వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డికి దాదాపుగా 3 నెలల తర్వాత ఒకింత ఊరట లభించింది. రుస్తుం మైనింగ్ కేసులో అరెస్టు అయిన కాకాణిపై ఆ తర్వాత వరుసబెట్టిన మరో 7 కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఓ కేసులో బెయిల్ వచ్చినా మరో కేసులో ఆయనకు బెయిల్ రాకపోవడంతో ఆయన నెల్లూరు జైలులో 85 రోజుల పాటు విచారణ ఖైదీగా ఉండాల్సి వచ్చింది. ఇప్పటిదాకా 7 కేసుల్లో బెయిల్ రాగా… తాజాగా సోమవారం ఏపీ హైకోర్టు రుస్తుం మైనింగ్ కేసులోనూ కాకాణికి బెయిల్ మంజూరు చేయడంతో ఆయన మంగళవారం జైలు నుంచి విడుదల కానున్నారు.
వైసీపీ అధికారంలో ఉండగా… చేతిలోని మంత్రిదండాన్ని ఝుళిపించిన కాకాణి ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణల్లో ప్రధానమైనది రుస్తుం మైనింగ్ నుంచి భారీ ఎత్తున అక్రమ మైనింగ్ ను కొనసాగించడం. దీనిపై ఇదివరకే కేసు నమోదు కాగా… కాకాణి అనుచరులు అరెస్టయ్యాయి. అయితే నాడు మంత్రిగా ఉన్న కాకాణి ఈ కేసు తన మీదకు రాకుండా చూసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఈ కేసును మరింత లోతుగా పరిశీలించి ప్రధాన నిందితుడు కాకాణినే అని తేల్చి ఆయన పేరును కేసులో చేర్చింది.
ఈ క్రమంలో విచారణకు రమ్మంటూ కాకాణిని పోలీసులు పిలవగా… వారి నోటీసులు తీసుకోకుండా కాకాణి పోలీసు శాఖను ఓ రేంజిలో ముప్పుతిప్పలు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే లెక్కలేనన్ని నోటీసులకు ఉద్దేశపూర్వకంగానే కాకాణి తప్పించుకుంటున్నారన్న భావనకు వచ్చిన పోలీసులు కాకాణి అరెస్టుకు రంగం సిద్ధం చేశారు. ఈ విషయం తెలుసుకున్న కాకాణి కేరళ వెళ్లిపోయారు. అయితే పోలీసులు ఆయన ఆచూకీని గుర్తించి కేరళకే వెళ్లి మరీ ఆయనను అరెస్టు చేశారు. అప్పటినుంచి కాకాణి నెల్లూరు జైలులోనే కాలక్షేపం చేయక తప్పలేదు.
This post was last modified on August 18, 2025 9:26 pm
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…
దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…