పీ-4 పథకంలో భాగంగా పేదలను దత్తత తీసుకోవాలని పలువురిని సీఎం చంద్రబాబు కోరుతున్న విషయం తెలిసిందే. అయితే, ఈ విషయంలో వైసీపీ నాయకుల నుంచి విమర్శలు వస్తున్నాయి. పీ-4 పథకం కింద నారా కుటుంబమే కొన్ని కుటుంబాలను దత్తత తీసుకోవచ్చు కదా! అని ఇటీవల వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ వ్యాఖ్యానించారు. ఇతర నాయకులు, సోషల్ మీడియాలోనూ ఇదే తరహా కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఈ విమర్శలపై స్పందించిన చంద్రబాబు, వాటికి చెక్ పెట్టారు. తాను కూడా పీ-4 కింద కుటుంబాలను దత్తత తీసుకుంటానని ప్రకటించారు. శుక్రవారం సాయంత్రం పీ-4 పథకంపై సమీక్ష సమావేశం నిర్వహించిన ఆయన, తాను కూడా కొన్ని బంగారు కుటుంబాలను దత్తత తీసుకుంటానని స్పష్టంచేశారు.
ఆగస్టు 10వ తేదీ నాటికి పేదల (బంగారు కుటుంబాలు) గుర్తింపు ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరగాలని, ఎటువంటి విమర్శలకు తావు ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
“ప్రతిపక్షం మనం మంచి చేస్తే కూడా విమర్శలు చేస్తోంది. అలాంటి అవకాశాలు ఇవ్వకుండా కచ్చితంగా చర్యలు తీసుకోవాలి. తప్పులు జరగకుండా చూడాలి. నేను కూడా కొన్ని బంగారు కుటుంబాలను దత్తత తీసుకుంటాను,” అని చంద్రబాబు పేర్కొన్నారు.
పారిశ్రామిక వర్గాలు, కార్పొరేట్ సంస్థలతో కలిసి బంగారు కుటుంబాలను దత్తత తీసుకునే విషయంలో చర్చించాలని సూచించారు. ఆగస్టు 15 నాటికి మొత్తం 15 లక్షల బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఇప్పటివరకు ఐటీ, పరిశ్రమల రంగాలకు చెందిన 57,000 మంది వ్యక్తులు పేదలను దత్తత తీసుకోవడానికి ముందుకు వచ్చారని అధికారులు వివరించారు. వారి వివరాలను ఆన్‌లైన్‌లో ఉంచి, వారి సేవలను ప్రజల ముందు ప్రదర్శించాలని, తద్వారా మరిన్ని మంది ముందుకు వచ్చేందుకు ప్రోత్సాహం కలిగించాలని చంద్రబాబు సూచించారు.
పల్నాడు జిల్లాలో ఎక్కువ మంది ఈ కార్యక్రమంలో ముందుకు వచ్చారని, ఇతర జిల్లాల్లోనూ అదే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కుటుంబాలకు ఆటోమేటెడ్ మెసేజ్‌ల ద్వారా సమాచారం అందిస్తున్నామని, పీ-4 పథకంపై ఉన్న సందేహాలు, విమర్శలను వెంటనే నివృత్తి చేయాలని ఈ సమావేశంలో చంద్రబాబు పేర్కొన్నారు.
This post was last modified on July 25, 2025 10:04 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…