Political News

ట్రంప్ వ్యాఖ్యలను ఖండించాలన్న విపక్షాలకు మోదీ జవాబు

పార్ల‌మెంటు ఉభ‌య స‌భ‌లనూ కుదిపేస్తున్న కీల‌క అంశం… ఆప‌రేష‌న్ సిందూర్‌. ఈ ఏడాది ఏప్రిల్ 22న జ‌మ్ము క‌శ్మీర్‌లోని ప్ర‌ముఖ ప‌ర్యాట‌క ప్రాంతం ప‌హ‌ల్గాంలో ఉగ్ర‌వాదులు చెల‌రేగిపోయి.. ప‌ర్యాట‌కుల‌పై కాల్పులు జ‌రిపిన విష‌యం తెలిసిందే. పేర్లు, ఊర్లు అడిగి మ‌రీ ప‌ర్యాట‌కుల‌ను హ‌త మార్చారు. నేపాల్ పౌరుడు స‌హా ఈ ఘ‌ట‌న‌లో 26 మంది చ‌నిపోయారు. వీరిలో ఏపీకి చెందిన వారు కూడా ఉన్నారు. అయితే.. ఆ త‌ర్వాత చోటు చేసుకున్న ప‌రిణామాల క్ర‌మంలో కేంద్రం.. పాకిస్థాన్‌పై క‌న్రెర్ర చేసింది. పాక్‌లోని ఉగ్ర‌వాదులు, వారి స్థావ‌రాలే ల‌క్ష్యంగా `ఆప‌రేష‌న్ సిందూర్‌` పేరుతో దాడులు చేసింది.

మే 7వ తేదీ నుంచి వ‌రుస‌గా నాలుగు రోజులు జ‌రిగిన ఆప‌రేష‌న్ సిందూర్‌లో భార‌త్ పైచేయి సాధించింది. అయితే.. అనూహ్యం గా దీనిని ఆపివేస్తూ.. నిర్ణ‌యం తీసుకున్నారు. దీనికి తానే కార‌ణ‌మ‌ని.. త‌ను చెప్ప‌బ‌ట్టే పాక్, భార‌త్ రెండు దేశాలు ఆప‌రేష‌న్ సిందూర్‌ను ఆపేశాయ‌ని అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరు దేశాలు ప్ర‌క‌టించ‌డానికి ముందే.. ఆయ‌న సామాజిక మాధ్యమం ట్రూత్ లో పోస్టు చేశారు. తాను సుంకాలు వేస్తాన‌ని భ‌య పెట్టాన‌ని.. అందుకే రెండు దేశాలు దారికి వ‌చ్చాయ‌ని.. ఆయ‌న అప్ప‌ట్లోనే కాదు.. తాజాగా కూడా ప్ర‌క‌టించారు. ఇక‌, ఈ వ్య‌వ‌హారంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్తాయిలో విమ‌ర్శ‌లు గుప్పించింది.

ఆప‌రేష‌న్ సిందూర్‌ను ఎందుకు అర్ధంతరంగా ముగించారు? అస‌లు ప‌హ‌ల్గాంలోకి ఉగ్ర‌వాదులు ఎలా వ‌చ్చారు? ఈ విష‌యాన్ని భార‌త నిఘా వ‌ర్గాలు ఎందుకు గుర్తించ‌లేక పోయాయి? అస‌లు అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ ప్ర‌మేయం ఏంటి? మ‌న దేశ వ్య‌వ‌హారాల‌పై అమెరికా పెత్త‌నం ఏంటి? ప‌హ‌ల్గాం దాడికి ముందు రోజు ప్ర‌ధాని విదేశీ ప‌ర్య‌ట‌న‌ను అర్ధంత‌రంగా ముగించుకుని ఎందుకు వెన‌క్కివ‌చ్చారు? ఇలా.. అనేక ప్ర‌శ్న‌ల‌తో కాంగ్రెస్ పార్టీ కేంద్రాన్ని కార్న‌ర్ చేసింది. దీనిపై పార్ల‌మెంటును ప్ర‌త్యేకంగా స‌మావేశ ప‌ర‌చాల‌ని కూడా డిమాండ్ చేశాయి. అయితే.. అప్ప‌టి నుంచి మౌనంగా ఉన్న కేంద్ర ప్ర‌భుత్వం తాజా వ‌ర్షాకాల స‌మావేశాల్లో ఉభ‌య స‌భ‌ల్లోనూ 16 గంట‌ల చొప్పున స‌మ‌యం కేటాయించి.. చ‌ర్చ‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.

తాజాగా ప్ర‌ధాని మోడీ ఈ వ్య‌వ‌హారంపై స్పందిస్తూ.. లోక్ స‌భ‌లో కీల‌కోప‌న్యాసం చేశారు. ఆప‌రేష‌న్ సిందూర్‌ను ఆపేయాల‌ని త‌మ ప్ర‌భుత్వానికి ప్ర‌పంచ దేశాలు ఏవీ చెప్ప‌లేద‌ని.. దీనిలో ఎవ‌రి ప్ర‌మేయం కూడా లేద‌ని ఆయ‌న తేల్చి చెప్పారు. అంతేకాదు.. ఆప‌రేష‌న్ సిందూర్‌కు ప్ర‌పంచ దేశాల‌న్నీ.. మ‌ద్ద‌తుగా నిలిచాయ‌న్నారు. తాము పాకిస్థాన్‌పై యుద్ధం చేయ‌లేద‌న్నారు. ఉగ్ర‌వాదానికి వ్య‌తిరేకంగా మాత్ర‌మే దాడులు జ‌రిపామ‌ని తేల్చి చెప్పారు. ఉగ్ర‌వాదం విష‌యంలో స‌హించేది లేద‌ని తేల్చి చెప్పారు. ఈ విష‌యంలో పాకిస్థాన్‌కు స‌హ‌క‌రించే దేశాల‌ను కూడా ఉపేక్షించేది లేద‌ని తేల్చి చెప్పారు.

This post was last modified on July 29, 2025 8:16 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

19 minutes ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

55 minutes ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

2 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

4 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

6 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

10 hours ago