Political News

కొమ్మినేని కేసులో సుప్రీంకోర్టు ఏమందంతే…

టీవీ ఛానెళ్లు నిర్వ‌హించే చ‌ర్చ‌లు.. ఈ సంద‌ర్భంగా పార్టిసిపెంట్లు చేసే వ్యాఖ్య‌ల‌పై సుప్రీంకోర్టు తాజాగా కీల‌క ఉత్త‌ర్వులు జారీచేసింది. “ఏదైనా చ‌ర్చ‌లో పాల్గొనే పార్టిసిపెంట్లు.. వివాదాస్ప‌ద‌, ప‌రువు న‌ష్టం క‌లిగించే వ్యాఖ్య‌లు, అంశాలు లేవ‌నెత్తిన‌ప్పుడు.. యాంక‌ర్లు.. వినోదం చూడ‌డం స‌రికాదు. వాటిని అరిక‌ట్టండి. స‌ద‌రు పార్టిసిపెంట్ల‌ను క‌ట్ట‌డి చేయండి. అవ‌స‌ర‌మైతే.. మీ చేతిలోనే రిమోట్ పెట్టుకుని వారి వాయిస్‌ను నిలువ‌రించిండి. అంతేకానీ.. మీకు సంబంధం లేద‌ని చూస్తూ కూర్చోవ‌ద్దు.” అని సుప్రీంకోర్టు తాజాగా ఉత్త‌ర్వులు జారీ చేసింది.

విష‌యం ఇదీ..

రెండు మాసాల కింద‌ట సాక్షి ఛానెల్‌లో అమ‌రావ‌తిపై చ‌ర్చ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా కృష్ణం రాజు అనే వ్యాఖ్యాత‌.. అమ‌రావ‌తి మ‌హిళ‌ల‌పై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ఈ స‌మ‌యంలో డిబేట్‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తూ.. సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు కొమ్మినేని శ్రీనివాస‌రావు.. స్పందించారు. ఔన‌ను.. నేను కూడా చ‌దివాను.. అంటూ ఆయ‌న వ్యాఖ్యానించారు. దీనిపై ఏపీలో పెద్ద ఎత్తున మ‌హిళ‌లు ఆందోళ‌న‌కు దిగారు. కేసు న‌మోదు చేసిన పోలీసులు కొమ్మినేనిని అరెస్టు చేసి గుంటూరు జైల్లో పెట్టారు. ఈ క్ర‌మంలో సుప్రీంకోర్టును ఆశ్ర‌యించి మ‌ధ్యంత‌ర బెయిల్‌ను తెచ్చుకున్నారు కొమ్మినేని.

తాజాగా ఈ మ‌ధ్యంతర బెయిల్‌ను రెగ్యులర్ బెయిల్‌(అంటే.. కేసు ప‌రిష్కారం అయ్యే వ‌ర‌కు బెయిల్ పొంద‌డం)గా మార్పు చేయాల‌ని కోరుతూ.. సుప్రీంకోర్టులో పిటిష‌న్ వేశారు. దీనిపై తాజాగా విచార‌ణ జ‌రిపిన సుప్రీంకోర్టు.. కొన్ని ఆంక్ష‌లు విధిస్తూ.. రెగ్యుల‌ర్ బెయిల్‌గా మార్చింది. న్యాయ‌మూర్తులు జస్టిస్‌ బీవీ నాగరత్న, జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం తీర్పు చెప్పింది. ఈ స‌మ‌యంలో ఏపీ స‌ర్కారు అభిప్రాయం కోరింది. కొమ్మినేనికి రెగ్యుల‌ర్ బెయిల్ ఇవ్వ‌డంపై త‌మ‌కు అభ్యంత‌రం లేద‌ని ప్ర‌భుత్వం చెప్పింది.

దీంతో యాంకర్‌గా నిర్వహించే చర్చల్లో పార్టిసిపెంట్లు ఎలాంటి పరువునష్టం కలిగించే వ్యాఖ్యలు చేయ‌కుండా చూడాల‌ని, ఒక‌వేళ ఏదైనా వ్యాఖ్య చేస్తే వారిని అడ్డుకోవాల‌ని కోర్టు ఆదేశించింది. అవ‌స‌ర‌మైతే.. పార్టిసిపెంట్ల వ్యాఖ్యలను మ్యూట్ చేసేలా చేతిలో రిమోట్‌ పెట్టుకోవాల‌ని ధ‌ర్మాస‌నం చూసించింది. అనంత‌రం కొమ్మినేనిని రెగ్యుల‌ర్ బెయిల్ ఇస్తూ.. తీర్పు చెప్పింది.

This post was last modified on August 15, 2025 5:02 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

4 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

5 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

6 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

7 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

7 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

9 hours ago