్చు, రాజధాని కోసం కావచ్చు ప్రభుత్వం రైతుల నుంచి, ఇతర సామాజిక వర్గాల నుంచి కూడా భూములు తీసుకుంటోంది. ఇది పెను వివాదానికి దారితీసింది. నెల్లూరు జిల్లా కరేడు, గుంటూరు జిల్లా అమరావతి, కాకినాడ జిల్లా ఉప్పాడ, విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట, అదేవిధంగా భీమిలిలో కూడా భూసేకరణ జరుగుతోంది. దీనిపై రైతులు, ఇతర సామాజిక వర్గాలు తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు ప్రభుత్వం గట్టిగానే హెచ్చరికలు జారీ చేస్తోంది. సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారంటూ రాత్రికి రాత్రి అరెస్టు చేస్తున్న పరిణామాలు, అదేవిధంగా హైకోర్టును తప్పుదారి పట్టిస్తున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయనే వాదన వినిపిస్తోంది. ఇక శాంతిభద్రతల పరంగా చూస్తే హోమ్ మంత్రి సొంత జిల్లా విశాఖలోనే 9 ఏళ్ల బాలికపై ఘోర అత్యాచారం జరిగింది. ఇతర జిల్లాల్లోనూ అనేక అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి.

అయినప్పటికీ మేధావి వర్గం మౌనంగానే ఉండటం పట్ల సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి. వైసీపీ హయాంలో జరిగిన ఘటనలపై స్పందించిన మేధావి వర్గం ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉంటుందనే ప్రశ్నలు వస్తున్నాయి. కానీ మేధావి వర్గం మాత్రం జగన్ పాలనకన్నా చంద్రబాబు పాలన బెటర్ అన్నట్టుగా ఉన్నారు అనేది స్పష్టంగా కనిపిస్తోంది.

ఏదేమైనా పరిస్థితుల్లో కొత్తగా మార్పు కనిపించడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఇవి చంద్రబాబు వరకు చేరాయా లేదా అనేది చూడాలి. ప్రస్తుతానికి మాత్రం మేధావి వర్గం బాబుకు అనుకూలంగా ఉండటం గమనార్హం.

This post was last modified on October 3, 2025 12:28 am

Share

Recent Posts

80′ s ట్రెండ్… చంద్రబాబు రూటే సెపరేటు

సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ‘80ల ట్రెండ్‌’ సందడి చేస్తోంది. సాధారణ ఫొటోలను కృత్రిమ మేధ సాయంతో 1980ల నాటి దుస్తులు,…

55 minutes ago

AI కోసం లక్షల కోట్లు… లాభాలు రాకపోతే ఏం జరుగుతుంది?

చాట్‌జీపీటీ, జెమినీ, క్లాడ్ లాంటి AI సేవల వెనుక భారీ డేటా సెంటర్లు, ఖరీదైన చిప్స్, విద్యుత్ అవసరం ఉంటుంది.…

2 hours ago

జగన్ లోనూ ఓ కాక్రోచ్

నాలాంటి వాళ్ళే కాక్రోచ్ అవుతున్నారంటూ వైసీపీ అధినేత జగన్ చెప్పిన ఈ మాట నెట్టింట తెగ వైరల్ అవుతుంది. నీట్…

2 hours ago

వృషకర్మ… తెలివైన పని చేసిందమ్మ

ఫౌజీ విడుదల వాయిదా గురించి అసలైన మైత్రి మూవీ మేకర్స్ ఇంకా చెప్పలేదు కానీ మిగిలిన సినిమాలు అలెర్ట్ అయిపోయి…

3 hours ago

యూపీఐ లో కొత్త షార్ట్‌కట్… స్కాన్ లేకుండానే పేమెంట్

షాప్‌లో యూపీఐ పేమెంట్ చేయాలంటే ప్రస్తుతం ఫోన్‌లో యాప్ ఓపెన్ చేసి, కెమెరాతో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నాం. ఇక…

4 hours ago

రావిపూడి మార్కు మళ్ళీ మొదలయ్యింది

ఎవరు ఏమన్నా, ఎన్ని కామెంట్లు చేసినా దర్శకుడు అనిల్ రావిపూడి నుంచి నేర్చుకోవాల్సిన విషయాలైతే చాలా ఉన్నాయి. మొదటిది కమిట్…

5 hours ago