కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డి నేతృత్వంలో జరిగిన ఓబులాపురం మైనింగ్ అక్రమాల వ్యవహా రంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిని విచారించాల్సిందేనని.. ఆమె పాత్ర సుస్పష్టంగా ఉందని.. తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ఆమెను విచారించేందుకు సీబీఐ, ఈడీలకు అవకాశం కల్పిస్తున్నట్టు తేల్చి చెప్పింది. వాస్తవానికి ఇదే కోర్టు గతంలో గనుల కేసులో శ్రీలక్ష్మికి ప్రమేయం లేదని తేల్చి చెప్పింది. దీంతో ఆమెను కేసు నుంచి తప్పించాలని సీబీఐ, ఈడీలకు కూడా ఆదేశాలు జారీ చేసింది.
అయితే.. సీబీఐ, ఈడీలు.. ఈ ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. దీనిని విచారించిన సుప్రీంకోర్టు రెండు మాసాల కిందట.. ఈ కేసులో శ్రీలక్ష్మి పాత్ర స్పష్టంగా ఉందని తెలుస్తోందని.. ఆమెను కేసు నుంచి ఎలా తప్పిస్తారని.. ప్రశ్నించింది. మరోసారి దీనిపై హైకోర్టు విచారణ చేసి.. ఆదేశాలు ఇవ్వాలని తెలిపింది. దీంతో హైకోర్టులో మరోసారి శ్రీలక్ష్మి.. తనను ఈ కేసు నుంచి తప్పించాలని కోరుతూ.. రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే.. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో శ్రీలక్ష్మి కేసును విచారించాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది.
సీబీఐ వాదనలు వినకుండా గతంలో ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకుంటున్నామని హైకోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆమె పాత్రను మరోసారి నిగూఢంగా విచారించాల్సిందేనని తేల్చి చెప్పింది. తాజాగా మరోసారి ఈ కేసును విచారించిన హైకోర్టు.. శ్రీలక్ష్మిని విచారించాల్సిందేనని పేర్కొంది. ఈ మేరకు అదికారులకు అన్ని అనుమతులు ఇస్తున్నామని తెలిపింది.
కాగా.. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కేటాయించిన ఓబులాపురం మైనింగ్ కు సంబంధించి.. శ్రీలక్ష్మి అన్ని అనుమతులు ఇచ్చారని.. ఆమె ఉద్దేశ పూర్వకంగానే ఈ అక్రమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నది సీబీఐ చేసి ఆరోపణ. అయితే.. ప్రభుత్వం తీసుకున్న విధాన పరమైన నిర్ణయాలకు మాత్రమే తాను అనుమతి ఇచ్చానని, అధికారిగా తన పాత్ర పోషించానని శ్రీలక్ష్మి చెబుతున్నారు. అందుకే.. ఈ కేసు నుంచి తనను తప్పించాలని కోరుతున్నారు.
This post was last modified on July 25, 2025 2:06 pm
దసరా పండగ సందర్భంగా విడుదల కాబోతున్న సినిమాల్లో రణబాలి మీద భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ, రష్మిక…
ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…
ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్లయిపోయింది. అసలే ఫ్లాపుల్లో ఉన్న అతడికి…
భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…
యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…