నాగిరెడ్డి సంగీత… ఉమ్మడి కృష్ణా జిల్లా గుడివాడ పరిధిలోని నిమ్మకూరు వాసి. నిమ్మకూరు అంటే ఠక్కున గుర్తుకు వచ్చే పేరు తెలుగు ప్రజల ఆరాధ్య నటుడు, తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడు, పేదల సంక్షేమానికి సరికొత్త అర్థం చెప్పిన నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, దివంగత నందమూరి తారక రామారావే కదా. అంటే ఈ సంగీతది కూడా ఎన్టీఆర్ స్వగ్రామమే అన్నమాట. యావత్తు తెలుగు జాతికే కాకుండా సినీ జగత్తులో ఉత్తుంగ తరంగాలకు ఎదిగిన ఎన్టీఆర్ అంటే ఇతర భాషల ప్రేక్షకులకూ అభిమానమే. అయితే ఆ అభిమానుల అందరి కంటే కూడా సంగీతకు ఎన్టీఆర్ పై ఉన్న అభిమానం మాత్రం మాటల్లో వర్ణించలేనిది.
ఎందుకంటే… 1982లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఏడాది తిరక్కుండానే 1983లో ఏపీ సీఎంగా విజయకేతనం ఎగురవేసిన ఎన్టీఆర్ అంటే సంగీతకు మరింత అభిమానం పెరిగినట్టుంది. ముందూవెనుకా ఆలోచించకుండా నిమ్మకూరును వదిలేసి నేరుగా హైదరాబాద్ చేరుకుంది. అప్పటిదాకా హైదరాబాద్ తో పరిచయం లేని సంగీత ఎలాగోలా వసతి చూసుకుని తన అభిమాన నాయకుడిని నిత్యం చూసే ఏర్పాట్టు చేసుకుంది. అందులో భాగంగా సచివాలయం పక్కగా ఓ బడ్డీ కొట్టు ఏర్పాటు చేసుకున్న ఆమె… సచివాలయానికి ఎన్టీఆర్ వస్తూ, పోతూ ఉన్నప్పుడు ఆయనను అలా చూసుకుంటూ తన్మయత్వానికి గురయ్యేవారు.
ఎన్టీఆర్ అనారోగ్య కారణాలతో 1995లోనే మరణించినా కూడా సంగీతకు ఆయనపై అభిమానం తగ్గలేదు. సొంతూరు నిమ్మకూరు గుర్తుకు రాలేదు. ఎన్టీఆర్ ను నిత్యం చూసుకునేందుకు ఏర్పాటు చేసుకున్న బడ్డీ కొట్టును నడుపుకుంటూ ఆమె ఇప్పటికీ అంటే… నేటికీ ఆమె సచివాలయం పక్కనే తాను నాడు కొట్టు ఏర్పాటు చేసుకున్న చోటే చిరు వ్యాపారం చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. అంటే ఎన్టీఆర్ పై అభిమానంతో నిమ్మకూరును వదిలి హైదరాబాద్ వచ్చి నేటికి సరిగ్గా 42 ఏళ్లు అవుతుంది. తన కొట్టులో అన్నగారి ఫొటోలు పెట్టుకుని వాటిని చూసుకుంటూ మురిసిపోతూ.. కొట్టుకు వచ్చిపోయే వారికి ఎన్టీఆర్ అంటే తనకు ఎంత అభిమానమో చెప్పుకుంటూ తరిస్తున్నారు.
సరే.. ఎప్పుడో యుక్త వయసులో ఎన్టీఆర్ పై అభిమానంతో హైదరాబాద్ వచ్చేసిన సంగీత వయసు కూడా పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం ఆమె వయసు ఎంతో స్పష్టంగా తెలియదు గానీ… వృద్ధాప్య ఛాయలకు దగ్గరయ్యారు. వయసు కారణంగా ఆమెను అనారోగ్యాలు కూడా చుట్టుముట్టాయి. అయితే చికిత్స చేయించుకునేందుకు మాత్రం ఆమె వద్ద అంతగా డబ్బు లేదు. 42 ఏళ్లుగా బడ్డీ కొట్టు నడుపుతున్న సంగీత సంపాదన ఆమె జీవనానికే సరిపోయి ఉంటుంది కదా. అందుకే ఆమె ఎన్టీఆర్ వారసుల్లో ఎవరో ఒకరు తనను ఆదుకోవాలని ఆమె ఆశిస్తున్నారు. అన్నగారిపై అజరామరమైన అభిమానం కలిగిన సంగీతకు నందమూరి ఫ్యామిలీ నుంచి సాయం అందుతుందని ఆశిద్దాం.
This post was last modified on August 12, 2025 6:41 pm
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…