వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఏపీ హైకోర్టు బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే.. ఈ వ్యవహారంపై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తమ వాదన వినకుండా.. క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను అర్ధం చేసుకోకుండా.. తాము ఇచ్చిన నివేదికను కూడా పరిశీలించకుండానే హైకోర్టు బెయిల్ ఇచ్చిందని ప్రభుత్వం తరఫున న్యాయవాది సుప్రీంకోర్టుకు వివరించారు. ఈ వాదనలను పరిశీలనలోకి తీసుకున్న కోర్టు.. వంశీకి బెయిల్ ఎలా ఇచ్చారు? అంటూ.. హైకోర్టును ప్రశ్నించింది.
ప్రభుత్వం తరఫున వాదనలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందని.. అలాంటిది అసలు వాదనలే వినకుండా.. ఒక వ్యక్తికి బెయిల్ ఎలా ఇస్తారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో వంశీకి బెయిల్ మంజూరు చేస్తూ.. హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెడుతున్నామని వ్యాఖ్యానించింది. ఇదేసమయంలో వంశీని తిరిగి అరెస్టు చేసేందుకు అవకాశం ఇవ్వాలన్న ప్రభుత్వ వాదనను కూడా పక్కన పెట్టి.. కేసులో వాదనలు వినిపించాలని పేర్కొంది.
తిరిగి ఈ కేసును విచారించాలని.. ప్రభుత్వం తరఫున వాదనలు కూడా వినాలని హైకోర్టుకు సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. నెల రోజుల్లో మరోసారి ప్రభుత్వ వాదనలు విని.. మరోసారి తీర్పు చెప్పాలని హైకోర్టును ఆదేశించింది. అయితే.. తాము కేసు మెరిట్స్‌లోకి వెళ్లడం లేదని.. పేర్కొంది. ముందస్తు బెయిల్ ఇచ్చేముందు.. కేసు పూర్వాపరాలతో పాటు.. నిందితుడిపై ఉన్న అభియోగాలు.. పూర్వ చరిత్రను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది.
ఏం జరిగింది?
వైసీపీ నాయకుడు, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సుమారు.. 7 నెలలపాటు జైల్లోనే ఉన్నారు. ఆయనపై 6 కేసులు నమోదయ్యాయి. తొలి దఫా 5 కేసుల్లో ఆయనకు బెయిల్ వచ్చింది. ఇక, చివరి కేసు.. పేదలకు నకిలీ ఇళ్ల పట్టాలతో ఇళ్లను పంపిణీ చేశారన్న కేసులో హైకోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చింది. దీనిని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. తీవ్ర అభియోగాలు ఉన్నాయని.. అలాంటప్పుడు బెయిల్ ఎలా ఇస్తారని ప్రశ్నించింది.
This post was last modified on July 17, 2025 1:25 pm
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…