Vijayawada: Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu addresses a press conference, in Vijayawada, on May 5, 2019. (Photo: IANS)
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న కొన్ని పరిణామాలను గమనిస్తే ప్రభుత్వం పై విమర్శలు పెరుగుతున్నాయి. అదేవిధంగా నిరసనలు ఉద్యమాలు కూడా తెరమీదకు వస్తున్నాయి. మరి వీటికి కారణం ఏంటి అంటే జస్ట్ పదివేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఈ సమస్యలు ఉండవన్నది అధికారులు తాజాగా చెబుతున్న మాట. ప్రస్తుతం రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ ఆగిపోయింది. వైసీపీ హయంలో మూడు క్వార్టర్లు ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వంలో మూడు క్వార్టర్ల ఫీజును విద్యార్థులకు చెల్లించాల్సి ఉంది. ఈ విషయంలో ప్రభుత్వం ఇప్పటివరకు రూపాయి కూడా ఇవ్వలేదు.
అయితే గత వైసిపి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో మార్పులు చేసింది. వైసిపి హయాంలో నేరుగా కాలేజీలకు ఇచ్చే విధానానికి స్వస్తి చెప్పి తల్లుల ఖాతాల్లో నగదు వేయడం.. వారు వెళ్లి కాలేజీలను పరిశీలించి.. కాలేజీలో బోధన బాగుంటేనే ఫీజులు కట్టమని అప్పట్లో సిఎం గా ఉన్న జగన్ చెప్పడంతో నేరుగా వారి ఖాతాల్లోకి నిధులు వేయటం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత యాజమాన్యాలు ఈ విషయంపై ఆందోళన చేయటం.. ఈ విధానాన్ని మార్చాలని విన్నవించడంతో కూటమి ప్రభుత్వం ఈ విధానాన్ని మార్చింది, నేరుగా మళ్లీ కాలేజీల ఖాతాలకే సొమ్ములు వేసే విధానాన్ని తీసుకొచ్చింది.
విధానాన్ని అయితే మార్చారు గానీ డబ్బులు మాత్రం ఇవ్వలేదు. ఇప్పుడు ఈ సొమ్ము మొత్తం నాలుగు వేల రెండు వందల కోట్లకు చేరిపోయింది. మరోవైపు ఈ సొమ్ము చెల్లిస్తేనే తప్ప సర్టిఫికెట్లు ఇచ్చేది లేదని కాలేజీలు తేల్చి చెబుతుండడంతో విద్యార్థులు నానా అగచాట్లు పడుతున్నారు. దీంతో తల్లిదండ్రులు అప్పు చేసి ఫీజులు కడుతున్నారు. ఇది.. ఒక ప్రధాన సమస్య. అంటే ఈ సమస్య నుంచి బయటపడడానికి ప్రభుత్వం కనీసం లో కనీసం రెండు వేల కోట్లు అయినా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏర్పడింది.
ఇక మరో కీలక అంశం ఆరోగ్యశ్రీ. ఈ విషయానికి వస్తే గత సోమవారం నుంచి కూడా రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు ఆగిపోయాయి. అన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా ఆరోగ్యశ్రీ కింద తాము వైద్యం చేయబోమని తేల్చి చెప్పాయి. దీనికి కారణం 2500 కోట్ల రూపాయలు ఆయా ఆసుపత్రులకు ప్రభుత్వం నుంచి బకాయిలు ఉన్నాయి. ఇవి చెల్లిస్తే తాము ఆరోగ్యశ్రీ కింద మళ్ళీ సేవలు అందించేందుకు సిద్ధమని చెబుతున్నాయి. ఇలా ఈ రెండు సమస్యలకు సంబంధించి 7000 కోట్లు దాదాపు కనిపిస్తోంది.
మరోవైపు అంగన్వాడీ కార్యకర్తలు. వాళ్లు కూడా ఈనెల 30వ తారీకు నుంచి సమ్మెకు దిగేందుకు నోటీసులు ఇచ్చేశారు. తమకు బకాయి ఉన్న వేతనాలతో పాటు తమకు పెంచుతామన్న వేతనాల పరిస్థితి ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. ఇది సుమారు 1000 కోట్ల రూపాయల దాకా ఉంటుందని అంచనా ఉంది. ఈ మూడు సమస్యలను పరిష్కరిస్తే క్షేత్రస్థాయిలో ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పే అవకాశం ఉందని అధికారులు లెక్కలు తేల్చారు. దీనిపై వచ్చే రెండు మూడు రోజుల్లో సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ సొమ్ములు కేటాయిస్తే ప్రస్తుతానికి ఇబ్బందులు తొలగి సాధారణ పరిస్థితిలో నెలకొంటాయని అంచనా వేస్తున్నారు. మరి ఏం చేస్తారనేది చూడాలి.
This post was last modified on September 18, 2025 4:25 pm
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…
సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…
‘నరసింహనాయుడు’ తర్వాత చాలా ఏళ్ల పాటు పెద్ద స్లంప్ చూశాడు నందమూరి బాలకృష్ణ. కానీ ‘సింహా’తో తిరిగి హిట్ ట్రాక్…
ఢిల్లీ గడ్డపై అడుగుపెట్టగానే రష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికాకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఉక్రెయిన్ యుద్ధం పేరుతో రష్యా నుంచి…
ఇండిగో విమానాల రద్దుతో దేశవ్యాప్తంగా ఎయిర్‌పోర్టులు గందరగోళంగా మారడంతో కేంద్రం దిగివచ్చింది. ప్రయాణికుల కష్టాలు చూడలేకనో, లేక ఇండిగో లాబీయింగ్‌కు…
ఎన్నికలు ఏవైనా.. ప్రజలకు 'ఫ్రీ బీస్' ఉండాల్సిందే. అవి స్థానికమా.. అసెంబ్లీనా, పార్లమెంటా? అనే విషయంతో సంబంధం లేకుండా పోయింది.…