కూటమిలోని మంత్రుల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్. ఈ విషయం అందరికీ తెలిసిందే. కొందరు బాగా పనిచేస్తుంటే మరికొందరు నెమ్మదిగా ప్రజల మధ్యకు వెళ్తున్నారు. ప్రభుత్వం చెప్పింది నెమ్మదిగా చేస్తున్నారు. అయితే వీరిలోనూ ఒకరిద్దరూ తమంతట తాముగా కొన్ని కొన్ని కార్యక్రమాలను నిర్దేశించుకుని, పనిచేస్తున్న మంత్రులు కూడా కనిపిస్తున్నారు. ఇలాంటి వారిలో ఒకరిద్దరి పేర్లు చంద్రబాబు దృష్టికి కూడా వెళ్లాయి. తాజాగా జరిగిన మంత్రివర్గంలో వారిని చంద్రబాబు ప్రశంసించారు.
వీరిలో పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పేరు ప్రముఖంగా వినిపించింది. మంత్రి నారా లోకేష్ తర్వాతి స్థానంలో ఆయన ఉన్నారని చంద్రబాబు చెప్పడం విశేషం. కర్నూలు జిల్లాకు చెందిన భరత్ తొలిసారి గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్నారు. ఆ వెంటనే యువతను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో చంద్రబాబు భరత్ కు అవకాశం కల్పించారు. పరిశ్రమలు, ఐటీ శాఖలను కూడా ఆయనకే అప్పగించారు. ఈ రెండు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత కీలకమైన విషయం తెలిసిందే.
పెట్టుబడులు, ఉద్యోగాలు, ఉపాధి కల్పన వంటివి ఈ రంగాల ద్వారానే జరగాల్సి ఉంది. గత ఎన్నికల సమయంలో ఏటా నాలుగు లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని చంద్రబాబు చెప్పారు. ఇది సాకారం కావాలంటే పరిశ్రమల ప్రోత్సాహం, ఐటి రంగంలో వృద్ధి వంటివి, అత్యంత కీలకం. ఎక్కడికి వెళ్లినా చంద్రబాబు కూడా ఈ రెండు రంగాలను ప్రోత్సహిస్తున్నారు. ఈ రెండు రంగాల గురించే మాట్లాడుతు న్నారు. పెట్టుబడులు కూడా తీసుకోవచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయంతో పాటు ఉపాధి, ఉద్యోగ, కల్పనలకు కూడా పరిశ్రమల రంగం, ఐటి రంగం అత్యంత కీలకంగా మారాయి. ఈ రెండు రంగాల విషయంలో ఆ శాఖ మంత్రిగా ఉన్న టీజీ భరత్ దూకుడుగా వ్యవహరిస్తున్నారన్నది చంద్రబాబు చెప్పిన మాట. పెట్టుబడులను ఆహ్వానించడంలోనూ పరిశ్రమలను ప్రోత్సహించడంలోనూ అనుకూల విధానాలను ప్రభుత్వానికి సూచించడంలోనూ భరత్ బాగా పని చేస్తున్నారని ఆయన ప్రశంసించారు. ప్రస్తుతానికి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు చాలా కంపెనీలు ముందుకు వచ్చాయి.
ఇప్పటివరకు 12 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు వచ్చినట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. దీనిలో సగం పెట్టుబడులు మంత్రి ప్రమేయంతో వచ్చాయని అన్నారు. దీనిని బట్టి మంత్రివర్గంలో టీజీ భరత్ దూకుడుగా ఉన్నారు అన్నది తెలుస్తోంది. మునుముందు ఆయన ఇంకా పుంజుకునే అవకాశం ఉందని భవిష్యత్తులో రాణించేందుకు ఆయనకు స్కోప్ ఉందని చంద్రబాబు ప్రశంసించారు. కాగా మంత్రి నారా లోకేష్ వర్గంలో టీజీ భరత్ ఉన్న విషయం తెలిసిందే. ఇదే ఆయనకు మంత్రి పదవిని కూడా దక్కేలా చేసిందని రాజకీయ వర్గాల్లో కొన్ని విశ్లేషణలు ఉన్నాయి.
This post was last modified on July 25, 2025 6:29 pm
టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…
సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…
వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…