ఏపీ రాజధాని అమరావతి పనులు మరింత దూకుడుగా ముందుకు సాగనున్నాయా? వర్షాలు, వరదలను సైతం తట్టుకునే టెక్నాలజీతో పనులు చేయాలని భావిస్తున్నారా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. నిజానికి చిన్నపాటి వర్షానికే పనులు ఆగిపోయే పరిస్థితి ఉంది. ఇది ఎక్కడైనా సహజమే. పైగా.. అమరావతి విషయంల అయితే మరింత ఎక్కువగా ఇబ్బందులు వస్తున్నాయి. పక్కనే కృష్ణానది ప్రవహిస్తుండడంతో నీటి ఊటలు పెరిగి.. పది అడుగులకే నీరు చిమ్ముతోంది. దీంతో గతంలో పనులు ఆగిపోయాయి.
అయితే.. ఇప్పుడు 2028 నాటికి అమరావతి తొలి దశను పూర్తిచేయాలని సంకల్పం పెట్టుకున్న సీఎం చంద్రబాబు.. ఎట్టిపరిస్థితిలోనూ.. పనులు అనుకున్న సమయానికి పూర్తిచేయాలని భావిస్తున్నారు. దీంతో జర్మన్ టెక్నాలజీని వినియోగించి.. నీటిని తోడేయడంతోపాటు.. ఆవిరి యంత్రాల ద్వారా.. చెమ్మ ఉన్నప్పటికీ.. పిల్లర్లు వేసేలా ప్రయత్నాలు ప్రారంభించాలని ఆదేశాలిచ్చారు. దీంతో పనులు ఆగకుండా ముందుకు సాగాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఇదేసమయంలో నాణ్యతకు ఎక్కడా రాజీ పడొద్దని కూడా సీఎం చెబుతున్నారు.
ఇక, ప్రతి పనికీ లెక్కలు చూపాలన్నది కూడా సీఎం చంద్రబాబు ఆలోచన. అమరావతిలో ఏదో తినేస్తున్నారని.. ప్రతి పనినీ ఎక్కువ ఖర్చుకు కాంట్రాక్టర్లకు కట్టబెడుతున్నారని వైసీపీ నేతల నుంచి విమర్శలు వస్తున్నాయి. దీంతో సహజంగానే అమరావతిపై విమర్శలు వస్తున్నాయని భావిస్తున్న చంద్రబాబు ఇక నుంచి ప్రతి పనికీ అయ్యే ఖర్చును పబ్లిక్ డొమైన్‌లో పెట్టాలని అధికారులను ఆదేశించారు. ఏపనికి ఎంత ఖర్చు చేస్తున్నారు? మెటీరియల్ వివరాలు.. వాటి ఖర్చు.. వంటివాటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తారు.
మొత్తంగా అమరావతి పనులను సాధ్యమైనంత వేగంగా పూర్తిచేయడమే కాకుండా.. వాటిని పారదర్శకంగా కూడా నిర్వహించాలని నిర్ణయించారు. ఎక్కడా రాజీ లేని ధోరణితో ముందుకు సాగాలని.. 2028 చివరి నాటికి నవ నగరాలను పూర్తిచేయాలని కూడా చంద్రబాబు నిర్ణయించుకున్నారు. దీంతో అమరావతిపై జరుగుతున్న విష ప్రచారానికి చెక్ పెట్టాలన్నది చంద్రబాబు వ్యూహం. ఈ క్రమంలోనే ప్రతి పనికీ లెక్కతోపాటు.. కాలాలతో సంబంధం లేకుండా పనులు వేగంగా పూర్తి చేయనున్నారు.
This post was last modified on August 16, 2025 10:33 pm
2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…
ఏపీలో కూటమి సర్కారు అమలు చేస్తున్న స్త్రీ శక్తి పథకం రికార్డ్ సృష్టించింది. గత ఏడాది ప్రారంభించిన ఈ పథకం…
అనుకోని అదృష్టం తలుపు తట్టి ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కామ్రేడ్ కళ్యాణ్ కు భలే కలిసి…
ఇండియన్ క్రికెట్లో ఒక శకం ముగిసింది. లెజెండరీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ నాయకత్వానికి వీడ్కోలు పలికింది. 37 ఏళ్ల హర్మన్ ప్రీత్…
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో కూటమి నేతలు ఎన్నికల వ్యూహంపై దృష్టి సారించారు. ఈ క్రమంలో…
ఒక జాతీయ సెలవు దినం రోజు ఎనిమిది సినిమాలు విడుదలైతే ఆ వీకెండ్ మొత్తం థియేటర్లు కళకళలాడిపోవాలి. వాటిలో సగం…