Political News

మంచి అవకాశాన్ని చేజార్చుకున్న జగన్ ప్రభుత్వం

అవును ఓ ప్రాజెక్టు గురించి పాజిటివ్ వార్తను జనాల్లోకి తీసుకెళ్ళే బంగారం లాంటి అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేజార్చుకున్నది. వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి పోలవరం ప్రాజెక్టు వివాదం లేని రోజు లేదనే చెప్పాలి. ప్రాజెక్టు పేరుతో ఏదో ఓ వివాదం నలుగుతునే ఉంది. తమ హయాంలో 70 శాతం పనులు పూర్తి చేస్తే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం 2 శాతం పనులు కూడా చేయలేదని చంద్రబాబునాయుడు ప్రతిరోజు గోల చేస్తునే ఉన్నారు. దీనికి కౌంటర్ గా ప్రభుత్వం తరపున మంత్రి అనీల్ కుమార్ యాదవ్ సమాధానం ఇస్తున్నారు లేండి.

అధికార-ప్రధాన ప్రతిపక్షాల మధ్య పోలవరం రగడ పెరుగుతున్న సమయంలోనే సీపీఐ కార్యదర్శి రామకృష్ణ నేతృత్వంలో కొందరు నేతలు పోలవరం ప్రాజెక్టు ఫీల్డు విజిట్ పెట్టుకున్నారు. అయితే ఈ విజిట్ ను పోలీసులు అడ్డుకున్నారు. దాంతో సీపీఐ పోలవరం యాత్ర కాస్త భగ్నమైపోయింది. వాళ్ళ పోలవరం యాత్రను భగ్నం చేయాలన్న ఆలోచన ఎవరిదో అర్ధం కావటం లేదు. టీడీపీ హయాంలోకన్నా ఇపుడు పోలవరం పనులు మరింత జోరుగా జరుగుతున్నాయని మంత్రి చెప్పిన మాట అందరికీ తెలిసిందే.

మంత్రి చెప్పింది నిజమే అయితే సీపీఐ నేతలు ప్రాజెక్టును సందర్శించటం ప్రభుత్వానికి ప్లస్సే అవుతుంది కదా. ప్రత్యక్షంగా ప్రాజెక్టును చూసిన తర్వాత పనులు జరగటం లేదనే మాటను రామకృష్ణ చెప్పలేరు. చంద్రబాబు హయాంలో జరిగిన పనులెంత ? తాము కాంట్రాక్టు మొదలుపెట్టిన తర్వాత చేసిన పనులెంత ? అనే విషయాలపై మేఘా సంస్ధ ప్రాజెక్టు సైట్ దగ్గర ఫొటో ఎగ్జిబీషన్ కూడా రెడీ చేసిందట. అంటే సీపీఐ నేతలు సైట్ దగ్గరకు వస్తున్న విషయం తెలిసే వారికి స్వాగతమర్యాదలు చేయటానికి కాంట్రాక్టు సంస్ధ రెడీగా ఉంది.

మరి ఇంతలో ఏమైందో ఏమో హఠాత్తుగా సీపీఐ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇపుడీ విషయమే జనాల్లోకి బాగా నెగిటివ్ గా వెళుతోంది. ఇదే రామకృష్ణ అండ్ కో ప్రాజెక్టును చూసిన తర్వాత జరుగుతున్న పనులపై ఓ ప్రకటన చేసుంటే ప్రభుత్వానికి బాగా మైలేజి వచ్చుండేది. అప్పుడు చంద్రబాబు చేస్తున్న ఆరోపణలన్నీ తప్పుడు ఆరోపణలే అని రామకృష్ణే సర్టిఫికేట్ ఇచ్చినట్లయ్యేది. అప్పుడు ప్రభుత్వం చెబుతున్న మాటలకు బాగా విలువ పెరిగేది.

మరి ఇంతటి బంగారం లాంటి అవకాశాన్ని ప్రభుత్వం ఎలా పాడుచేసుకున్నది. నిజానికి పార్టీలతో సంబంధం లేకుండా ఎవరు ప్రాజెక్టును సందర్శించాలని అనుకున్నా ప్రభుత్వం ఓకే చెప్పాలి. అప్పుడే సైట్ లో జరుగుతున్న పనులేమిటో తెలుస్తుంది. ఏ రాజకీయ పార్టీ ప్రాజెక్టును చూసినా లేదా ఏ సంస్ధ పనులను చూసినా ప్రభుత్వానికి మంచిదే. ఎందుకంటే కళ్ళెదుట జరుగుతున్న పనులను చూసిన తర్వాత ఎవరు కూడా పనులు జరగటం లేదని చెప్పే అవకాశం లేదు. డిసెంబర్, 2021కల్లా ప్రాజెక్టు పూర్తవ్వటం ఖాయమే అయితే ఎవరు ప్రాజెక్టును చూస్తామని వచ్చినా అడ్డుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదని జగన్ గుర్తించాలి. అప్పుడే జనాల్లో మైలేజీ పెరుగుతుంది.

This post was last modified on November 24, 2020 5:58 pm

Share
Show comments
Published by
Satya
Tags: Polavaram

Recent Posts

నాని ప్లస్ అనిరుధ్ – అదిరిపోయే రేటు

న్యాచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ది ప్యారడైజ్ సెట్లో ఇంకా హీరో అడుగు పెట్టకుండానే…

5 seconds ago

ప్రభాస్ ఉండగా దీపికకు అంత రెమ్యునరేషనా

కల్కి 2898 ఏడిలో హీరోయిన్ గా కనిపించేది ఎక్కువసేపు కాకపోయినా ప్రాధాన్యం దక్కించుకున్న దీపికా పదుకునే రెండో భాగంలో ఉంటుందో…

29 minutes ago

టెన్షన్ లేదు తమ్ముడు…మంచి డేటే

కింగ్ డమ్ కోసం ముందు అనుకున్న జూలై 4 త్యాగం చేసిన తమ్ముడు కొత్త విడుదల తేదీ జూలై 25…

41 minutes ago

సింగిల్ డే… జగన్ కు డబుల్ స్ట్రోక్స్

వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బుధవారం ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి…

2 hours ago

అవకాశాలు వదిలేస్తున్న విశ్వంభర

జగదేకవీరుడు అతిలోకసుందరి తర్వాత ఆ స్థాయి ఫాంటసీ మూవీగా అంచనాలు మోస్తున్న విశ్వంభర వ్యవహారం ఎంతకీ తెగక, విడుదల తేదీ…

2 hours ago

చంద్ర‌బాబు.. ఎస్టీల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌…!

ఏపీ సీఎం చంద్ర‌బాబు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గిరిజ‌న ప్రాబ‌ల్య ప్రాంతాల్లో నివసించే ఎస్టీల‌కు భారీ మేలును…

3 hours ago