వైసీపీ ఎమ్మెల్యేల్లో కొందరికి బెరుకు, బెంగ కూడా ఉన్నాయని స్పష్టమవుతోంది. తమ పార్టీ అధినేత తీరు తో కొందరు విసిగిపోతున్నారన్నది కూడా వాస్తవమే. ముఖ్యంగా కొందరు ఫస్ట్ టైమ్ గెలిచిన వారు ఉన్నారు. అలాగే.. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వంటివారు.. సమస్యలను పరిష్కరించాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే.. వైసీపీ ఎమ్మెల్యేలు గెలిచిన 11 నియోజకవర్గాల్లో 7 నియోజకవర్గాలు.. అత్యంత సంక్లిష్టంగా ఉన్నాయి. అంటే.. ఆయా నియోజకవర్గాల్లో తక్కువ మెజారిటీతోనే గెలుపు గుర్రం ఎక్కారు.
ఈ క్రమంలో ఆయా నియోజకవర్గాల్లో తిరిగి విజయం దక్కించుకోవాలన్నా.. ప్రజల సానుభూతిని సొంతం చేసుకోవాలని భావించినా.. ప్రజల మధ్యకు వెళ్లాలి. అసెంబ్లీలోనూ చర్చించాలి. ఈ వ్యవహారమే కొత్త వారికి అదేసమయంలో బలమైన పోటీ ఉన్న నియోజకవర్గాల్లోని నాయకులకు కూడా నిద్రలేకుండా చేస్తోంది. ఇక, ఢక్కాముక్కీలు తిన్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంటివారు మాత్రం మౌనంగా ఉంటున్నారు. దీంతో సభ్యులు.. సభకు హాజరు కాకుండానే రిజిస్టర్‌లో సంతకాలు చేస్తున్నారన్నది వాస్తవం.
దీనివల్ల కనీసం తమకు వేతనాలు అయినా.. వస్తాయని, రేపు అసెంబ్లీలో హాజరు శాతాన్ని పరిశీలించినప్పుడు.. తమ పేరు మరీ దిగువ స్థాయికి పడిపోకుండా ఉంటుందని కూడా లెక్కలు వేసుకుని ఇలా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొందరు చాటుమాటుగా వెళ్లి హాజరు వేసి వస్తున్నారు. తాజాగా నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ సీఎం జగన్.. ఈ విషయాన్ని ప్రస్తావించారు. “మీరు వెళ్లాలని అనుకుంటే సభకు వెళ్లమని నేనే చెప్పా. కొందరు ఇలా చేస్తున్నారు. వెళ్లాలని అనుకుంటే నేను ఆపను. కానీ, ఇలా చేయడం సరికాదు” అని ఆయన తేల్చి చెప్పారు.
అయితే.. జగన్ రాకుండా తాము సభకు వెళ్లినా సమస్యలపై స్పందించినా.. ప్రయోజనం ఉండదన్నది కొందరు ఎమ్మెల్యేలు చెబుతున్న మాట. ఈ నేపథ్యంలోనే.. వారు కూడా డుమ్మా కొడుతున్నారు. కానీ, ఆర్థిక సమస్యలు.. ఇతరత్రా సమస్యల కారణంగా.. వైసీపీ ఎమ్మెల్యేలు.. సంతకాలు చేసి వస్తున్నాయి. మొత్తంగా జగన్ కదిలితే తప్ప తాము కదిలేది లేదని కొందరు చెబుతుండగా.. మరికొందరు మాత్రం.. మౌనంగా ఉంటున్నారు ఇదేసమయంలో అసెంబ్లీలో వారిపై విమర్శలు వస్తున్నాయి. ఈ పరిణామాలను కట్టడి చేయాలంటే.. ఖచ్చితంగా జగనే స్పందించాల్సి ఉంటుంది.
This post was last modified on September 25, 2025 3:55 pm
స్థానిక సంస్థల ఎన్నికలను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రెండు సంవత్సరాల పాలనకు ఈ ఎన్నికలను రిఫరెండంగా భావిస్తున్న రేవంత్…
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సైకిల్ తొక్కడం కొత్తేమీ కాదు. అయితే ఈసారి ఆయన సైకిల్ తొక్కిన వేగం, ఉత్సాహం…
ఏషియన్ సినిమా సంస్థ.. గత కొన్నేళ్లుగా టాలీవుడ్ స్టార్ హీరోలతో కలిసి మల్టీప్లెక్స్ బిజినెస్ చేస్తున్న సంగతి తెలిసిందే. హీరోల…
తిరువీర్.. ఈ పేరు చూసి ఇప్పటికీ ఎవరో పరభాషా నటుడు అనుకుంటూ ఉంటారు కానీ.. అతను అచ్చమైన తెలుగు కుర్రాడు. చేసినవి తక్కువ…
ఫోన్ ట్యాపింగ్ కేసులో రెండు సార్లు నోటీసులు అందుకున్న తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఈ దఫా కూడా.. సిట్…
వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…