ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు.. ఉన్నది ఉన్నట్టుమొహంపైనే మాట్లాడే నాయకుడు. స్పీకర్‌గా ఉన్నా.. గతంలో మంత్రిగా పనిచేసినా.. ప్రతిపక్షంలో కూర్చున్నా.. ఆయన స్టయిల్ మాత్రం ఆయన ఎప్పుడూ కొనసాగిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నాం కదా.. అని ఆయన వెనక్కి తగ్గింది లేదు. అధికారంలో ఉన్నాం కదా.. అని సరిపెట్టుకున్నదీ లేదు. ఏ చిన్న తేడా వచ్చినా.. మొహం మీదే అడిగేస్తారు. అలానే ఇప్పుడు.. అయ్యన్న పోలీసులపై విరుచుకుపడ్డారు.
అయ్యన్న సొంత జిల్లా అనకాపల్లి జిల్లా దొండపూడిలో గ్రామ దేవత సంబరాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు సాగే ఈ ఉత్సవాలను.. స్పీకర్ అయ్యన్న ప్రారంభించేందుకు వచ్చారు. అయితే.. ఆయనను చూడగానే పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడారు. అయితే.. వీరంతా అభిమానులే అయినా.. ప్రస్తుతం రాజకీయ పరిస్థితి సరిగా లేకపోవడంతో వీరిలో ఎవరైనా వైసీపీ సానుభూతి పరులు కూడా ఉంటే.. తనపై దాడి జరిగితే ఏంటి? అనేది అయ్యన్న ఆవేదన. దీంతో పోలీసులపై విమర్శలు చేశారు.
దీనికి మరో కారణం కూడా.. ప్రొటోకాల్ ప్రకారం స్పీకర్‌కు భద్రత కల్పించాలి. ఈ విషయంలో పోలీసులు సరిగా పట్టించుకోలేదు. సమయానికి రావాల్సిన సీఐ, ఎస్సై వంటివారు అయ్యన్నకు కనిపించలేదు. కనీసం.. తనకు భద్రతగా మరొకరు ఎవరూ కూడా లేకుండా పోయారు. మరోవైపు సాధారణ ప్రజలు తనను చుట్టుముట్టారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన అయ్యన్న.. పోలీసులపై విమర్శలు గుప్పించారు. కనీసం ప్రొటోకాల్ కూడా తెలియకపోతే మీకు ఉద్యోగాలు ఎందుకు? అని నిలదీశారు.
ఈ వ్యవహారం సోషల్ మీడియాలో రచ్చకు దారితీసింది. పోలీసులను తిట్టారంటూ.. అయ్యన్నపై వైసీపీ నాయకులు యాగీ చేయడం ప్రారంభించారు. ఈ విషయాన్ని గమనించిన సీఎంవో అధికారులు, డీజీపీ కూడా.. అసలు ఏం జరిగిందో వివరణ ఇవ్వాలని డీఎస్పీని ఆదేశించారు. ప్రొటోకాల్ పాటించక పోవడానికి కారణాలు చెప్పాలని పేర్కొన్నారు. ఇదేసమయంలో అయ్యన్న పాత్రుడికి భద్రత కల్పించాలని.. డీజీపీ మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. కానీ.. అప్పటికే వివాదం జరగడంతో అయ్యన్న అన్యమనస్కంగా నే కార్యక్రమాన్ని ముగించి తిరిగి వెళ్లిపోయారు. అసెంబ్లీలోనే ప్రశ్నిస్తానని ఆయన పోలీసులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
This post was last modified on August 25, 2025 10:28 am
కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…
ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…
మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…