భద్రత- అభద్రతల మధ్య వైసీపీ అధినేత జగన్ ఊగిసలాడుతున్నారా? తను ప్రజల్లోకి వస్తే ప్రభుత్వం భద్రత కల్పించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారా? లేక ప్రభుత్వాన్ని ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టాలని భావిస్తున్నారా? అనేది రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. ప్రస్తుతం జగన్ విషయాన్ని ప్రభుత్వం సీరియస్ గానే తీసుకుంది. అయితే, ఆయనకు కల్పించే భద్రత విషయంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కంటే మాజీ ముఖ్యమంత్రిగా మాత్రమే పరిగణలోకి తీసుకుంటోంది. వాస్తవానికి మాజీ ముఖ్యమంత్రి కి ఉండే భద్రతకు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి ఉండే భద్రతకు మధ్య పెద్ద వ్యత్యాసం లేకపోయినా ప్రజల్లోకి వచ్చినప్పుడు తేడా కనిపిస్తుంది.
ప్రధాన ప్రతిపక్ష నాయకుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉండకపోయినా.. ఆయనకు కల్పించే భద్రత వేరుగా ఉంటుంది. మాజీ ముఖ్యమంత్రి కి మాత్రం ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి కల్పించే భద్రత కంటే కొంచెం తక్కువగానే ఉంటుంది. అప్పటికి ఉన్న పరిస్థితులను అంచనా వేయకుండా.. గతంలో ఉన్న పరిస్థితులను మాత్రమే అంచనా వేసుకుని మాజీ ముఖ్యమంత్రులకు భద్రత కల్పిస్తారు. ప్రస్తుతం చంద్రబాబుకు జెడ్ ప్లస్ కేటగిరి భద్రత కల్పించినా.. బ్లాక్ క్యాట్ కమాండోలా భద్రత కల్పించినా గతంలో ఆయన ఎదుర్కొన్న సమస్యలు, ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని తీసుకున్న నిర్ణయాలు అన్న విషయం అందరికీ తెలిసిందే.
ఆ రకంగా చూసినప్పుడు జగన్‌కు గతంలో ఇంత పెద్ద ఎత్తున ప్రాణాలకు హాని కలిగించే ఘటనలు ఏవి జరగలేదు. కాబట్టి మాజీ ముఖ్యమంత్రికి కల్పించే భద్రతనే ప్రస్తుతం కల్పిస్తున్నారు. అయితే తన పర్యటనలో ప్రజలు ఎక్కువగా వస్తున్నారని, రోప్ వే ఏర్పాటు చేయాలనేది జగన్ చెబుతున్న మాట. జెడ్ ప్లస్ కేటగిరి భద్రతకు రోప్ వేకు సంబంధం లేదనేది ప్రభుత్వ వాదన. రోప్ వే అనేది ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు మాత్రమే కల్పిస్తారు లేదా అధికారంలో ఉన్న నాయకులు వెళ్లినప్పుడు వారికి ప్రజల నుంచి ఒత్తిడి ఉన్నప్పుడు మాత్రమే ఈ తరహా భద్రత ఉంటుంది.
ఇప్పుడు ఇదే భద్రతను జగన్ ఆశిస్తున్నారు. దీనికి ప్రభుత్వం అంగీకరించటం లేదు. ప్రస్తుతం ఈ విషయం హైకోర్టు పరిధిలో ఉన్నప్పటికీ వైసీపీ మాత్రం దీనిని రాజకీయంగా తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తోంది. గతంలో జగన్ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఓదార్పు యాత్రలు చేసినప్పుడు ఆయన అడగకుండానే అప్పటి చంద్రబాబు ప్రభుత్వం రోప్ వే ను ఇచ్చింది. దీనికి కారణం అందరికీ తెలిసిందే. ఆయన అప్పట్లో 67 మంది ఎమ్మెల్యేలతో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ హోదాను జగన్ కోల్పోయిన నేపథ్యంలో రోప్ వే ఇవ్వడం లేదనేది ప్రభుత్వం వైపు నుంచి వస్తున్న వాదన.
జడ్ ప్లస్ కేటగిరీ భద్రతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన నియమాలను గమనిస్తే చుట్టూ నలుగురు సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు భద్రత కల్పించాలి. ఎవరైనా కలుసుకునేందుకు వస్తే వారి వివరాలు తీసుకుని వారిని పంపించాలి. గన్మెన్లు నిరంతరం రక్షణ కల్పించాలి. ఇంతకుమించి జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్నంత మాత్రాన జనంలోకి వస్తే రోప్ వే ఏర్పాటు చేయాలని గాని వందల మందితో భద్రత కల్పించాలని కానీ ఈ నియమ నిబంధనలలో ఎక్కడా లేదనేది పోలీసు వర్గాలు చెబుతున్న మాట. ఈ నేపథ్యంలోనే భద్రత అభద్రతల మధ్య జగన్ ఊగిసలాడుతున్నారనేది రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ప్రస్తుతానికి జగన్ మాజీ ముఖ్యమంత్రి మాత్రమేనని మంత్రి అనిత చెప్పిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు.
This post was last modified on July 5, 2025 3:58 pm
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…