టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా తన సత్తా నిరూపించుకున్న నారా లోకేశ్ ఇప్పుడు మంత్రిగా ప్రభుత్వ పాలనలోనూ తనదైన శైలి దూకుడుతో సాగుతున్నారు. ఏ ఒక్క రాష్ట్రానికి గానీ, ఏ ఒక్క మంత్రికి గానీ సాధ్యం కాని రీతిలో కేంద్ర ప్రభుత్వాన్ని మెప్పించి మరీ కేటాయించిన నిధుల కంటే కూడా అదనపు నిధులను సాధిస్తున్నారు. అది కూడా ఏదో పంచాయతీ రాజ్ లాంటి శాఖకు కాదు. విద్యా శాఖకు లోకేశ్ కేంద్రం నుంచి తాజాగా ఏకంగా రూ.432.19 కోట్లను సాధించారు. ఈ నిధులు వివిధ పద్దుల కింద ఏపీకి త్వరలోనే విడుదల కానున్నాయి.
వాస్తవానికి మానవ వనరుల అభివృద్ధి కిందకు వచ్చే విద్యా శాఖకు పెద్దగా ఆశించిన మేర నిధుల కేటాయింపు ఉండదు. ఏదో అలా ఏటా కొంత మొత్తం మేర అన్నట్లుగా అటు కేంద్రం అయినా, ఇటు రాష్ట్రం అయినా ఓ మోస్తరు నిధులను కేటాయించి వాటితోనే విద్యా శాఖను నెట్టుకొస్తూ ఉంటాయి. అయితే లోకేశ్ ఏపీ విద్యా శాఖమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఏపీ విద్యార్థులను దేశంలోనే అత్యుత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్న లోకేశ్… ఏడాది వ్యవధిలోనే చాలా సంస్కరణలు చేపట్టారు. ప్రస్తుతం లోకేశ్ మార్క్ మోడల్ విద్యా వ్యవస్థపై దేశంలో చర్చ జరుగుతోంది.
తాజాగా ఢిల్లీలో పర్యటించిన లోకేశ్… పలువురు మంత్రులను కలిశారు. ఈ క్రమంలో కేంద్ర మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రిని కలిసిన సందర్భంగా ఏపీలో ప్రైమరీ, సీనియర్, సీనియర్ సెకండరీ విద్యా వ్యవస్థలో తీసుకువచ్చిన సంస్కరణల గురించి ఆయన కేంద్ర మంత్రికి వివరించారు. అంతేకాకుండా ఆ సంస్కరణలు ముందుకు సాగాలంటే కేంద్రం నుంచి సహకారం తప్పనిసరి అని కూడా ఆయన కేంద్ర మంత్రికి వివరించారు. లోకేశ్ ప్రజెంటేషన్, ఆయన చేపట్టిన సంస్కరణల గురించి సావదానంగా విన్న కేంద్ర మంత్రి అప్పటికే నిర్దేశిత కోటాను కాదని అదనంగా నిధులు కేటాయించేందుకు అంగీకరించారు.
కేంద్రం నుంచి ఏపీ విద్యా శాఖకు అదనంగా విడుదలైన నిధుల్లో విద్యాలయాల్లో సైన్స్ ల్యాబ్ ల ఏర్పాటుకు ఇదివరకు కేటాయించిన నిధులకు అదనంగా రూ.167.46 కోట్లను కేంద్రం విడుదల చేసేందుకు అంగీకరించింది. డైట్ కళాశాలలను సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ గా మార్చడానికి కేంద్రం ప్రస్తుతం 50 శాతం నిధులను మాత్రమే విడుదల చేస్తోంది. అయితే లోకేశ్ చొరవతో ఈ విభాగానికి ఏకంగా 96 శాతం నిధులను అందజేసేందుకు అంగీకరిస్తూ… రూ.43.23 కోట్లను విడుదల చేయనుంది. ఇక ఆదివాసీ విద్యార్థుల వసతి గృహాల కోసం అదనంగా రూ.11 కోట్లను కేంద్రం విడుదల చేయనుంది.
This post was last modified on August 20, 2025 4:00 pm
ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…
దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…
తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…
నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…
మెగాస్టార్ చిరంజీవి అభినందన అంటే యువ నటీనటులకు ఒక సర్టిఫికెట్ లాంటిదే. ఐతే ఏదైనా ఈవెంట్లకు వచ్చినపుడు అక్కడున్న వారిని…