పార్టీ కోసం వీరవిధేయుడిగా కష్టపడ్డారు. చంద్రబాబును తన తండ్రిగా పేర్కొన్నారు. వైసీపీపైనా.. ఆ పార్టీ నాయకులపైనా నిప్పులు చెరిగారు. ఎప్పుడు అవకాశం వస్తే.. అప్పుడు తన తడాఖా చూపించారు. బలమైన గళం కూడా వినిపించారు. కానీ, చిన్న లోపం.. ఒకే ఒక్క చిన్న పొరపాటు.. సదరు తమ్ముడిని దేనికీ కొరగాకుండా చేసేసింది. ఆయనే విజయవాడకు చెందిన బుద్దా వెంకన్న. ఇప్పటికే ఆయనను పార్టీ పక్కన పెట్టిందనే టాక్ జోరుగా వినిపిస్తోంది. అంతేకాదు.. పార్టీ ఆఫీసుకు కూడా ఆయన రావడం లేదు.
ఒకప్పుడు విజయవాడ, మంగళగిరిలోని పార్టీ కార్యాలయాల్లో.. బలమైన వాయిస్ వినిపించే నేతగా బుద్దా గుర్తింపు తెచ్చుకున్నారు. పార్టీ తరఫున పోరాడేవారిలోనూ ఆయన ముందు వరుసలో ఉన్నారు. గతంలో పార్టీ ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడంతో మరింత రెచ్చిపోయారు. కానీ, ఇప్పుడు చూసుకుంటే..పార్టీ అధికారంలోకి వచ్చి.. 15 మాసాలైనా.. బుద్దా పేరు ఎక్కడా వినిపించడం లేదు. ఆయన గురించి మాట్లాడు కునే నాయకులు కానీ.. తలుచుకునే నేతలు కానీ కరువయ్యారు. దీనికి ప్రధానంగా ఒకే ఒక్క కారణం.. గత ఎన్నికలకు ముందు ఆయన చేసిన హంగామానేనని అంటున్నారు.
విజయవాడ వెస్టు కోసం పట్టుబట్టడం. ఈ క్రమంలో టికెట్ రాదని తెలిసినా.. రక్తతర్పణం పేరుతో చంద్రబాబు రక్తాభిషేకం చేయడం. పైగా.. పార్టీ నిర్ణయం తీసుకున్నాక… కూటమిలోని బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరిని విభేదించడం. ఈ కారణంతో పార్టీ అధినేత బుద్దాను పక్కన పెట్టారు. తాజాగా ఇచ్చిన 31 నామినేటెడ్ పదవుల్లో ఇదే పశ్చిమ నియోజకవర్గానికి చెందిన నాగుల్ మీరాతోపాటు.. మరొకరికి కూడా పదవి దక్కింది. కానీ, కీలకమైన బుద్దాను మాత్రం చంద్రబాబు పక్కన పెట్టారు.
ఇక, ఇప్పుడున్న పరిస్థితిలో బుద్దాకు పదవి దక్కే అవకాశం ఏమీ కనిపించడం లేదని కూడా అంటున్నా రు. వాస్తవానికి ఎమ్మెల్సీ కోరుకున్న బుద్దా.. ఈ పదవిపై కొన్నాళ్లు పోరాడారు. కానీ, అది దక్కలేదు. ఇక, ఆ తర్వాత.. నామినేటెడ్ పదవుల్లో భాగంగా ఆర్టీసీ చైర్మన్ పోస్టును కోరుకున్నారు. ఇది కూడా దక్కలేదు. ఇవన్నీ ఇలా ఉంటే.. పార్టీలో అయినా.. పదవి దక్కుతుందని ఆశించారు. ఇది సాధ్యం కాలేదు. ఈ పరిణామాలతో ఇప్పుడు ప్రకటించిన వాటిలో అయినా.. తన పేరు ఉంటుందని అనుకున్నా.. అది కూడా సాధ్యం కాలేదు. దీంతో బుద్దా పరిస్థితి ఇబ్బందుల్లో పడింది. మరి ఆయన పార్టీలోనే ఉంటారో.. లేక వైసీపీ ఆహ్వానిస్తున్నట్టు వస్తున్న సమాచారం మేరకు.. ఆ పార్టీలోకి జంప్ చేస్తారో చూడాలి.
This post was last modified on August 16, 2025 5:07 pm
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
తెలంగాణలో తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దక్కించుకుందని.. ఇది 2029 వరకు కొనసాగుతుందని.. అప్పుడు…
వ్యక్తిగత విషయాలే.. జగన్కు మైనస్ అవుతున్నాయా? ఆయన ఆలోచనా ధోరణి మారకపోతే ఇబ్బందులు తప్పవా? అంటే.. అవుననే సంకేతాలు పార్టీ…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…