Political News

బ్యాక్ బెంచ్ మినిస్ట‌ర్స్ వీరేనా? ఏం జ‌రుగుతుంది ..!

ఏపీ సీఎం చంద్ర‌బాబు మంత్రి వ‌ర్గంలో 25 మంది మంత్రులు ఉన్నారు. దీనిలో ముఖ్య‌మంత్రి, ఉప ము ఖ్య‌మంత్రి పోస్టులు ప‌క్క‌న పెడితే.. 23 మంది మినిస్ట‌ర్లు అవ‌కాశం ద‌క్కించుకున్నారు. వీరిలోనూ జ‌న‌సేన కు చెందిన ఇద్ద‌రు, బీజేపీకి చెందిన ఒక‌రిని ప‌క్క‌న పెడితే.. మ‌రో 20 మంది అచ్చంగా టీడీపీ కి చెందిన మంత్రులే ఉన్నారు. వీరిపైనే సీఎం చంద్ర‌బాబుకు చాలా ఆశ‌లు ఉన్నాయి. అనేక వ‌డ‌పోత‌లు, సామాజిక వ‌ర్గాల స‌మీక‌ర‌ణ‌ల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని వారికి చాన్స్ ఇచ్చారు.

ఎంతో మంది నాయ‌కులు మంత్రి ప‌ద‌వులు ఆశించినా.. వారిని ప‌క్క‌న పెట్టిన చంద్ర‌బాబు.. ఏరికోరి యు వ నాయ‌కుల‌ను, తొలిసారి విజ‌యం ద‌క్కించుకున్న‌వారిని కూడా త‌న టీంలో చేర్చుకున్నారు. వీరంతా దూకుడుగా ప‌నిచేస్తార‌ని ఆశించారు. అయితే.. మంత్రులుగా ఉన్న వారిలో కొంద‌రు యాక్టివ్‌గా ఉంటే.. మ‌రికొందరు దీనిని ప్రొఫెష‌నల్‌గా భావిస్తున్నారు. అంటే.. దీనిని ఉద్యోగంగా భావిస్తున్నార‌న్న‌ది సీఎం చంద్ర‌బాబు స్వ‌యంగా చెబుతున్న‌మాట‌.

వాస్త‌వానికి మంత్రి అంటే.. ప‌ర్మినెంట్ ఎంప్లాయిమెంటు కాదు. ఇది జీతంతో కూడిన పొలిటిక‌ల్ ఎంప్లాయిమెంటు. ప్ర‌త్య‌ర్థుల‌ను ప్ర‌జ‌ల‌కు దూరం చేయ‌డం ద్వారా.. అధికార పార్టీ ప్ర‌జ‌ల‌కు ద‌గ్గ‌రై.. ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసుకుని.. ద‌క్కించుకున్న ప‌ద‌వులు. వీటిని మ‌ళ్లీ మ‌ళ్లీ కాపాడుకోవాల‌న్నా.. మ‌రోసారి స‌ర్కారు ను ఏర్పాటు చేసుకోవాల‌న్నా.. ప్ర‌త్య‌ర్థుల‌ను సాధ్య‌మైనంత వ‌ర‌కు ప్ర‌జ‌ల‌కు దూరంగా ఉంచే ప్ర‌య‌త్నా లు చేయాలి. అది మాట రూపంలోనో.. ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకునే ప‌నులు చేయ‌డం ద్వారానో చేయాలి.

ఈ విష‌యంలోనే 6-8 మంది టీడీపీ మంత్రులు వెనుక‌బ‌డుతున్నార‌ని చంద్ర‌బాబు చెబుతున్నారు. వీరిలో కొల్లు రవీంద్ర‌, మండ‌ప‌ల్లి శ్రీనివాస‌రెడ్డి, బీసీ జ‌నార్ధ‌న్‌రెడ్డి, కొలుసు పార్థ‌సార‌థి, మ‌హమ్మ‌ద్ ఫ‌రూక్‌, స‌విత వంటి వారు తొలి వ‌రుస‌లో ఉన్నార‌న్న‌ది సీఎంవో వ‌ర్గాలు చెబుతున్నాయి. ప‌నితీరు ఆధారంగా వీరికి మంచి మార్కులు ఉన్నా.. ప్ర‌త్య‌ర్థిని క‌ట్ట‌డి చేయ‌డంలో మాత్రం వీరు వెనుకాడుతున్నార‌ని.. బ‌ల‌మైన రాజ‌కీయాలు చేయ‌లేక‌పోతున్నార‌ని సీఎం చంద్ర‌బాబు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అందుకే.. వీరి విష‌యంలో అంత‌ర్మ‌థ‌నం చెబుతున్నార‌ట‌.

This post was last modified on July 15, 2025 3:47 pm

Share

Recent Posts

ఆ పరిస్థితిలో హనుమాన్ చాలీసాను పఠించిన కెప్టెన్

హీరో అయ్యేందుకు ఏళ్ల పాటు శ్ర‌మించేవారు కొంద‌రైతే.. తాము చేసిన ప‌నుల కార‌ణంగా చూపిన ధైర్య సాహ‌సాల కార‌ణంగా రాత్రికి…

48 minutes ago

చిన్న సినిమా సృష్టిస్తున్న సంచలనం పెద్దదే

కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే…

2 hours ago

మల్టీస్టారర్ మూవీకి మర్చిపోలేని అవమానం

కాంబినేషన్ మత్తులో ఇప్పటికీ చాలా మంది ప్రొడ్యూసర్లు, దర్శకులున్నారు. ప్రాక్టికల్ గా క్షేత్ర స్థాయిలో ప్రేక్షకులు ఎలా అప్డేట్ అయ్యారో…

3 hours ago

ఆంధ్రా ముద్దుబిడ్డ అనంత్ అంబానీ

నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి. ఈ అందమైన రాష్ట్రాభివృద్ధికి నావంతుగా ఏం చేయాలో... ఎలా సేవ చేయాలో గైడెన్స్ ఇవ్వండని…

4 hours ago

చాక్లెట్లు తీసుకొని టిక్కెట్లు ఇచ్చిన సీఎం

తమిళనాడు సీఎం విజయ్ రీల్ లైఫ్ సీఎం మాదిరి చేస్తున్న కొన్ని పనులు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తన డ్రైవర్…

4 hours ago

వివేకా కేసులో అవినాష్ రెడ్డి చుట్టూ ఉచ్చు

వైఎస్ వివేకా మర్డర్ కేసు విచారణ వైసీపీ హయాంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నరీతిలో సాగిందని వివేకా తనయురాలు…

5 hours ago