వైసీపీ హయాంలో ఆ పార్టీ ఎమ్మెల్సీ, తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరానికి చెందిన అనంతబాబు తన సొంత కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యంను దారుణంగా హత్య చేసి, మృతదేహాన్ని కారులో తీసుకెళ్లి డ్రైవర్ కుటుంబ సభ్యులకు అప్పగించిన విషయం తెలిసిందే. ఈ కేసు 2022లో రాష్ట్రంలో పెద్ద సంచలనం సృష్టించింది.
హత్య చేయడంతో పాటు మృతదేహాన్ని డోర్ డెలివరీ చేయడం తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ కేసును తాజాగా పునర్విచారణ చేయాలంటూ రెండు రోజుల క్రితం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక కోర్టు తీర్పు వెలువరించింది.
ఈ కేసును తిరగదోడేందుకు ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) కూడా నియమించింది. ప్రభుత్వ చర్యలకు మద్దతుగా ఎస్సీ, ఎస్టీ కోర్టు అనుకూల తీర్పు ఇచ్చింది. దీంతో అధికారులు అనంతబాబును విచారించేందుకు రెడీ అయ్యారు.
అయితే ఈ తీర్పుపై స్టే ఇవ్వాలంటూ అనంతబాబు హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే విచారణ పూర్తైందని, పునర్విచారణ అవసరం లేదని ఆయన తరఫు న్యాయవాది వాదించారు.
అయితే హైకోర్టు ఈ వాదనను తోసిపుచ్చింది. “ఈ కేసులో కుట్ర కోణం ఉంది. ఆర్థిక లావాదేవీలు సహా ఇతర కారణాలు ఉన్నాయని సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులకు అనుమానం ఉంది. అందుకే మరింత లోతుగా విచారించాల్సిన అవసరం ఉంది” అని బాధిత కుటుంబ తరఫున న్యాయవాది వాదించారు.
బాధితుల తరఫున వాదించిన న్యాయవాది వాదనలతో ఏకీభవించిన హైకోర్టు, ఎస్సీ ఎస్టీ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వడాన్ని నిరాకరించింది. “ఈ కేసు లోతుల్లోకి వెళితే తప్పేముంది? పిటిషనర్ ప్రమేయం లేకపోతే మీకే మంచిది కదా!” అంటూ కోర్టు అనంతబాబు తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది.
ఇరు పక్షాల వాదనలు ముగియడంతో స్థానిక కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వకుండా హైకోర్టు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
ఇదిలా ఉండగా, కేసును మరోసారి విచారించేందుకు ప్రభుత్వం సిట్‌ను నియమించింది. బాధితుల తరఫున వాదనలు వినిపించేందుకు ప్రముఖ న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావును కూడా నియమించారు.
10 లక్షల పరిహారం
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సుబ్రహ్మణ్యం కుటుంబానికి రూ.10 లక్షల సాయం అందించింది. అలాగే, కేసును పునర్విచారించాలన్న వారి అభ్యర్థనను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది.
అప్పట్లో వైసీపీ హయాంలో తూతూ మంత్రంగా విచారించారనీ, అనంతబాబు తానే హత్య చేసినట్టు ఒప్పుకున్నా, తగిన కారణాలు వెలికితీయలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. దీనివెనుక మరికొంత మంది ప్రమేయం ఉన్నట్టు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పునర్విచారణకు ప్రాధాన్యం ఏర్పడింది.
This post was last modified on July 25, 2025 8:51 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…