టిడిపి అధినేత చంద్రబాబు రాయలసీమను టార్గెట్గా చేసుకొని రాజకీయంగా అడుగులు మరింత వేగం పెంచినట్టు తెలుస్తోంది. తాజాగా ఈనెల 10వ తారీఖున నిర్వహించే సూపర్ సెక్స్ సూపర్ హిట్ కార్యక్రమం అనంతపురంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. వాస్తవానికి ఈ కార్యక్రమాన్ని ఉభయ గోదావరి జిల్లాలో నిర్వహించి ఉంటే ఆ రేంజ్ వేరుగా ఉంటుంది అన్నది మొదట్లో చర్చకు వచ్చింది. ఈ విషయంపై చంద్రబాబు కూడా చూచాయిగా సమాచారం అందించారు.
కానీ, అనూహ్యంగా రాయలసీమను లక్ష్యంగా చేసుకొని కార్యక్రమాలు నిర్వహిస్తుండడం విశేషం. ఈ ఏడాది మేలో జరిగిన మహానాడు కూడా రాయలసీమలోనే నిర్వహించారు. పైగా జగన్ సొంత జిల్లా కడపలో మహానాడు నిర్వహించడం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఇటీవల ఒంటిమిట్ట, పులివెందుల జడ్పీ స్థానాలు జరిగిన ఉప ఎన్నికల్లో కూడా టిడిపి హవా కొనసాగింది. అంటే ఒక రకంగా రాయలసీమలో మహానాడు నుంచి చూసుకుంటే పార్టీ హవా కనిపిస్తోంది. పార్టీ పరంగా.. ప్రభుత్వ పరంగా కూడా ఇక్కడ కార్యక్రమాలు పెరిగాయి.
ఈ క్రమంలో ఇప్పుడు సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమాన్ని కూడా అనంతపురంలో నిర్వహించడం ద్వారా రాజకీయంగా పార్టీని బలోపేతం చేయడం, రాయలసీమలో మరింత దూకుడుగా వ్యవహరించటం అనే లక్ష్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందుకే రాయలసీమ లక్ష్యంగా చేసుకున్నట్టు తెలుస్తోంది. భవిష్యత్తులో కూడా రాయలసీమను వేదికగా చేసుకొని కార్యక్రమాలు నిర్వహించేందుకు పార్టీ సన్నద్ధం అవుతోంది. మరోవైపు ప్రభుత్వం కూడా రాయలసీమలోనే అనేక పరిశ్రమలు తీసుకువచ్చింది.
ఇటీవల కృష్ణ నీళ్లను కూడా తీసుకురావడం.. విండ్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమా లు చేపట్టింది. తద్వారా రాయలసీమలో బలమైన వైసీపీ ఓటు బ్యాంకును టార్గెట్ చేస్తున్నారా అనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. వాస్తవానికి సీమలో టీడీపీకి బలమైన ఓటు బ్యాంకు సొంతం. అయితే.. దీనిని మరింత బలోపేతం చేసే దిశగా అడుగలు వేస్తున్నారనేది.. ప్రస్తుతం జరుగుతున్న చర్చ. ఇక, ఇప్పటికిప్పుడు.. వైసీపీకి ఎలాంటి నష్టం లేదని భావించినా.. భవిష్యత్తులో మాత్రం టీడీపీ పుంజుకుంటున్న తీరుతో ఇబ్బందులు తప్పకపోవచ్చన్న వాదన వినిపిస్తోంది.
This post was last modified on September 4, 2025 3:04 pm
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…
తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…
ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…
బాలీవుడ్ లో సంచలన వసూళ్లు నమోదు చేస్తున్న హనుమాన్ అంశ్ తెలుగులో సెప్టెంబర్ 18 విడుదల కానుంది. ఆశ్చర్యం కలిగించే…
వరుస ఫ్లాపుల కారణంగా గత కొన్నేళ్లలో మాస్ రాజా రవితేజ ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ బాగా దెబ్బ తిన్న మాట…
అక్టోబర్ 2 జాతిపిత మహాత్మా గాంధీ జయంతి. నేషనల్ హాలిడే. ఆ మహానుభావుడిని ఎందరు గుర్తు చేసుకుంటారో కానీ సెలవు…