ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టాడంటే ఆయన్ని తీవ్రంగా వ్యతిరేకించే వాళ్లు అన్ని ఆలోచనలూ మానేసి ఆయన మాటలు అలా వింటూ ఉండిపోతారు. అంత సమ్మగా ఉంటాయి ఆయన మాటలు. తెలుగు రాష్ట్రాల్లోని నాయకుల్లో కేసీఆర్‌ను మించిన వక్త మరొకరు లేరనడంలో మరో మాటే లేదు. ఆయన ప్రెస్ మీట్లలో వాగ్బాణాలు, విమర్శలు, పంచ్ డైలాగులకు కొదవే ఉండదు.
ప్రత్యర్థుల్ని లక్ష్యంగా చేసుకుని ఆయన చేసే కొన్ని కామెంట్లు.. వాళ్లను మరీ తేలిక చేస్తూ వేసే కౌంటర్లు భలేగా ఉంటాయి. ఐతే ఈ క్రమంలో కొన్నిసార్లు ఆయన లాజిక్ మరిచిపోతుంటారు. జనాలు తాను ఏం చెప్పినా నమ్మేస్తారు అనుకుంటారు. కొన్ని కామెంట్లు తనకు బూమరాంగ్ అవుతాయని తెలిసినా సరే.. ఆ సమయానికి కౌంటర్ వేసేస్తుంటారు అంతే.జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ తొలిసారి ప్రెస్ మీట్ పెట్టి వరాల జల్లు కురిపించిన సంగతి తెలిసిందే.
అంతటితో ఆగకుండా తమ పార్టీకే ఎందుకు ఓటేయాలో కొన్ని కారణాలు చెప్పారాయన. టీఆర్ఎస్ మళ్లీ గెలవకపోయినా, బీజేపీ అధికారంలోకి వచ్చినా రియల్ ఎస్టేట్ కుదేలవుతుందని అన్నారు. ఇందుకు రీజనింగ్ ఏంటో చెప్పలేదు. అంతటితో ఆగకుండా తాము అధికారంలో ఉండగా.. వేరే పార్టీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిస్తే అది హైదరాబాద్‌కు మంచిది కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేకుండా అభివృద్ధి జరగదని.. రాష్ట్రంలో తాము అధికారంలో ఉన్నాం కాబట్టి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాబట్టి బీజేపీ గెలిస్తే వేస్ట్ అని తేల్చేశారు. తద్వారా జీహెచ్ఎంసీని బీజేపీ చేజిక్కించుకుంటే తాము సహకరించేది లేదని చెప్పకనే చెప్పేశారు.
కానీ ఇదే లాజిక్ కేంద్రం-రాష్ట్రం విషయంలో అప్లై చేసి చూస్తే ఎవరూ టీఆర్ఎస్‌కు ఓటే వేయకూడదు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి.. ఇక్కడ వేరే పార్టీకి అధికారం కట్టబెడితే వాళ్లు సహకరించరు కాబట్టి అభివృద్ధి జరగదని.. కాబట్టి బీజేపీకే ఓటేయాలని అంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు కేసీఆర్ అన్న మాటల్ని గుర్తు చేస్తూ రేప్పొద్దున సార్వత్రిక ఎన్నికలపుడు టీఆర్ఎస్‌కు ఓటేయడం వేస్ట్ అంటే తెలంగాణ ముఖ్యమంత్రి ఊరుకుంటారా?
This post was last modified on November 24, 2020 5:35 pm
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…