Political News

బాబు-జ‌గ‌న్‌-కేసీఆర్ స‌ర్‌లు స‌హ‌క‌రించాలి: రేవంత్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల ఎంపీల‌కు లేఖ‌లు రాయ‌నున్న‌ట్టు తెలిపారు. అదేస‌మ‌యంలో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌, ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్‌, ప్ర‌స్తుత సీఎం చంద్ర‌బాబుల‌కు కూడా ఆయ‌న ప్ర‌త్యేక విజ్ఞ‌ప్తులు చేశారు. “మాకు స‌హ‌క‌రించండి. మ‌న తెలుగువారైన‌.. జ‌స్టిస్ సుద‌ర్శ‌న్ రెడ్డి విజ‌యానికి చేయి క‌ల‌పండి” అని రేవంత్ రెడ్డి విన్న‌వించారు. సుదీర్ఘ కాలం త‌ర్వాత‌.. తెలంగాణ వారికి.. రాజ్యాంగ బ‌ద్ధ‌మైన ప‌ద‌విలో కూర్చుకునేందుకు అవ‌కాశం వ‌చ్చింద‌న్న రేవంత్‌రెడ్డి.. దీనికి తెలుగు వారిగా ప్ర‌తి ఒక్క‌రూ స‌హ‌క‌రించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.

నేను చెప్పేది ఏంటంటే..

ఉప‌రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వికి పోటీ చేసే అవ‌కాశం తొలిసారి తెలంగాణ‌కు ద‌క్కింద‌ని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. మంగ‌ళ‌వారం సాయంత్రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. ఈ అవ‌కాశాన్ని గ‌ర్వ‌కార‌ణంగా భావించాల‌ని రాజ‌కీయ పార్టీల‌కు పిలుపునిచ్చారు. ఈ విష‌యంలో రాజ‌కీయ బేధాభిప్రాయాల‌కు తావులేకుండా వ్య‌వ‌హ‌రించాల‌ని, తెలుగు వారంతా ఏక‌తాటిపై నిలుస్తార‌న్న సందేశాన్ని పంపించాల‌ని ఆయ‌న విన్న‌వించారు. ఈ క్ర‌మంలో ఏపీ సీఎం చంద్ర‌బాబు, మాజీ సీఎం జ‌గ‌న్‌లు త‌మ‌కు మ‌ద్ద‌తుగా నిల‌వాల‌న్నారు. అదేవిధంగా తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్‌, మ‌రో పక్షం ఎంఐఎంలు కూడా క‌లిసి రావాల‌ని అన్నారు.

ఇండియా కూట‌మి త‌ర‌ఫున తెలంగాణ‌కు చెందిన సుప్రీంకోర్టు మాజీ న్యాయ‌మూర్తి జ‌స్టిస్ సుద‌ర్శ‌న్‌రెడ్డిని ఎంపిక చేయ‌డం ప‌ట్ల తాము ఎంతో సంతోషిస్తున్నామ‌ని రేవంత్ రెడ్డి చెప్పారు. గ‌తంలో పీవీ న‌ర‌సింహారావుకు ప్ర‌ధానిగా చేసే అవ‌కాశం వ‌చ్చింద‌ని.. మ‌ళ్లీ ఇప్పుడు ఉప‌రాష్ట్ర‌పతిగా పోటీ చేసే అవ‌కాశం తెలంగాణ వాసికి ల‌భించింద‌న్నారు. ముఖ్యంగా తెలంగాణ స‌మాజానికి ప్ర‌త్యేక గుర్తింపు ల‌భించేలా ఈ నిర్ణ‌యం ఉంద‌న్నారు. ఈ విష‌యంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూట‌మికి తాను వ్య‌క్తిగ‌తంగా ధ‌న్య‌వాదాలు చెబుతున్నాన‌ని అన్నారు. అప్ప‌ట్లో న‌ర‌సింహారావుకు.. దివంగ‌త ఎన్టీఆర్ మ‌ద్ద‌తు ఇచ్చార‌ని గుర్తు చేశారు. అదేవిధంగా ఇప్పుడు సుద‌ర్శ‌న్ రెడ్డికి చంద్ర‌బాబు మ‌ద్ద‌తు ఇవ్వాల‌న్నారు.

కేంద్రంపై విమ‌ర్శ‌లు..

ఈ సంద‌ర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించారు. ప్రజాస్వామ్యాన్ని, ఎన్నికల వ్వవస్థలను కేంద్రంలోని ఎన్డీయే అపహాస్యం చేస్తోంద‌ని మండిప‌డ్డారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూట‌మి రాజ్యాంగ రక్షణ కోసం పోరాడుతోంద‌ని తెలిపారు. ఎన్డీయే కూట‌మి మాత్రం.. రాజ్యాంగాన్నే రద్దు చేయాలని చూస్తోంద‌ని ఆరోపించారు. ఈ నేప‌థ్యంలో రాజ్యాంగాన్ని ర‌క్షించే కూట‌మికి అంద‌రూ మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని విన్న‌వించారు.

This post was last modified on August 19, 2025 9:45 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బాబీ గారు… ప్రేక్షకులు ఎప్పుడైనా రైటే

భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…

6 hours ago

‘ఇవేవీ తెలియకుండా జగన్ సీఎం ఎలా అయ్యాడో’

వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…

7 hours ago

అఫీషియల్: తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీ

తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…

7 hours ago

‘నువ్వు బ‌జారోడివి కాదు’… అనిల్ మీమ్ పంచ్

సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయ‌డంలో తెలుగు వాళ్ల‌ను మించిన వాళ్లు ఇంకెవ్వ‌రూ ఉండ‌రంటే అతిశ‌యోక్తి కాదు. కొన్ని మీమ్స్…

9 hours ago

జగన్ చేతులు కాల్చాకా నేతలు ఆకులు పట్టుకున్నారు

అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…

10 hours ago

కైట్ కుర్రోళ్లు… ఇప్పటికైనా అర్థం చేసుకోండి

సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…

11 hours ago