Political News

కేటీఆర్ కు చెప్పే వారే లేరా?

రంగం ఏదైనా సరే.. కొన్ని పరిమితులు ఉంటాయి. అందుకు రాజకీయాలు మినహాయింపు కాదు. అత్యుత్తమ స్థానాల్లో ఉన్న వారికి వ్యక్తిగతంగా ఉండే పరిచయాలు.. పార్టీలకు అతీతంగా బంధాలు.. అనుబంధాలు కామన్. ఎట్టి పరిస్థితుల్లోనూ తమకున్న వ్యక్తిగత సంబంధాల్ని దెబ్బ తీసుకునే రీతిలో ఏ ముఖ్యనేత వ్యవహరించరు. ఈ వైఖరికి భిన్నంగా వ్యవహరిస్తూ.. కొత్త సంప్రదాయానికి తెర తీస్తున్నారు కేటీఆర్. ఇలాంటి తీరుతో ఆయన పొందే ప్రయోజనం ఏమైనా ఉంటుందా? అంటే లేదనే చెప్పాలి. ఆ మాటకు వస్తే ప్రయోజనం సంగతి తర్వాత.. దారుణమైన డ్యామేజ్ ఖాయమన్న విషయాన్ని కేటీఆర్ ఎందుకు పట్టించుకోవటం లేదన్నది గులాబీ పార్టీలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
గులాబీ బాస్ కేసీఆర్ సంగతే తీసుకుందాం. ఆయనకు పలు పార్టీల ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. తనకు వ్యక్తిగత హోదాలో ఉన్న పరిచయాల్ని ఆయన ఎప్పుడూ బయటపెట్టింది లేదు. అంతేకాదు.. పార్టీలకు అతీతంగా ఉన్న అనుబంధాలకు సంబంధించి అంశాల్ని బయటపెట్టి వారిని ఇరుకున పడేసే పని చేయలేదు. అంతేకాదు.. వారికి సంబంధించిన వ్యాపార అంశాల్ని ప్రస్తావించింది లేదు. ఒకవేళ.. వారిని టార్గెట్ చేయాలనుకున్న వేళ.. మూడో కంటికి తెలీకుండా చుక్కలు చూపించేవారు. వారికి వారుగా శరణు మహాప్రభు అనేలా చేసే వారే తప్పించి.. నోటి మాటలతో రోడ్డు మీదకు విషయాల్ని తెచ్చింది లేదు.

అందుకు భిన్నంగా కేటీఆర్ శైలి ఉండటం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అధికారంలో ఉన్నప్పటి నుంచి ఆయనకు ఈ అలవాటు ఉండేదని.. కాకుంటే..ఈ మధ్యన అది శ్రుతిమించుతున్నట్లుగా చెబుతున్నారు. చంద్రబాబు జైలుకు వెళ్లిన సందర్భంలో సాయం కోసం లోకేశ్ ఫోన్ చేశారన్న విషయాన్ని చెప్పుకున్న ఆయన తీరు అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలకు గురి చేసింది. కష్టకాలంలో కొంత సాయాన్ని కోరితే.. ఆ విషయాల్ని బయటపెట్టేసి.. తన గొప్పతనాన్ని ప్రదర్శించుకునే వైనం.. ఎదుటి వారిని తక్కువ చేసే ధోరణి ఏ మాత్రం మంచిది కాదన్న అభిప్రాయం వ్యక్తమైంది.

తాజాగా బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ ఎపిసోడ్ తో కేటీఆర్ తీరు హాట్ టాపిక్ గా మారింది. నువ్వు రెండు అంటే.. నేను నాలుగు అంటా అనే తీరు రాజకీయాల్లో మామూలే. బంగారు పుట్టలో వేలు పెడితే.. కుట్టకుండా ఉంటానా? అన్న రీతిలో కేటీఆర్ మాటలకు.. సీఎం రమేశ్ తీవ్రంగా స్పందించటమే కాదు..గులాబీ యువనేతను ఇరుకున పడేసేలా చేశారని చెబుతారు. ఈ సందర్భంగా కేటీఆర్ రాజకీయ పరిణితి మీద పలు సందేహాలు వ్యక్తమయ్యే పరిస్థితి.

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డినే తీసుకుందాం. రాజకీయాలకు అతీతంగా ఉండే అనుబంధాల గురించి ఆయన మాట్లాడేది తక్కువ. టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆయనకుండే కోపం.. వ్యతిరేకత ఎంత చెప్పినా తక్కువే. ఆయన్ను టార్గెట్ చేసేందుకు ఉన్న ఏ అవకాశాన్ని వదిలి పెట్టరు. అంతటి కసి ఉన్నప్పటికీ.. ఎప్పుడూ ఆయన తన గీతను దాటే ప్రయత్నం చేయరు. అనూహ్య వ్యాఖ్యలు చేయాల్సి వస్తే.. తాను చేయకుండా తన విధయులతో అనిపిస్తారే కానీ.. తాను మాట జారే ప్రయత్నం చేయరు.

అంతేకాదు.. ఇతర పార్టీ నేతలకు సంబంధించిన వ్యాపార అంశాల్ని ఆయన ప్రస్తావించరు. టార్గెట్ చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ.. కేటీఆర్ లో మాత్రం ఈ లక్షణాలు కనిపించవు. అధికారం దూరమైన ఫస్ట్రేషన్ లో ఉన్న కేటీఆర్.. తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం దీర్ఘకాలంలో పనికి వచ్చే బంధాల్ని బీటలు వారేలా చేసుకుంటున్న తీరు ముక్కున వేలేసుకునేలా చేస్తున్నాయి. ఇలాంటి తీరు ఆత్మహత్యా సాదృశ్యమన్న విషయాన్ని ఆయనకు చెప్పే వారెవరూ లేరా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

కాలు జారినా ఫర్లేదు కానీ నోరు జారితే వెనక్కి తీసుకోవటం కష్టమనే పాత సామెతను కేటీఆర్ విస్మరిస్తున్నారా? తన రాజకీయ ప్రత్యర్థిని ఇరుకున పెట్టేందుకు.. తనకు వ్యక్తిగత హోదాలో ఉన్న పరిచయాల్ని బజరున పడేయటంలో ఉన్న తెలివి ఏమిటి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఈ నోరు జారుడు తీరుకు ఎంత త్వరగా చెక్ చెబితే అంతమంచిదని.. లేకుంటే ఈ విషయంలో తాను అనుసరిస్తున్న తీరు సరైనదేనా? కాదా? అన్న విషయాన్ని తన తండ్రి కేసీఆర్ ను అడిగి తెలుసుకుంటే మంచిదన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.

This post was last modified on July 28, 2025 10:16 pm

Share
Show comments
Published by
Satya
Tags: FeatureKTR

Recent Posts

ఈ సంక్రాంతికైనా జనంలోకి జగన్ వస్తారా?

రాష్ట్ర రాజ‌కీయాల్లో మార్పు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ప్ర‌జ‌ల నాడిని ప‌ట్టుకునే దిశ‌గా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. స‌హ‌జంగా అధికారంలో ఉన్న‌పార్టీలు…

2 hours ago

‘పార్టీ మారినోళ్లు రెండూ కానోల్లా?’

తెలంగాణ‌లో తాజాగా జ‌రిగిన పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ ఘ‌న విజ‌యం ద‌క్కించుకుంద‌ని.. ఇది 2029 వ‌ర‌కు కొన‌సాగుతుంద‌ని.. అప్పుడు…

4 hours ago

కూటమి కట్టక తప్పదేమో జగన్

వ్య‌క్తిగ‌త విష‌యాలే..  జ‌గ‌న్‌కు మైన‌స్ అవుతున్నాయా? ఆయ‌న ఆలోచ‌నా ధోర‌ణి మార‌క‌పోతే ఇబ్బందులు త‌ప్ప‌వా? అంటే.. అవున‌నే సంకేతాలు పార్టీ…

6 hours ago

ఎవ‌రికి ఎప్పుడు `ముహూర్తం` పెట్టాలో లోకేష్ కు తెలుసు

టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేత‌ల‌ను ఉద్దేశించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…

9 hours ago

‘ప్యారడైజ్’ బిర్యాని… ‘సంపూ’ర్ణ వాడకం అంటే ఇది

దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…

10 hours ago

జనసేనలోకి కాంగ్రెస్ నేత – షర్మిల ఎఫెక్టేనా?

రాజ‌కీయాల్లో మార్పులు జ‌రుగుతూనే ఉంటాయి. ప్ర‌త్య‌ర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామ‌మే ఉమ్మ‌డి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…

12 hours ago