తెలంగాణ శాసన మండలి సభ్యులుగా ఉన్న ప్రొఫెసర్ కోదండరామ్, అమీర్ అలీలు తమ సభ్యత్వాలను కోల్పోయారు. వీరిద్దరి శాసన మండలి సభ్యత్వాలను రద్దు చేస్తూ.. సుప్రీంకోర్టు బుధవారం సాయంత్రం సంచలన ఆదేశాలు ఇచ్చింది. తక్షణమే ఇవి అమల్లోకి వస్తాయని.. వారికి కల్పించిన అన్నిసౌకర్యాలను వెనక్కి తీసుకోవాలని, అదేవిధంగా అధికారిక నివాసాలను ఇచ్చి ఉంటే.. వాటిని కూడా తక్షణమే ఖాళీ చేయించాలని ఆదేశాల్లో స్పష్టం చేసింది.
అంతేకాదు.. ఈ ఇద్దరి సభ్యత్వాలు రద్దు చేస్తున్న కారణంగా.. వీటిని భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ తక్షణం ఇవ్వరాదని సుప్రీంకోర్టు తెలిపింది. ఒకవేళ నోటిఫికేషన్ ఇచ్చినా.. తాము ఇవ్వబోయే తుది తీర్పున కు లోబడి నడుచుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు తాజాగా సుప్రీంకోర్టు సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. ఫలితంగా ప్రొఫెసర్ కోదండరామ్, అమీర్ అలీలు .. తమ శాసన మండలి సభ్యత్వాలను కోల్పోయారు. కాగా.. ఈ వ్యవహారంపై ప్రొఫెసర్ కోదండ రామ్ మౌనంగా ఉన్నారు. అమీర్ అలీ మాత్రం.. తాను రివ్యూ పిటిషన్ వేయనున్నట్టు చెప్పారు.
అసలు వివాదం ఏంటి?
కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత.. గవర్నర్ కోటాలోని రెండు ఎమ్మెల్సీ స్థానాల ను భర్తీ చేయాలని నిర్ణయించింది. దీంతో కాంగ్రెస్ తరఫున ప్రొఫెసర్ కోదండరామ్, ప్రముఖ ఉర్దూ పత్రిక ఎడిటర్ అమీర్ అలీలను ప్రతిపాదించింది. ఇక, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కూడా తమ తరఫున అభ్యర్థులను ప్రకటించింది. బీఆర్‌ఎస్ నుంచి దాసోజ్ శ్రవణ్ ,సత్యానారాయణకు కేసీఆర్ అవకాశం ఇచ్చారు.
అయితే.. నాటి గవర్నర్ తమిళి సై.. కాంగ్రెస్ ఇచ్చిన రెండు అభ్యర్థిత్వాలను సమర్ధించారు. బీఆర్ఎస్ తరఫున ప్రతిపాదించిన అభ్యర్థిత్వాలను ఎలాంటి కారణం చెప్పకుండానే తిరస్కరించారు. దీనిపై సుదీర్ఘ కాలంగా వివాదం కొనసాగుతూనే ఉంది. ఇంతలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కోదండరామ్, అమీర్‌లను మండలికి పంపించింది. దీంతో బీఆర్ఎస్ నేతలు.. న్యాయపోరాటం ప్రారంభించారు. ఈ క్రమంలో బుధవారం వారికి అనుకూలంగా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
This post was last modified on August 13, 2025 9:25 pm
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకెక్కారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతతో వ్యవహారించాల్సిన ఆయన అత్యంత…
కొన్నేళ్లుగా టాలీవుడ్లో రీ రిలీజ్ మేనియా ఎలా నడుస్తోందో తెలిసిందే. ఇంట్లో కూర్చుని ఓటీటీల్లో లేదా యూట్యూబ్‌లో ఎప్పుడైనా చూసుకునే…
బాలీవుడ్ చరిత్రలో గొప్ప బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన దురంధర్ మొదటి భాగంలో హీరో కన్నా ఎక్కువ పేరు…
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గం ఒక్కసారిగా రాజకీయ చర్చకు వేదికగా మారింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి మంత్రి…
ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…
యువ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయకుడిగా.. యువ…