ఏపీలో సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై కుట్రలు జరుగుతున్నాయనే ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా గడిచిన ఏడాది కాలంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టించేందుకు, అదేవిధంగా ఉద్యోగాల కల్పన, ఉపాధి కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఈ క్రమంలోనే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు పెట్టే వారికి ఆహ్వానం పలుకుతూ రాష్ట్ర ప్రభుత్వం వారికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటోంది.
అయితే, రాష్ట్రంలోకి పెట్టుబడులు రాకుండా నిలువరించేలా, పెట్టుబడులు పెట్టే వారిని బెదిరించేలా ప్రతిపక్ష వైసిపి నాయకులు ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు తరచుగా వ్యాఖ్యానిస్తున్నారు. తమ ప్రభుత్వంపై కుట్రలు పన్నుతున్నారని కూడా చెబుతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటివరకు ఆధారాలు కనిపించలేదు. దీంతో చంద్రబాబు చేస్తున్న ప్రచారంలో వాస్తవం ఎంత అనేది ప్రశ్నగా మారిపోయింది. ఇప్పుడు తాజాగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తమ ప్రభుత్వంపై జరుగుతున్న కుట్రలను ఆధారాలతో సహా బయటపెట్టారు.
రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులను అడ్డుకునే లాగా వైసిపి తెర వెనుక కుట్రలు పన్నుతోందని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చే పెట్టుబడులను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పుకొచ్చారు. రాష్ట్ర మైనింగ్ శాఖలో పెట్టుబడులు పెట్టేందుకు తాము ఆహ్వానించామని. ఈ క్రమంలో మైనింగ్ శాఖపై కల్పిత ఆరోపణలతో వైసిపి కుట్ర పన్నిందని ఆయన చెప్పుకొచ్చారు. ఉదయ భాస్కర్ అనే వైసిపి అభిమానితో దాదాపు 200కు పైగా ఈ మెయిళ్లు.. పెట్టించి పెట్టుబడులను అడ్డుకున్నారని దీంతో 9 వేల కోట్ల రూపాయల మేరకు పెట్టుబడులు నిలిచిపోయాయని ఆయన చెప్పారు.
అదేవిధంగా వైసీపీకి చెందిన సీనియర్ నాయకులు కూడా ప్రెస్ మీట్ లు పెట్టి ప్రభుత్వంపై వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని దీంతో పెట్టుబడులు పెట్టేవారు రాకుండా చూడాలన్నదే వారి ప్రధాన ఉద్దేశం గా ఉందని మంత్రి చెప్పుకొచ్చారు. 200 ఈ-మెయిళ్లకు సంబంధించిన సమాచారాన్ని ఆయన మీడియా ముందు ప్రదర్శించారు. ఇటువంటి అసత్య ప్రచారాలను మానుకోవాలని రాష్ట్ర అభివృద్ధి చెందేందుకు కుదిరితే కలిసి పని చేయాలని లేకపోతే మౌనంగా ఉండాలని సీరియస్ గా వ్యాఖ్యానించారు.
ఒకవైపు సోషల్ మీడియాలో, మరోవైపు ఈ మెయిల్ రూపంలో తమ ప్రభుత్వంపై కుట్రలు పన్నుతూనే మరోవైపు న్యాయస్థానాల్లోనూ పెట్టుబడులు రాకుండా పిటిషన్లు వేయిస్తున్నారని మంత్రి చెప్పుకొచ్చారు. అయినా తమ ప్రభుత్వం ముందుకే సాగుతుందని ఇటువంటి కుట్రలను కచ్చితంగా భగ్నం చేస్తామని వ్యాఖ్యానించటం గమనార్హం.
This post was last modified on July 9, 2025 11:41 am
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…