కొత్తగా రాష్ట్ర కమిటికి అధ్యక్షునిగా నామినేట్ అయిన మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుకు జాతీయ అధ్యక్షుడు చంద్ర బాబునాయుడు షాకిచ్చారా ? అవుననే అనిపిస్తోంది పార్టీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే. పార్టీ కార్యాలయంలో అట్టహాసంగా నిర్వహించాలని అనుకున్న రాష్ట్ర కమిటి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం వాయిదా పడిందట. దీపావళి పండుగకు ముందు తన ప్రమాణస్వీకారోత్సవం చేయాలని అచ్చెన్నాయుడు అనుకున్నారట. అనుకున్నదే తడవుగా ఇదే విషయాన్ని చంద్రబాబుతో మాట్లాడేందుకు ఫోన్ చేశారట.
అయితే అచ్చెన్న చెప్పిందంతా విన్న తర్వాత ఆ కార్యక్రమానికి తాను వచ్చేది లేదంటు చంద్రబాబు చల్లగా చెప్పారట. కరోనా వైరస్ మళ్ళీ పెరుగుతున్న విషయాన్ని గుర్తుచేసిన చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని భారీ ఎత్తున కాకుండా సింపుల్ గా కానీచ్చేయమని సలహా కూడా ఇచ్చారట. ఆ కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర పార్టీ కార్యాలయంలో కాకుండా ఇంకెక్కడైనా ఫంక్షన్ హాలులో నిర్వహించుకుంటే బాగుంటుందని కూడా సలహా ఇచ్చారట. దాంతో అచ్చెన్న అశ్చర్యపోయినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
పార్టీ అధ్యక్షుడి బాధ్యతలు తీసుకునే కార్యక్రమంతో పాటు మొత్తం కార్యవర్గమంతా ప్రమాణస్వీకారం పార్టీ కార్యాలయంలో చేయటమే రివాజుగా వస్తోంది. అలాకాకుండా ఇఫుడు మాత్రం పార్టీ కార్యకార్యాలయంలో కాకుండా ఇంకేదో ఫంక్షన్ హాలులో పెట్టుకోవాలని చెప్పటం ఏమిటో అచ్చెన్నాకు అర్ధంకాలేదట. అసలే రాష్ట్ర కార్యవర్గం ఏర్పాటులో తనకు మాట మాత్రం కూడా చెప్పకుండా చంద్రబాబే ఏకపక్షంగా చేసేశారనే మంట అచ్చెన్నలో ఉందట. దానికి తోడు ఇఫుడు బాధ్యతల స్వీకార కార్యక్రమానికి కూడా తాను రానని చెప్పటం, పార్టీ కార్యాలయంలో కాకుండా ఫంక్షన్ హాలులో పెట్టుకోమని చెప్పటం పై అచ్చెన్నలో అసంతృప్తి మొదలైనట్లు సమాచారం. చూద్దాం ఏం జరుగుతుందో.
This post was last modified on November 16, 2020 2:29 pm
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…