Political News

డెవ‌ల‌ప్‌మెంట్ క‌సి: ప‌రుగులు పెడుతున్న ఫ‌స్ట్‌టైమ్ ఎమ్మెల్యే.. !

ఆయ‌న తొలిసారి విజ‌యం ద‌క్కించుకున్నారు. దీంతో ప‌నులు పెద్ద‌గా చేయ‌క‌పోయినా.. ఎవ‌రూ అడ‌గ‌రు. పైగా.. ఐదుసార్లు గ‌తంలో గెలిచిన ఓ నాయ‌కుడిపై త‌ప్పులు మోపి.. తాను త‌ప్పించుకునేందుకు అవ‌కాశం కూడా ఉంది. అయినా.. స‌ద‌రు ఎమ్మెల్యే మాత్రం చూస్తూ కూర్చోవ‌డం లేదు. ఎదుటి వారి త‌ప్పులు ఎంచ‌డం కూడా త‌గ్గించారు. తాను ప‌నిచేసుకుని పోతున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో మునుపెన్న‌డూ లేని విధంగా అభివృద్ధి ప‌నుల‌ను ప‌రుగులు పెట్టిస్తున్నారు. ఆయ‌నే.. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులను తీసుకువ‌చ్చి.. గుడివాడ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తున్నా రు. వాస్త‌వానికి రాష్ట్రంలో స‌గంమందికి పైగా కూట‌మి ఎమ్మెల్యేలు.. రాష్ట్ర స‌ర్కారు ఇచ్చే నిధుల‌పైనే ఆధార‌ప‌డుతున్నారు. కానీ, కొంద‌రు మాత్ర‌మే కేంద్రం నుంచి నిధులు తెచ్చుకుంటున్నారు. ఇలాంటి వారిలో రాము ముందు వ‌రుసలో ఉన్నారు. గుడివాడ అభివృద్ధికి సహకరించాలని ఇటీవ‌ల విజ‌య‌వాడ‌కు వ‌చ్చిన‌ కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి విజ్ఞ‌ప్తి చేశారు. గ‌తంలోనూ ఆయ‌న రెండు సార్లు క‌లుసుకున్నారు.

నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌ధానంగా మురుగునీటి నిర్వ‌హ‌ణ‌, ర‌హ‌దారుల ఏర్పాటుకు ఎమ్మెల్యే రాము ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ క్ర‌మంలోనే వేలాది కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన అభివృద్ధి పనుల‌లో గుడివాడ‌ను కూడా చేర్చేలా రాము ప్ర‌య‌త్నించి స‌క్సెస్ సాధించారు. అదేస‌మయం లో గుడివాడ పట్టణంలోని ప్రధాన రహదారుల ఎండ్ టూ ఎండ్ అభివృద్ధికి, గుడివాడ – కంకిపాడు గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయించుకున్నారు. ఈ రెండు ప్రాజెక్టులు గ‌త ప‌దేళ్లుగా పెండింగులో ఉన్నాయని.. గ‌త నాయ‌కుడు ప‌ట్టించుకోలేద‌ని రాము చెబుతున్నారు.

ఈ క్ర‌మంలో అతి త్వరలో కేంద్ర నిధులతో ప్రధాన రహదారుల అభివృద్ధి పనులు ప్రారంభం కానున్నా యి. గుడివాడ పట్టణ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తున్నామని రాము చెబుతున్నారు. అలాగే అతి కొద్ది రోజుల్లోనే 8 కోట్ల రూపాయ‌ల‌ నిధులతో గుడివాడ పట్టణ వ్యాప్తంగా అనేక రహదారులు, డ్రైనేజీల నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. ఇలా.. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో రానున్న రోజుల్లో గుడివాడలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేప‌ట్టేలా.. ఇక్క‌డి స‌మ‌స్య‌లు తీర్చేలా.. రాము ప‌రుగులు పెడుతున్నార‌ని అంటున్నారు స్థానికులు.

This post was last modified on August 5, 2025 11:07 am

Share

Recent Posts

ఫౌజీ ప్లాన్ మారడం వెనుక ఏం జరిగింది

ప్రభాస్ అభిమానులు చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న అప్డేట్స్ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. డార్లింగ్ కెరీర్ లో బాహుబలి,…

46 minutes ago

తమన్ ఈసారి నెగిటివిటీని దాటేయాలి

టాలీవుడ్ లో చాలా కాలంగా తమన్ ముద్ర వినిపించడం లేదు. ఓజి టైంలో అంచనాలు అందుకున్నాడు కానీ ఆ తర్వాత…

1 hour ago

పండగ బోణీ చేయాల్సింది కళ్యాణే

పన్నెండు రోజుల ముందే టాలీవుడ్ బాక్సాఫీస్ దసరా పండగ మొదలైపోయింది. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఇవాళ ఆదర్శ కుటుంబం…

2 hours ago

5 కోట్ల వ‌ర‌కు జీఎస్టీ ఎగ్గొట్టారా…

వస్తు, సేవ‌ల ప‌న్ను.. జీఎస్టీ విధానంలో కీల‌క మార్పులు చేయ‌నున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రైనా వ్యాపారులు పారిశ్రామిక వేత్త‌లు.. జీఎస్టీ…

5 hours ago

మస్క్ అంబానీ మధ్య శాటిలైట్ ఫైట్

భారత దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ యుద్దానికి తెర లేచింది. మొట్టమొదటిసారిగా అంబానీ ఆధిపత్యానికి సవాల్ ఎదురైంది. ఈ క్రమంలో ప్రపంచ…

5 hours ago

గోదావరి పుష్కరాలకు నిధులు ఇవ్వండి మోదీజీ

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీతో ఏపీ సీఎం చంద్ర‌బాబు భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా అనేక అంశాల‌పై ఆయన కు విన‌తి…

8 hours ago