రాజకీయ వివాదాలు ముసురుకుంటున్న సమయంలో కూటమిలో అసలు సమస్య ఎక్కడ ఉంది? నాయకుల వ్యవహారాలు బయటకు లీకెలా అవుతున్నాయి.? అనేది ఆసక్తిగా మారింది. వాస్తవానికి తప్పులు చేసే నాయకులను ఎవరూ వెనుకేసుకురాకూడదు. తప్పును తప్పుగా చెప్పడం కూడా మంచిదే. నాయకులు మారేలా ప్రోత్సహించాల్సిన అవసరం, మార్పు కోరుకోవడం కూడా మంచిదే. అయితే.. ఇవన్నీ.. అంతర్గతంగా జరగాల్సిన వ్యవహారాలు. కానీ, బయటకు వచ్చేస్తున్నాయి. వీధుల్లో విప్లవాలు సృష్టిస్తున్నాయి.
ఒక్క టీడీపీ అనేకాదు.. జనసేనలోనూ ఇలానే జరుగుతోంది. దీనికి కారణం ఏంటి? ఎందుకు జరుగుతోంది? అనేది ఇంపార్టెంట్ ఇష్యూగా మారింది. ప్రధానంగా .. నాయకులపై ఆధిపత్య పోరు కారణంగానే ఇది జరుగుతోందని తెలుస్తోంది. తాజాగా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ పార్టీ నాయకుడి(టీఎన్ఎస్ఎఫ్)తో సంభాషించిన ఫోన్ కాల్ ఆడియో బయటకు వచ్చేసింది. అయితే.. ఇది ఎలా వచ్చిందన్నది ప్రశ్న. ఇస్తే.. ఎమ్మెల్యే ఫోన్ నుంచి బయటకు రావాలి. లేకపోతే.. సదరు టీఎన్ఎస్ఎఫ్ నేత నుంచి రావాలి.
ఈ రెండు కాకుండా.. వేరే వారి ప్రమేయం లేదు. తప్పయినా.. ఒప్పయినా.. ఈ విషయాన్ని అంతర్గతంగా చర్చించుకుని పరిష్కరించే అవకాశం ఉన్నా.. అత్యుత్సాహంతోపాటు.. ఎమ్మెల్యే ఆధిపత్యాన్ని తట్టుకోలే క జరిగిన పరిణామంగా సీనియర్లు చెబుతున్నారు. ఇక, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే వ్యవహారంలోనూ.. హానీ ట్రాప్ జరిగిందన్న చర్చ ఉంది. ఆయన నమ్మి వేరే వ్యక్తితో సంభాషిస్తే.. అది కాస్తా బయటకు వచ్చింది. అంటే.. చిన్న వీక్ నెస్ పెద్ద సమస్యను తెచ్చి పెట్టింది. ఇది కూటమిలో కూడా చర్చనీయాంశం అయింది.
ఇక, కూన రవి కుమార్.. వ్యవహారం దీనికి భిన్నంగా ఉంది. ఆయన ఓ టీచర్‌ను ఫోన్‌లోనే హెచ్చరించారు. వాస్తవానికి ఏదైనా తేడా ఉంటే.. క్షేత్రస్థాయికి వెళ్లి పరిష్కరించి ఉంటే వేరేగా ఉండేది. కానీ, ఆయన ఫోన్ లో సంభాషించడం.. ఉద్యోగ సంఘాలు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో సదరు ఆడియో బయటకు వచ్చింది. అంటే.. ఈ ఘటనలు..వివాదాల వెనుక.. ప్రత్యర్థుల కంటే కూడా.. స్వయంగా నాయకులు చేసుకున్న తప్పులే కనిపిస్తున్నాయి. వీటిపై పార్టీ దృష్టి పెట్టింది. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసే ప్రయత్నాలు ప్రారంభించింది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on August 18, 2025 9:58 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…