Political News

పిఠాపురంలో వైసీపీ ఉన్న‌ట్టా.. లేన‌ట్టా… ?

జ‌న‌సేన అధినేత‌, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌త్య‌ర్థి ప‌క్షం అంటూ లేకుండా పోయిందా? ముఖ్యంగా వైసీపీ త‌ర‌ఫున వాయిస్ వినిపించ‌డం లేదా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. గ‌తంలో వైసీపీ త‌ర‌ఫున విజ‌యం ద‌క్కించుకున్న పెండెం దొర‌బాబు.. నేరుగా జ‌న‌సేన‌లోనే చేరిపోయారు. ఇది వైసీపీని ఏమీ చేయ‌ద‌ని మొద‌ట్లో అనుకున్నా.. ఆయ‌న వ‌ర్గం, ఆయ‌న అనుచ‌రులు ఇప్పుడు గుండుగుత్త‌గా.. జ‌న‌సేన‌ వైపే ఉన్నారు.

ఇక‌, వైసీపీ త‌ర‌ఫున గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసిన‌.. వంగా గీత కూడా ఇప్పుడు పిఠాపురానికి క‌డు దూరంలో ఉన్నారు. ఆమె ఎక్క‌డా నియ‌జక‌వ‌ర్గంలో క‌నిపించ‌డం లేదు. ఇటీవ‌ల వైసీపీ అధినేత జ‌గ‌న్.. బాబు మేనిఫెస్టోపై కార్య‌క్ర‌మానికి పిలుపునిచ్చారు. ప్ర‌తి ఇంటికీ వెళ్లాల‌ని.. చంద్ర‌బాబు మాట త‌ప్పార‌న్న విష‌యాన్ని పూస‌గుచ్చిన‌ట్టు వివ‌రించాల‌ని నాయ‌కుల‌కు తేల్చి చెప్పారు. కానీ, చిత్రం ఏంటంటే.. ఇది కూడారాష్ట్రంలో పెద్ద‌గా వ‌ర్క‌వుట్ కాలేదు. ముఖ్యంగా పిఠాపురంలో అస‌లు లేద‌నే చెప్పాలి.

తొలి రెండు రోజులు వంగా గీత కొంత ప్ర‌య‌త్నం చేశారు. బాబు మేనిఫెస్టో పై కార్య‌క్ర‌మం నిర్వ‌హించేందుకు నాయ‌కుల‌ను, అనుచ‌రుల‌ను స‌మాయ‌త్తం చేసే ప్ర‌య‌త్నం చేశారు. కానీ, ఆమె చేసిన ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌లేదు. పైగా.. వంద మంది కూడా.. ఆమె పెట్టిన స‌మావేశానికి రాలేదు. దీంతో ఆమె.. త‌న ఇంటికే ప‌రిమితం అయ్యారు. అంతేకాదు.. తొలి ఆరు మాసాల్లో కొంత మేర‌కు.. వాయిస్ వినిపించినా.. త‌ర్వాత‌.. గీత విమ‌ర్శ‌ల జోలికి కూడా పోలేదు. పిఠాపురంలో రెండు మూడు ఘ‌ట‌న‌లు జ‌రిగినా.. ఆమె స్పందించ‌లేదు.

దీనికి కూడా కార‌ణం ఉంద‌ని పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతోంది. వంగా గీత ఇప్పుడు అభ‌ద్ర‌తా భావంతో ఉ న్నార‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. టీడీపీ నాయ‌కుడు వ‌ర్మ అసంతృప్తితో ఉన్న నేప‌థ్యంలో ఆ యన‌కు వైసీపీ వ‌ల విసురుతోంది. ఆయనకు భారీ ఎత్తున మీడియాలోక‌వ‌రేజీ ఇస్తోంది. సో.. రేపు ఆయ‌న మ‌న‌సు మార్చుకుని వైసీపీలోకి వ‌స్తే.. పిఠాపురం టికెట్ ఆయ‌న ఖాతాలోకి వెళ్తుంది. అలాంట‌ప్పుడు.. తాను నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించి.. ప‌వ‌న్‌పై విమ‌ర్శ‌లు చేయ‌డం ఎందుకు? అనే ధోర‌ణిలో గీత ఉన్నార‌ని ఒక‌టాక్‌. ఇలా.. ఏవిధంగా చూసినా.. పిఠాపురంలో వైసీపీ ఇప్ప‌టికైతే.. లేద‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on July 19, 2025 11:01 am

Share

Recent Posts

ముఖ్యమంత్రి పదవికి దీప్కే రాజీనామా

అదేంటి కాక్రోచ్ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడని బిత్తర పోతున్నారా..? అప్పుడే ఆయన తన పదవికి రాజీనామా…

3 hours ago

కొండా సురేఖకు కేబినెట్ హోదా?

తెలంగాణా అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిణామాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కొండా సురేఖ…

5 hours ago

ఇరుముడి న‌టుడు… రోజుకు 40 వేలు

హీరో హీరోయిన్ల‌కు.. పెద్ద టెక్నీషియ‌న్ల‌కు అంటే సినిమాకు ఏక మొత్తంగా పారితోష‌కాలు ఇస్తారు. కానీ చిన్న చిన్న క్యారెక్ట‌ర్లు చేసేవాళ్ల‌కు…

5 hours ago

నాలుగు స్థంభాలాటలో విజేత ఎవరంట

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు నలుగురు వంద రోజుల గ్యాప్ లో పరస్పరం తమ సినిమాలతో తలపడుతున్నారు. ఒకరు గాంధీ…

6 hours ago

కీర్తి సురేష్ ఇంత హాటైపోయిందేంటబ్బా..

మామూలుగా స్టార్ హీరోయిన్ల నుంచి కెరీర్ ఆరంభంలో గ్లామర్ మోతాదు ఎక్కువ ఉంటుంది. క్రమంగా గ్లామర్ పాత్రలు తగ్గించుకుని, పెర్ఫామెన్స్…

7 hours ago

ట్రైలర్ లేకుండా సినిమా… వాటి రిజల్ట్ తెలుసా?

నేచురల్ స్టార్ నాని కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కి, భారీ అంచనాలతో రాబోతున్న సినిమా.. ది ప్యారడైజ్. ఏకంగా రూ.200…

7 hours ago