ఏపీ సీఎం చంద్రబాబుకు పోలీసు శాఖలో తృతీయ శ్రేణి ఉద్యోగిగా వ్యవహరించే సర్కిల్ ఇన్ స్పెక్టర్(సీఐ) శంకరయ్య నోటీసులు పంపించిన వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. కడప జిల్లా పులివెందులకు చెందిన శంకరయ్య ఈ నెల 18న సీఎం చంద్రబాబుకు నోటీసులు పంపించారు. దీనిలో ఆయన మూడు కీలక డిమాండ్లు చేయడం గమనార్హం. 1) తనపై చేసిన ఆరోపణలకు చంద్రబాబు క్షమాపణలు చెప్పడం. 2) తనను మానసికక్షోభకు గురిచేసి.. డిపార్ట్‌మెంటులో తనకు అవమానాలు ఎదురయ్యేలా చేసిన నేపథ్యంలో దీనికి పరిహారంగా రూ.కోటి ఇవ్వడం. 3) అసెంబ్లీ వేదికగానే తనపై క్షమాఫణలు చెప్పడం. అయితే.. సీఐ ఇచ్చిన ఈ నోటీసుల వ్యవహారం.. తాజాగా వెలుగు చూసింది.
ఏం జరిగింది?
వైసీపీ అధినేత జగన్ సొంత బాబాయి వివేకానందరెడ్డి 2019లో దారుణ హత్యకు గురయ్యారు. అయితే.. అప్పట్లో పులివెందుల సీఐగా వ్యవహరించిన శంకరయ్య.. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డితో మిలాఖత్ అయ్యారని.. గొడ్డలి పోటును గుండెపోటుగా చిత్రీకరించిన వారికి సహకరించారని.. అదేవిధంగా రక్తపు మరకలను తుడిచేస్తున్న క్రమంలో వాటిని వీడియోలు తీయకుండా మీడియాను బెదిరించారని.. అదేవిధంగా మీడియాకు చెందిన కొందరిపై కేసులు పెట్టారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. వాటిపై గతంలోనే సీబీఐ పలు మార్లు శంకరయ్యను అదుపులోకి తీసుకుని విచారించింది. తర్వాత.. వదిలేసింది.
ఇదిలావుంటే.. గతంలోను, ఇటీవల చంద్రబాబు సహా పార్టీ నాయకులు సీఐపై విమర్శలు గుప్పించారు. ఆ నాటి కేసులో సీఐని మరింత లోతుగా విచారిస్తే.. నిజానిజాలు తెలుస్తాయని అన్నారు. వైసీపీ నాయకులతో మిలాఖత్ అయ్యారని వ్యాఖ్యానించారు. కాగా.. అప్పటి నుంచి శంకరయ్య సస్పెన్షన్‌లోనే ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా శంకరయ్య సీఎం చంద్రబాబుకు నోటీసులు పంపించారు. తనకు బహిరంగ క్షమాపణ చెప్పాలని..అదికూడా అసెంబ్లీలోనే చెప్పాలని డిమాండ్ చేయడం గమనార్హం. ఈ నెల 18నే తన లాయర్ ధరణేశ్వర రెడ్డితో నోటీసులు పంపించినప్పటికీ.. ఆలస్యంగా ఈవిషయం వెలుగు చూసింది. ఇక, ప్రభుత్వం దీనిపై ఇప్పటి వరకు స్పందించలేదు.
వైసీపీ పన్నాగమే!
మరోవైపు.. సీఐ శంకరయ్య నోటీసులపై టీడీపీ నాయకుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నోటీసుల వెనుక వైసీపీ నాయకులు ఉన్నారని అంటున్నారు. వారి ప్రోద్బలంతోనే ఈ నోటీసులు పంపించి ఉంటారని తెలుస్తోందని చెబుతున్నా రు. సీఐ శంకరయ్య పాత్ర లేకపోతే.. సీబీఐ ఆయనను ఎందుకు విచారించిందని కూడా పలువురు నాయకులు ప్రశ్నిస్తున్నారు. కాగా.. మరోవైపు హోం శాఖ ఈ వ్యవహారంపై సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. శంకరయ్యపై డిపార్ట్‌మెంటు పరంగా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారుల సంఘం డీజీపీకి విన్నవించడం గమనార్హం. మొత్తంగా ఈ వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. మరి చివరకు ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on September 24, 2025 10:50 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…