Political News

జగన్ తో కానిది బాబుతో పూర్తి!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన ఐదేళ్ల పాలనను ఆకాశానికెత్తని రోజు లేదంటే అతిశయోక్తి కాదేమో. ఎప్పుడు మీడియా ముందుకు వచ్చినా… తన పాలనా కాలం స్వర్ణయుగమని కూడా ఆయన చెప్పుకున్న సందర్భాలు ఎన్నో. అయితే ఆయన చేయలేక చేతెలెత్తేసిన చాలా పనులను ఇప్పుడు కూటమి సారథి, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు వరుసబెట్టి చేసేస్తున్నారు. జగన్ కు పాలన ఎంతమాత్రం చేతకాదని కూడా బాబు తన చర్యల ద్వారానే చెప్పేస్తున్నారు. ఆరేళ్లుగా ఆర్టీసీలో నిలిచిపోయిన పదోన్నతులకు మంగళవారం బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. వెరసి ఆర్టీసీలో ఇప్పుడు పండుగ వాతావరణం నెలకొంంది.

2019 ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆర్టీసీ కార్మికులకు జగన్ భారీ హామీలే ఇచ్చారు. ఆర్టీసీని ప్రభుత్వంలో చేరుస్తామని, ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తామని, ప్రభుత్వ ఉద్యోగులకు మాదిరిగా వేతనాలు ఉంటాయని ఊరించారు. జగన్ హామీలకు జనంతో పాటు ఆర్టీసీ కార్మికులు కూడా ఆకర్షితులయ్యారు. జగన్ గెలిచారు. ఆర్టీసీని ప్రభుత్వంలో చేర్చారు. అంతే… ఇక ఆ సంస్థలో చేపట్టాల్సిన సంస్కరణల విషయం గురించి మరిచారు. ఉద్యోగుల పదోన్నతుల విషయాన్ని పూర్తిగా మరిచారు. ఉద్యోగులు ఎంతగా మొత్తుకున్నా జగన్ మనసు కరగలేదు. ఫలితంగా ఆరేళ్లుగా ఆర్టీసీలో పదోన్నతులే లేకుండా కాలం గడిచిపోయింది.

తాజాగా కూటమి సర్కారు అదికారంలోకి వచ్చాక ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు అటు సీఎం చంద్రబాబును, ఇటు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిలను తరచూ కలిసి తమ సమస్యను, పదోన్నతులు నిలిచిన విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లారు. తాజాగా ఆర్టీసీ పదోన్నతులపై సమీక్ష చేసిన చంద్రబాబు ఆరేళ్లుగా సంస్థలో పదోన్నతులు లేకుంటే ఉద్యోగులు నష్టపోతారు కదా అంటూ అధికారులను ప్రశ్నించారు. తక్షణమే ఆర్టీసీలో ఉద్యోగుల పదోన్నతులకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.

ఆర్టీసీలో ఉద్యోగుల పదోన్నతుల సంబందించిన విధివిధానాలను ఖరారు చేసిన ఉన్నతాధికారులు తొలుత మంత్రి మండిపల్లికి, ఆ తర్వాత సీఎం ముందు ప్రతిపాదనలు పెట్టారు. ఈ ప్రతిపాదనలను పరిశీలించిన చంద్రబాబు తక్షణమే పదోన్నతులు చేపట్టండి అని ఆదేశించారు. బాబు ఆదేశాలతో ఆర్టీసీలో అసిస్టెంట్ మెకానిక్ స్థాయి నుంచి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దాకా పదోన్నతులు కల్పించనున్నారు. ఆర్టీసీలో ఉద్యోగుల పదోన్నతులకు అనుమతి ఇచ్చిన బాబుకు ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ (ఈయూ) నేత దామోదర్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

This post was last modified on August 27, 2025 7:31 am

Share

Recent Posts

దుబాయ్ విమానంలో ఫైటింగ్… 180 మందిని కాపాడిన ఇండియన్ కెప్టెన్

భూమికి 33 వేల అడుగుల ఎత్తులో... ఆకాశంలో యుద్ధం జరిగింది. సినిమాను తలపించిన ఈ యుద్ధంలో హీరో ఇండియన్ కెప్టెన్…

12 minutes ago

405 అయినా సరే… తగ్గేదే లే!!

వన్డేల్లో 405 పరుగులు చేసిన తర్వాత కూడా ఓడిపోతామని వెస్టిండీస్ ఊహించి ఉండదు. గువాహటిలో ఆ జట్టు బ్యాటర్లు చెలరేగిపోయారు.…

30 minutes ago

సిరిసిల్ల కాదు.. ఉరిసిల్ల‌.. రెచ్చిపోయిన రేవంత్‌రెడ్డి

టార్గెట్ కేటీఆర్.. ల‌క్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. బీఆర్ఎస్ నాయ‌కుడు, మాజీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న…

2 hours ago

సూపర్ హిట్ హీరోల విచిత్ర పరిస్థితి

ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…

4 hours ago

ఎన్టీఆర్… ఇలాగే ఉండాలి

తన చేతికి గాయం అయింది సర్జరీ చేసుకుంటున్నా అంటూ కొన్ని నెలల ముందు షాకింగ్ అప్‌డేట్ ఇచ్చి సైలెంట్ అయిపోయాడు…

4 hours ago

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

6 hours ago