Political News

తాడిప‌త్రి ‘ఒప్పందం’.. పాలిటిక్స్ ఛేంజ్ ..!

ఔను! మీరు చ‌దివింది నిజ‌మే. నిన్న మొన్న‌టి వ‌ర‌కు రాజ‌కీయ కాక‌తో ర‌గిలిపోయిన ఉమ్మ‌డి అనంతపురం జిల్లాలోని కీల‌క నియోజ‌క‌వర్గం తాడిప‌త్రిలో రాజ‌కీయాలు దాదాపు స‌ర్దుకున్న‌ట్టు తెలుస్తోంది. వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ మ‌ధ్య నెల‌కొన్న ఘ‌ర్ష‌ణ‌ల‌తో దాదాపు ఐదేళ్ల‌కుగానే.. కాక రేపుతున్న ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఒప్పందం కుదిరిన‌ట్టు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతోంది. దీనికి ప్రాతిప‌దిక‌.. అమరావతేన‌ని అంటున్నారు. కీల‌క నేత‌ల మ‌ధ్య ఇక నుంచి ఇబ్బందులు రాకుండా ‘ఒప్పందం’ కుదిరిన‌ట్టు తెలుస్తోంది.

టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి వ‌ర్సెస్ వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిల మ‌ధ్య వివాదం ముసురుకున్న విష‌యం తెలిసిందే. త‌న హ‌యాంలో జేసీపై ప‌లు కేసులు పెట్టించార‌ని పెద్దారెడ్డిపై జేసీ వ‌ర్గీయులు ఆగ్ర‌హంతో ఉన్నారు. ఇప్పుడు అధికారం మారిన త‌ర్వాత‌.. ఇరు ప‌క్షాల మ‌ధ్య మ‌రింత ఎక్కువ‌గా రాజ‌కీయాలు సాగుతున్నాయి. ఈ స‌మ‌యంలో ఒక‌రిపై ఒక‌రు నిప్పులు చెరుగుకోవ‌డంతోపాటు స‌వాళ్లు-ప్ర‌తిస‌వాళ్ల దిశ‌గా కూడా.. రాజకీయాలు సాగాయి.

పెద్దారెడ్డిని నియోజ‌క‌వ‌ర్గంలోకి అడుగు పెట్ట‌కుండా చేస్తాన‌ని జేసీ స‌వాలు చేయ‌డం.. ఎలా రాకుండా చూస్తావోన‌ని పెద్దారెడ్డి ప్ర‌తిస‌వాల్ చేయ‌డం తెలిసిందే. ఈ వ్య‌వ‌హారం నిరంత‌రం రాజ‌కీయ సంఘ‌ర్ష‌ణ ల‌కు దారి తీసింది. ఇటీవ‌ల సుప్రీంకోర్టు వ‌ర‌కు కూడా ఈ విష‌యం చేరింది. పెద్దారెడ్డిని నియోజ‌క‌వ‌ర్గం లోకి అనుమ‌తి ఇస్తూ.. సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఇది జ‌రిగిన త‌ర్వాత‌.. అనూహ్యంగా ప‌రిణామాలు మారాయి. అమ‌రావ‌తి వేదిక‌గా.. కీల‌క నాయ‌కుల జోక్యంతో ఇరు ప‌క్షాల మ‌ధ్య ఒప్పందం కుదిరిన‌ట్టు తెలుస్తోంది.

దీనిని బ‌ట్టి.. గ‌తంలో పెద్దారెడ్డి జేసీపై పెట్టిన అన్ని కేసుల‌ను ఉప‌సంహ‌రించుకునేందుకు.. పెద్దారెడ్డికి ఎలాంటి ఇబ్బంది లేకుండా.. నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న వ్య‌వ‌హారాల్లో జోక్యం చేసుకోకుండా ఉండేందుకు ఇరు ప‌క్షాల మ‌ధ్య టీడీపీకి చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు, మంత్రి ఒక‌రు ఒప్పందం చేసిన‌ట్టు తెలిసింది. ఇది కూడా సీఎం చంద్ర‌బాబు చొర‌వ తీసుకుని.. ఉభ‌య ప‌క్షాల‌ను స‌ర్దుబాటు చేసిన‌ట్టు స‌మాచారం. ర‌గ‌డ పెంచుకుంటూ.. పోతే త‌మ‌కు ఇబ్బంది అవుతుంద‌ని.. ఇప్ప‌టికే న‌ష్టం చాలానే జ‌రిగింద‌ని.. జేసీ కూడా అంగీక‌రించిన ద‌రిమిలా.. ప్ర‌స్తుతం చేసుకున్న ఒప్పందం మేర‌కు ఉభ‌య ప‌క్షాలు ఒక నిర్ణ‌యానికి వ‌చ్చాయ‌ని అంటున్నారు. దీంతో ప్ర‌స్తుతం తాడిప‌త్రిలో నెల‌కొన్న రాజ‌కీయ ర‌చ్చ కొంత వ‌ర‌కు స‌ర్దు బాటు అయింద‌ని చెబుతున్నారు.

This post was last modified on September 5, 2025 8:48 pm

Share

Recent Posts

జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌నకు బ్రేక్ ప‌డుతుందా?

వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…

2 hours ago

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

4 hours ago

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

4 hours ago

జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?

ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…

5 hours ago

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

13 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

15 hours ago