Political News

డేంజ‌ర్ జోన్లో మ‌ద్యం అమ్మ‌కాల‌కు గ్రీన్ సిగ్న‌ల్

ప్ర‌స్తుతం దేశవ్యాప్తంగా క‌రోనా కేసులు 35 వేల దాకా ఉంటే.. అందులో దాదాపు మూడో వంతు కేసులు మ‌హారాష్ట్ర‌లోనే ఉన్నాయి. అక్క‌డ క‌రోనా కేసుల సంఖ్య 11 వేలు దాటింది. 600 మంది దాకా మృతి చెందారు. దేశంలోనే అత్యంత జ‌న‌సాంద్ర‌త క‌లిగిన ప్రాంతం అయిన ధారావి మురికివాడ‌లో వంద‌ల సంఖ్య‌లో క‌రోనా కేసులు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. ప‌దుల సంఖ్య‌లో చ‌నిపోతున్నారు.

అలాంటి రాష్ట్రంలో మ‌ద్యం అమ్మ‌కాల‌కు ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. లాక్ డౌన్ అమ‌ల‌వుతున్న‌ప్ప‌టి నుంచి దేశ‌వ్యాప్తంగా మందుబాబుల క‌ష్టం మామూలుగా లేదు. ప్ర‌తి రాష్ట్రం మ‌ద్యం అమ్మ‌కాల ద్వారా వ‌చ్చే ఆదాయం మీద ఎంత‌గానో ఆధార‌ప‌డుతున్న నేప‌థ్యంలో ప్ర‌భుత్వాల్ని న‌డ‌ప‌డ‌మే క‌ష్టంగా ఉంది. అయినప్ప‌టికీ క‌రోనా ముప్పును దృష్టిలో ఉంచుకుని మ‌ద్యం అమ్మ‌కాల‌కు సాహ‌సించ‌డం లేదు.

ఐతే దేశంలోనే క‌రోనా ప్రభావం అత్యధికంగా ఉన్నా.. మున్ముందు మ‌రింత ప్ర‌మాద‌క‌ర ప‌రిస్థితులు ఎదుర‌య్యేలా ఉన్నా మ‌హారాష్ట్ర మాత్రం మ‌ద్యం అమ్మ‌కాల‌కు ప‌చ్చ జెండా ఊపేసింది. రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి చాలా ఇబ్బందిక‌రంగా త‌యార‌వ‌డంతో మ‌ద్యం అమ్మ‌కాలు పునఃప్రారంభించాల్సిందే అని ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఉద్ధ‌వ్ థాక్రే నిర్ణ‌యించారు. కొన్ని రోజుల కింద‌ట ఆయ‌న సోద‌రుడు, మ‌హారాష్ట్ర న‌వ‌నిర్మాణ సేన అధినేత రాజ్ థాక్రే.. రాష్ట్రంలో మ‌ద్యం అమ్మ‌కాల‌కు అనుమ‌తి ఇవ్వకుంటే చాలా క‌ష్ట‌మ‌వుతుంద‌ని హెచ్చ‌రిస్తూ అన్న‌కు లేఖ రాశాడు.

అధికారుల నుంచి కూడా ఇదే ర‌కమైన సూచ‌న‌లు రావ‌డంతో ఉద్ధ‌వ్ సానుకూల నిర్ణ‌యం తీసుకున్నాడు. ఐతే నెలన్న‌ర‌ రోజుల పాటు మ‌ద్యానికి ముఖం వాచిపోయిన మందుబాబులు వైన్ షాపుల మీదికి ఒక్క‌సారిగా దండెత్తితే, పార్టీల పేరుతో గుమిగూడి హంగామా చేస్తే.. ఇళ్ల‌లో మందు కొట్టి కుటుంబ స‌భ్యుల్ని హింస‌ల‌కు గురి చేస్తే ప‌రిస్థితేంటి అన్న‌ది చూడాలి.

This post was last modified on May 2, 2020 5:11 am

Share
Show comments
Published by
suman

Recent Posts

పర్ఫెక్షన్లో రాక్షసుడు జక్కన్న

బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…

9 minutes ago

కర్ణాటకలో తెలుగు కనపడకూడదా?

కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…

3 hours ago

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

4 hours ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

5 hours ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

6 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

6 hours ago