తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు రాజధాని హైదరాబాద్ నీట మునిగింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలకు తరలించింది. రాజధాని కావడంతో అధికార యంత్రాంగం హుటా హుటిన స్పందించి.. ప్రజలను ఆదుకుంది. కానీ, వర్షాల ప్రభావం ఎక్కువగా ఉన్న మెదక్, కామారెడ్డి జిల్లాల్లో పరిస్థితి దారుణంగా తయారైంది. సహాయక సిబ్బంది తక్కువగా ఉండడం.. వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఒక్కమాటలో చెప్పాలంటే.. మెదక్-కామారెడ్డి జిల్లాలు కకావికలం అయ్యాయి. భారీ వర్షాలతో కామారెడ్డిలో వరదలు ప్రమాదకరంగా మారాయి. జీఆర్ కాలనీ జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఓ భవనం గ్రౌండ్ ఫ్లోర్ వరదలో మునిగిపోయిందని, అందులో చిక్కుకున్న వారిని కాపాడాలంటూ స్థానికులు వేడుకుంటున్నారు. కాగా, నాగిరెడ్డిపేట్లోని ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూలు విద్యార్థులను స్థానికులు, మెదక్ రామాయంపేట మహిళా డిగ్రీ కాలేజీకి చెందిన 300 మంది స్టూడెంట్స్‌ను అధికారులు సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.
మెదక్ జిల్లాలోనూ పరిస్థితి తీవ్రంగా ఉంది. వరదల్లో చిక్కుకున్న విద్యార్థులను ఫైర్ బోట్ల ద్వారా 150 మందిని బయటికి తీసుకొచ్చారు. స్థానికుల సహాయంతో రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్న ఫైర్ డిపార్ట్‌మెంట్.. లోతట్టు ప్రాంతాల ప్రజలను రక్షించే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. మరోవైపు పోచారం ప్రాజెక్టు ప్రమాదపుటంచుకు చరింది. ఎగువ నుంచి భారీగా వరద రావడంతో ప్రాజెక్టు అలుగు పక్కన భారీ గండి పడింది. ఏ క్షణమైన కట్ట తెగిపోయే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కట్ట తెగితే భారీగా పంట నష్టం జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ క్రమంలో గండి పూడ్చడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు.
మరోవైపు, తెలంగాణలో భారీ వర్షాలతో పలు జిల్లాల్లో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బిక్నూరు మండలం తలమండ్ల సెక్షన్‌లో ట్రాక్‌పై వరద ప్రవహిస్తుండటంతో పలు రైళ్లను దారి మళ్లించారు. అక్కన్నపేట-మెదక్ సెక్షన్ పరిధిలో పలు రైళ్లను దారి మళ్లించినట్టు రైల్వే అధికారులు తెలిపారు. ఇదిలావుంటే, తెలంగాణకు రెడ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ రాష్ట్రంలోని అన్ని జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
This post was last modified on August 27, 2025 10:47 pm
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…