Political News

పాపం వెంటాడ‌డ‌మంటే ఇదే క‌దా.. కాకాణీ?!

చేసిన పాపం ఊరికే పోదంటారు పెద్ద‌లు. క‌ళ్ల‌ ముందు క‌నిపిస్తున్న కొన్ని విష‌యాల‌ను గ‌మ‌నిస్తే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు కూడా. రాజ‌కీయాల్లో ఎప్పుడు చేసిన పాపం.. అప్పుడే పేరుకుని.. అనంత‌ర కాలంలో అనుభ‌వించేలా చేస్తోంద‌ని కూడా చెబుతున్నారు. తాజాగా నెల్లూరు జిల్లా స‌ర్వేప‌ల్లి మాజీ ఎమ్మెల్యే కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డిని ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండు రోజుల పాటు ఆయ‌న‌ను క‌స్టడీకి తీసుకుని విచారించ‌నున్నారు.

గ‌నుల కేసులో నెల్లూరు జైల్లో ఉన్న కాకాణిని.. ఎక్సైజ్ శాఖ పోలీసులు అరెస్టు చేయ‌డం జిల్లాలో సంచ‌లనంగా మారింది. ఇది కూడా.. 2024 నాటి కేసు కావ‌డం గ‌మ‌నార్హం. అప్ప‌టి ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌ల‌కు మ‌ద్యం పంచేందుకు.. నియోజ‌క‌వ‌ర్గంలో ఓట‌ర్ల‌ను ఆక‌ర్షించేందుకు కాకాణి .. ఓ ర‌హ‌స్య ప్రాంతంలో మ‌ద్యాన్ని నిల్వ చేశార‌న్న‌ది కేసు సారాంశం. ఈ కేసునే ఇప్పుడు తిర‌గ‌దోడి.. ఎక్సైజ్ పోలీసులు ఆయ‌న‌ను అదుపులోకి తీసుకున్నారు. దీనిలోనూ ఆయ‌న అరెస్ట‌యితే.. మ‌ళ్లీ జైలుకు వెళ్లాల్సిందే.

అయితే.. సాధార‌ణంగా ఎన్నిక‌ల స‌మ‌యంలో నాయ‌కులు ఎవ‌రూ మందు పంపిణీ చేయలేదా? ఒక్క కాకాణి మాత్ర‌మే మ‌ద్యం పంపిణీ చేశారా? అనే డౌటు రావొచ్చు. నిజ‌మే దాదాపు 95 శాతం మంది నాయ‌కులు.. మ‌ద్యం పంపిణీ చేశార‌ని ఏడీఆర్ రిపోర్టే వెల్ల‌డించింది. కాబ‌ట్టి.. కాకాణి దీనికి అతీతులు కారు. కానీ… ఆయ‌న అధికారంలో ఉన్న‌ప్పుడు చేసిన పాపాలే ఇప్పుడు వెంటాడుతున్నాయి. తాను అధికారంలో ఉన్న‌ప్పుడు టీడీపీ నాయ‌కుల‌పై.. అక్ర‌మ మ‌ద్యం (హైద‌రాబాద్ నుంచి నెల్లూరుకు త‌ర‌లించార‌ని) కేసులు పెట్టించార‌న్న వాద‌న ఉంది.

ముఖ్యంగా సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి(ప్ర‌స్తుత ఎమ్మెల్యే) అనుచ‌రుల పై కాకాణి అప్ప‌ట్లో క‌సి తీర్చుకు న్నార‌ని టీడీపీ నాయ‌కులు ఇప్ప‌టికీ చెబుతారు. ఈ పాప‌మే ఇప్పుడు కేసుల రూపంలో కాకాణిని వెంటాడు తోంద‌న్న‌ది టీడీపీ నాయ‌కుల మాట‌. ఏదేమైనా.. చేసుకున్న పాపం.. అనుభ‌వించాల్సిందేన‌ని వారు వ్యాఖ్యానిస్తున్నారు.

This post was last modified on July 12, 2025 4:00 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘మీ మతంలో జరిగినా అలాగే మాట్లాడతారా జగన్’

తిరుమల పరకామణి చోరీ ఘటనపై మాజీ సీఎం వైఎస్‌ జగన్ చేసిన వ్యాఖ్యలను డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ తీవ్రంగా…

51 minutes ago

ఆఖర్లోనూ సిక్సర్లు కొడుతున్న బాలీవుడ్

గత కొన్నేళ్లుగా సౌత్ సినిమాల ఆధిపత్యం ముందు బాలీవుడ్ నిలవలేకపోతోంది. ఒక సంవత్సరంలో ఓవరాల్ పెర్ఫామెన్స్ పరంగా చూసుకున్నా.. హైయెస్ట్…

2 hours ago

బ్రేకింగ్: రేపు కోర్టులో లొంగిపోనున్న పిన్నెల్లి బ్రదర్స్

పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడు డబుల్ మర్డర్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి…

2 hours ago

ఇక్కడ వైసీపీ విమర్శలు.. అక్కడ కేంద్రం ప్రశంసలు

ఏపీ ఎడ్యుకేషన్‌ మోడల్‌ ఇప్పుడు జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటోంది. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా విధానాలు అందరి…

2 hours ago

మీ సొమ్ము మీరే తీసుకోండి: మోదీ

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ఆసక్తికర విష‌యాన్ని దేశ ప్ర‌జ‌ల‌తో పంచుకున్నారు. ``ఇది మీ సొమ్మా.. అయితే.. సొంతం చేసుకోండి.…

3 hours ago

దురంధర్ భామకు దశ తిరుగుతోంది

ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ దురంధర్ అంచనాలకు మించి ఆడేస్తోంది. మరీ జవాన్, పఠాన్ రేంజులో కాదు కానీ రణ్వీర్…

5 hours ago