రాష్ట్రంలో ఒక్కొక్క నియోజక వర్గానికి ఒక్కొక్క చరిత్ర ఉంది. రాజకీయంగా.. జనాభా పరంగా.. మౌలిక సదుపాయాల పరంగా కూడా.. ఒక్కొక్క నియోజకవర్గం విశిష్టత ఒక్కొక్కరకం. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. మార్పులు, చేర్పులు అంటూ నాయకులు హామీ ఇస్తుంటారు. వెనుక బడిన ప్రాంతాలుగా ఉన్నవాటిని అభివృద్ధి చేస్తామని.. ప్రజల జీవన ప్రమాణాలను మారుస్తామని కూడా చెబుతారు. అదేవిధంగా రాజకీయాలు కూడా మారుతాయని హామీలు గుప్పిస్తారు. అయితే.. అవి ఏమేరకు సాకారం అవుతాయన్నది ప్రశ్న.
ఈ పరంగా చూసుకుంటే.. మంత్రి నారాలోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో ఈ మూడు విషయాల్లోనూ మార్పులు వచ్చాయని తాజాగా టీడీపీ నాయకులు చెబుతున్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మంత్రి అనుచరులు, కీలక నాయకులు నియోజకవర్గంలో పర్యటి స్తున్నారు. మంత్రి బిజీగా ఉండడంతో ఈ కార్యక్రమం బాధ్యతలను వారికి అప్పగించారు. దీంతో ప్రతి ఇంటికీ వెళ్తున్నారు. ఈ క్రమంలో ప్రజల అభిప్రాయలు తెలుసుకుంటున్నారు.
ప్రధానంగా పైన చెప్పుకొన్న మూడు కోణాల్లోనూ ప్రజల్లో వచ్చిన మార్పులను నమోదు చేసుకుంటున్నారు. రాజకీయం పరంగా గతంలో ఉన్న వివాదాలు.. తగువులు.. ఘర్షణలు ఇప్పుడు లేవని ప్రజలు చెబుతు న్నారు. వైసీపీ తరఫున పెద్దగా నోరు విప్పేనాయకులు లేరు. అసలు బయటకు వచ్చే నాయకులు కూడా కనిపించడం లేదు. దీంతో ప్రజలు రాజకీయంగా ఎలాంటి వివాదాలు లేకుండా ప్రశాంతంగా ఉంటున్నా మని చెప్పుకొచ్చారు. అలాగే.. మౌలిక సదుపాయాల పరంగా కూడా అభివృద్ధి కనిపించింది.
నియోజకవర్గంలోని దిగువ ప్రాంతాలకు.. రహదారులు ఏర్పడ్డాయి. విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేసి.. గ్రామీణ ప్రాంతాలకు విద్యుత్ ఇస్తున్నారు. ఇంటింటికీ తాగు నీరు అందించే లక్ష్యంతో మంగళగిరిలోని గ్రామీణ ప్రాంతాల్లో ముమ్మరంగా పనులు జరుగుతున్నాయి. ఇక, ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు ఉపాధి పనులకు మంత్రి నారా లోకేష్.. వివిధ రూపాల్లో సాయం చేస్తున్నారు. ముఖ్యంగా చేనేతలకు ఆదరణ ఎక్కువగా లభిస్తోంది. అదేవిధంగా ఇతర చేతి వృత్తులకు కూడా ప్రోత్సాహం బాగుందని ఇక్కడి వారు చెబుతున్నారు. దీంతో నియోజకవర్గంలో వచ్చే నాలుగేళ్లలో సమున్నత మార్పులు ఖాయమని అంచనా వేస్తున్నారు.
This post was last modified on July 21, 2025 3:27 pm
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…
సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…
వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…