ముఖ్యమంత్రి.. ఉప ముఖ్యమంత్రులుగా ఉన్నోళ్లు సినిమాల్లో నటించకూడదా? అలా నటించటం చట్ట విరుద్ధమా?అన్న ప్రశ్నలకు ఇప్పటికే ఇచ్చిన తీర్పుల ప్రకారం.. అలాంటిదేమీ కనిపించదు. ఇదే విషయాన్ని తాజాగా ఏపీ హైకోర్టుకు తెలియజేశారు అడ్వొకేట్ జనరల్ దమ్మలాపాటి శ్రీనివాస్. ఇంతకూ ఏం జరిగిందంటే.. మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు.
ఆయన పిటిషన్ వాదన ఏమంటే.. ఏపీకి డిప్యూటీ సీఎంగా వ్యవహరిస్తున్న పవన్ కల్యాణ్ ను సినిమాల్లో నటించకుండా నిలువరించాలని కోర్టును కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దీనికి కారణం.. హరిహర వీరమల్లు సినిమా.. వాణిజ్య కార్యక్రమాలను ప్రమోట్ చేసుకునేందుకు ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నట్లుగా ఆరోపించారు.
ఈ నేపథ్యంలో ఈ పిటిషన్ పై విచారణ జరిగింది. ప్రభుత్వ అడ్వొకేట్ జనరల్ తన వాదనల్ని వినిపిస్తూ.. మాజీ ముఖ్యమంత్రి.. సీనియర్ నటుడు దివంగత ఎన్టీఆర్ విషయంలో హైకోర్టు విస్త్రత ధర్మాసనం గతంలో స్పష్టమైన తీర్పు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.
అంతేకాదు.. పిటిషనర్ పేర్కొన్నట్లుగా హరిహర వీరమల్లు మూవీ టికెట్ ధర పెంపు విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాత్ర ఉన్నట్లుగా చెప్పే ఏ ఆధారాన్ని కోర్టుకు సమర్పించలేదన్న విషయాన్ని గుర్తించారు. ఈ నేపథ్యంలో పిటిషనర్ తరఫు లాయర్ స్పందిస్తూ.. సినీ నటుడు ఎన్టీఆర్ విషయంలో గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును పరిశీలించి.. రిప్లై వాదనలు చెబుతామని.. అందుకు తగిన సమయం ఇవ్వాలని కోరటంతో.. ఈ కేసు విచారణను ఈ నెల పదిహేనుకు వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు.
This post was last modified on September 9, 2025 2:11 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…