దువ్వాడ శ్రీనివాస్… ఈ పేరుకు పెద్దగా పరిచయమే అక్కర్లేదు. తెలుగు ప్రజల కళ్ల ముందు నుదుటన నిలువు బొట్టు పెట్టి నిత్యం ఓ పోరాట యోధుడిలా కనిపిస్తూ ఉంటారు. మరో పార్శ్వంలో నుంచి చూస్తే… రెండో పెళ్లాం దివ్వెల మాధురితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ ఆ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పెడుతూ తెగ హల్ చల్ చేస్తూ ఉంటారు. మొన్నటిదాకా విపక్ష వైసీపీలో కొనసాగిన దువ్వాడ తన వ్యవహార సరళి కారణంగా పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. అయితే ఇప్పుడు తిరిగి రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నట్లు బుధవారం దువ్వాడ సంచలన ప్రకటన చేశారు. ఇదివరకటిలా కాకుండా ఇప్పుడు రాజకీయాలను మడతెట్టేస్తానని ఆయన ఓ సంచలన కామెంట్ ను కూడా సంధించారు.
అసలు ఇప్పుడు దువ్వాడ పొలిటికల్ రీఎంట్రీకి వచ్చిన అత్యవసర పరిస్థితి ఏమిటన్న విషయానికి వస్తే… ఆముదాలవలస ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత కూన రవికుమార్ ఇప్పుడు పెను వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. పార్టీలు వేరైనా ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో కూనకు మద్దతుగా దువ్వాడ ఏమాత్రం ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగిపోయారు. అసలు కూన తప్పు చేసే వ్యక్తి కాదని, త్వరలోనే కూనకు మంత్రి పదవి రానుందని, ఈ పదవి ఆయనకు దక్కకుండా టీడీపీ నుంచి మంత్రి అచ్చెన్నాయుడు, వైసీపీ నుంచి మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ లు కూనపై బురద చల్లుతున్నారట. అందులో బాగంగానే కూనపై ఆరోపణలు వస్తున్నాయని దువ్వాడ ఆరోపించారు.
పార్టీలు విడిచి అచ్చెన్న, ధర్మానలు కలిసి కూనను నాశనం చేయడానికి యత్నిస్తే… కూన ఒంటరేమీ కాదని, ఆయనకు తాను అండగా ఉన్నానని, సిక్కోలు రాజకీయాలను మడతపెట్టేసి అయినా కూనను కాపాడుకుంటానని ఆయన ప్రకటించారు. అయినా తాను ఇప్పుడు వైసీపీలో లేనని చెప్పిన దువ్వాడ… ధర్మాన మాదిరిగా తాను నీతిమాలిన రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని కూడా ఆయన ఓ సంచలన కామెంట్ చేశారు. తానేదో వైసీపీ నుంచి బయటకు వెళ్లిన తర్వాత హైదరాబాద్ లో చీరల దుకాణం తెరచుకుని, దుస్తులు మడతేసుకుంటూ కూర్చుంటానని అనుకుంటున్నారా? అని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. దుస్తులు కాదు, సిక్కోలు రాజకీయాలను మడతెట్టేస్తానని ఆయన అన్నారు.
వాస్తవానికి ఉత్తరాంధ్ర రాజకీయాలు మిగిలిన ఏపీతో పోలిస్తే భిన్నంగా ఉంటాయి. వాటిలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల రాజకీయాలు మరింత ప్రత్యేకం. వాటిలోనూ శ్రీకాకుళం రాజకీయాలు ఎప్పటికప్పుడు రాజకీయ మంటలను పుట్టిస్తూనే ఉంటాయి. ఇక్కడ అగ్రవర్ణాలకు చెందిన నేతల రాజకీయాలు ఎంతమాత్రం చెల్లవు. ఆది నుంచి కూడా బీసీలతో ఇక్కడ రాజ్యాధికారం. ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా, చివరకు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు అయినా కూడా బీసీ వర్గాల నుంచే ఎన్నికవుతూ ఉంటారు. ఇలాంటి నేపథ్యంలో ఒకే సామిజిక వర్గానికి చెందిన నేతలు పార్టీలకు అతీతంగా సహాయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు తమ సొంత పార్టీలకు కూడా నష్టం చేయడానికి వెనుకాడరు.
This post was last modified on August 20, 2025 9:44 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…