Political News

‘అమ‌రావ‌తి’ కోసం స్వేదం చిందిస్తారా? అద్భుత చాన్స్‌!

ఏపీ రాజ‌ధాని.. అమ‌రావ‌తి నిర్మాణాన్ని సీఎం చంద్ర‌బాబు శ‌ర‌వేగంగా ముందుకు తీసుకువెళ్తున్నారు. 33 వేల ఎక‌రాల‌కు తోడు మ‌రో 44 వేల ఎక‌రాల‌ను కూడా స‌మీక‌రిస్తున్నారు. ఈ క్ర‌మంలో తెలుగు వారు తాము పుట్టిన నేల‌కు రుణం తీర్చుకునే అవ‌కాశాన్ని కూడా చంద్ర‌బాబు క‌ల్పిస్తున్నారు. స‌హ‌జంగానే చాలా మంది పుట్టి పెరిగిన నేల‌కు ఏమైనా చేయాల‌ని భావిస్తారు. వారి వారి సొంత ప్రాంతాల్లో ఏదో ఒక కార్య‌క్ర మం ద్వారా ఈ రుణం తీర్చుకునే ప్ర‌య‌త్నం చేస్తారు.

ఇలానే ఇప్పుడు.. అమ‌రావ‌తి కోసం కూడా సాయం చేసేందుకు ముందుకు రావాలని బావించే వారికి ఏపీ ప్ర‌భుత్వం అద్భుత‌మైన అవ‌కాశం క‌ల్పించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారు.. అమ‌రావ‌తి కోసం.. ప‌రోక్షంగా స్వేదం చిందించేందుకు ప్ర‌భుత్వం ఛాన్స్ ఇచ్చింది. ప్ర‌త్య‌క్షంగా ఈ మ‌హాక్ర‌తువులో పాలు పంచుకునే అవ‌కాశం లేనివారికి.. ప‌రోక్షంగా భాగ‌స్వామ్యం క‌ల్పిం చేందుకు స‌ర్కారు సిద్ధ‌మైంది. ఇంటికో పువ్వు ఈశ్వ‌రుడికి ఓ మాల‌.. అన్న చందంగా.. అమ‌రావ‌తిలో భాగ‌స్వామ్య‌మయ్యేందుకు ముందుకు రావొచ్చు.

ఎలా?

అమ‌రావ‌తి నిర్మాణానికి ఎక్క‌డి నుంచైనా ఎవ‌రైనా.. భాగ‌స్వామ్యం కావాల‌ని అనుకునే వారు.. రూ.10 నుం చి ఎంతైనా విరాళంగా ఇచ్చే వెసులుబాటును ప్ర‌భుత్వం క‌ల్పించింది. దీనికిగాను.. ఆన్‌లైన్ పోర్ట‌ల్‌ను సీఆర్ డీఏ ప్రారంభించింది. ‘crda.ap.gov.in’లోకి వెళ్తే.. రాజ‌ధాని విరాళం పేరుతో(డొనేష‌న్ టు అమ‌రావతి) ఒక లింకు క‌నిపిస్తుంది. దీనిపై క్లిక్ చేయ‌గానే.. క్యూఆర్ కోడ్ వ‌స్తుంది. దీనిని స్కాన్‌చేసి మీరు చెల్లించాల్సిన మొత్తం జమ చేయ‌వ‌చ్చు. అనంత‌రం.. మీ పేరుతో ఆటోమేటిక్‌గా ఓ రశీదు వ‌స్తుంది. దీనిపై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు సంత‌కం ఉంటుంది. మ‌రి ఇంకెందుకాల‌స్యం.. రాజ‌ధాని నిర్మాణానికి త‌లోచేయి వేద్దాం.!

This post was last modified on August 5, 2025 3:35 pm

Share

Recent Posts

సిరిసిల్ల కాదు.. ఉరిసిల్ల‌.. రెచ్చిపోయిన రేవంత్‌రెడ్డి

టార్గెట్ కేటీఆర్.. ల‌క్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. బీఆర్ఎస్ నాయ‌కుడు, మాజీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న…

41 minutes ago

సూపర్ హిట్ హీరోల విచిత్ర పరిస్థితి

ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…

3 hours ago

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

5 hours ago

కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…

5 hours ago

వాల్యూమ్ పెంచండి జైలర్ సాబ్

ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…

6 hours ago

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

7 hours ago