Political News

క‌వితపై నిఘా.. : బీఆర్ఎస్ వ్యూహం ఏంటి?

హైద‌రాబాద్‌లోని కీల‌క నియోజ‌క‌వ‌ర్గం జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఈ నెల చివ‌రిలో నోటిఫికేష‌న్ వ‌చ్చే అవ‌కాశం ఉంది. దీనిని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న అధికార‌, ప్రతిప‌క్షాలు.. ఇప్ప‌టి నుంచే పావులు కదుపుతున్నాయి. మ‌రీ ముఖ్యంగా త‌మ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోకుండా ఒడిసి ప‌ట్టుకోవాల‌ని ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ ఎస్ ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఇక‌, ఏడాదిన్న‌ర పాటు సాగించిన త‌మ పాల‌న‌కు ఈ ఉప ఎన్నిక ద‌ర్ప‌ణం ప‌డుతుంద‌ని కాంగ్రెస్ భావిస్తోంది. దీంతో కాంగ్రెస్ నాయ‌కులు కూడా ఈ పోరును ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు.

మ‌రోవైపు.. బీజేపీ స‌రేస‌రి!. మోడీ ప్ర‌భావాన్ని చూపించి.. ఇక్క‌డ విజ‌యం ద‌క్కించుకునేందుకు ఆ పార్టీ నాయ‌కులు కూడా ప్ర‌య‌త్నాలు ప్రారంభిస్తున్నారు. ఈ మూడు పార్టీల సంగ‌తి ఎలా ఉన్నా.. బీఆర్ఎస్‌లో మాత్రం క‌విత గుబులు బ‌య‌లు దేరుతోంది. పార్టీ నుంచి త‌న‌ను స‌స్పెండ్ చేయ‌డం.. పార్టీలో త‌న‌కు ప్రాధాన్యం లేకుండా పోయింద‌ని ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో.. త‌న‌కు అందివ‌చ్చిన అవ‌కాశంగా జూబ్లీహిల్స్‌ను ఆమె భావిస్తున్న‌ట్టు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతోంది.

అంటే.. జూబ్లీహిల్స్‌లో త‌న స‌త్తాచాటుకునేందుకు ఆమె ప్ర‌య‌త్నం చేసే అవ‌కాశం ఉంది. త‌ద్వారా.. ఏపీలో ష‌ర్మిల మాదిరిగా.. క‌విత‌.. ఇక్క‌డ బీఆర్ఎస్‌పైనే టార్గెట్ చేసే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. అంటే.. నేరుగా కేసీఆర్‌ను ఆమె విమ‌ర్శించ‌క‌పోయినా.. పార్టీలో అవినీతి, అక్ర‌మాలు, కాళేశ్వ‌రం, హ‌రీష్‌రావు, సంతోష్ రావు వంటి కీల‌క నాయ‌కుల‌ను టార్గెట్ చేసుకుని.. ప్ర‌చారం చేసే అవ‌కాశం ఉంద‌ని.. అంచ‌నా వేస్తున్నారు. జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ ఓడిపోతే.. తాను ఆది నుంచి చెబుతున్న అక్ర‌మాలు నిజ‌మ‌నే విష‌యం నిర్ధార‌ణ అవుతుంద‌న్న అంచ‌నాలో కూడా క‌విత ఉన్న‌ట్టు స‌మాచారం.

అందుకే.. బీఆర్ఎస్ అధిష్టానం కూడా.. క‌విత అడుగుల‌పై నిఘా పెట్టిన‌ట్టు స‌మాచారం. తాజాగా పీజేఆర్ కుమారుడు ప‌బ్బ‌తి రెడ్డి విష్ణువ‌ర్ధ‌న్‌రెడ్డి ఆమె నివాసానికి వెళ్లి క‌లుసుకుని చ‌ర్చించిన త‌ర్వాత‌.. బీఆర్ఎస్ అధిష్టానం అలెర్ట‌యిన‌ట్టు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతోంది. క‌విత త‌న దూకుడు ద్వారా అంత‌ర్గ‌తంగా కాంగ్రెస్‌కు మ‌ద్ద‌తు ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని తాజాగా ఓ అంచ‌నాకు వ‌చ్చారు. అందుకే.. ఆమె ఏం చేస్తున్నారు? ఎవ‌రితో మాట్లాడు తున్నార‌నే విష‌యాల‌పై నిఘా పెట్టిన‌ట్టు స‌మాచారం. మ‌రి క‌విత‌ను ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

This post was last modified on September 17, 2025 3:53 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బాబీ గారు… ప్రేక్షకులు ఎప్పుడైనా రైటే

భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…

6 hours ago

‘ఇవేవీ తెలియకుండా జగన్ సీఎం ఎలా అయ్యాడో’

వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…

7 hours ago

అఫీషియల్: తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీ

తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…

7 hours ago

‘నువ్వు బ‌జారోడివి కాదు’… అనిల్ మీమ్ పంచ్

సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయ‌డంలో తెలుగు వాళ్ల‌ను మించిన వాళ్లు ఇంకెవ్వ‌రూ ఉండ‌రంటే అతిశ‌యోక్తి కాదు. కొన్ని మీమ్స్…

8 hours ago

జగన్ చేతులు కాల్చాకా నేతలు ఆకులు పట్టుకున్నారు

అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…

9 hours ago

కైట్ కుర్రోళ్లు… ఇప్పటికైనా అర్థం చేసుకోండి

సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…

10 hours ago